collapse
...
Home / జాతీయం / మొన్న‌నే పుట్టిన రోజు వేడుకలు.. ఇంత‌లోనే... - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Te...

మొన్న‌నే పుట్టిన రోజు వేడుకలు.. ఇంత‌లోనే...

2022-06-03  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

accident aaa
Courtesy:Twitter/@ANI   


అప్ప‌టివ‌ర‌కూ ఎంతో సంతోషంగా  ఉన్న ఆ కుటుంబంలో ఒక్క‌సారిగా పెను విషాదం అలుముకుంది.  నాలుగు రోజుల క్రితం సంబ‌రంగా గ‌డిపిన క్ష‌ణాల‌ను ఆస్వాదిస్తూ క‌బుర్లు   చెప్పుకుంటూ  వ‌స్తున్నత‌రుణంలో వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు   ఓ టెంపోను ఢీకొని మంట‌ల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో 8 మంది అక్క‌డిక‌క్క‌డే మంట‌ల్లో చిక్కుకుని స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మ‌గిలిన వారిలో 12 మందిని ర‌క్షించ‌గ‌లిగారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఆస్ప‌త్రికి చికిత్స కోసం త‌ర‌లించారు.  క‌ర్నాట‌క‌లోని క‌ల‌బుర్గి స‌మీపంలో శుక్ర‌వారం ఉద‌యం  ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.  ప్ర‌మాద స్థ‌ల‌మంతాద బీభ‌త్సంగా మారిపోయింది. మంట‌ల్లో త‌గ‌ల‌ప‌డుతున్న బ‌స్సు దృశ్యాలు, బాధితుల ఆర్త నాదాల‌తో ఆ ప్రాంత‌మంతా భీతావ‌హంగా ఉంది. గాయాల‌తో ఉన్న వారి ఏడుపులు, స‌న్నిహితుల‌ను కోల్పోయిన బంధువుల  ఏడుపుల‌తో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద చాయ‌లు నెల‌కొన్నాయి.  మంట‌ల్లో చిక్కుకున్న  బ‌స్సు పూర్తిగా ద‌గ్ధ‌మై కేవ‌లం అస్థిపంజ‌రంగా  మారింది.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలిలా ఉన్నాయి.     

హైదారాబ‌ద‌ద్ కు చెందిన అర్జున్ కుమార్  అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యులు,బందువులు, స‌న్నిహిత మిత్రుల‌ను మొత్ం 26 మందిని  వేడుక‌ల‌కు ఆహ్వానించాడు. ఈ వేడుక‌లు గోవాలో సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని  వీరంద‌రినీ గ‌త ( మే నెల‌) నెల 29 వ తేదీన గోవా తీసుకెళ్ళాడు.  అక్క‌డ అంతా క‌లిసి అర్జున్ కుమార్  పుట్టిన‌రోజు  వేడుకల్లో సంబరాలు చేసుకుంటూ ఉత్సాహంగా గ‌డిపి తిరిగి వ‌స్తున్నారు.  ఈ ఉద‌యం క‌ర్నాట‌క‌లోని క‌ల‌బురిగి సీమ‌పంలోకి వ‌చ్చే స‌రికి వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు ఎదురుగా వ‌స్తున్న టెంపోను ఢీకొంది. ఏసీ బ‌స్ కావ‌డంతో  వెంట‌నే మంట‌లు చెల‌రేగాయి. దీంతో కొంద‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గ‌లిగినా 8 మందివ మాత్రం ఆ మంట‌ల్లో సస‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. బ‌స్సు  టెంపోను ఢీకొని బోల్తా ప‌డ‌డంతో అందులోని ప్ర‌యాణీకులు బ‌య‌టికి రాలేక పోయార‌ని తెలుస్తోంది. అతి ప్ర‌యాస మీద 12 మందిని ర‌క్షించ‌గ‌లిగారు వారిని చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వారిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.ప్ర‌మాద స‌మ‌యంలో  బ‌స్సు సిబ్బంది స‌హా 35 మంది ప్ర‌యాణిస్తున్నారు. వీరిలో ఇద్ద‌రు డ్రైర్లు, ఒక క్లీన‌ర్ ఉండ‌గా ఒక డ్రైవ‌ర్  ఆచూకీ తెలియ‌డంలేదు. మ‌రొక‌రు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

మృతులంతా తెలంగాణ వాసులే..     

ఈ ప్రమాదంలో మ‌ర‌ణించిన వారంతా తెలంగాణ వాసులేన‌ని చెబుతున్నారు. వీరు హైద‌రాబాద్ న‌గ‌ర వాసులే.  మృతుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. అర్జున్‌(35),స‌ర‌ళ‌(32),ర‌వ‌ళి(30), అనిత‌(40), దీక్షిత్ (9), అర్జున్(5),అర్జున్‌(5),మ‌రో ఇద్ద‌రు ఉన్నారు. మొన్న‌నే పుట్టిన‌రోజు జ‌రుపుకున్న అర్జున్ కుమార్ కూడా ఈ ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.వీరు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు ఆరెంజ్ ట్రావెల్సుకు చెందింది. ఆ సంస్థ‌ ప్ర‌తినిధి సునిల్ మాట్లాడుతూ  తాము ఇద్ద‌రి డ్రైవ‌ర్లు ఒక క్లీన‌ర్ తో బ‌స్స‌ న‌డుపుతామ‌ని, ప్రతి 300 కిలోమీట‌ర్ల‌కు డ్రైవ‌ర్ ఖ‌చ్చివ‌తంగా మారేలా ఏర్పాట్లు చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌మాదానికి పూర్తి కార‌ణాలు ఇంకా త‌మ‌కు తెలియ‌లేద‌నివ మ‌రికొంత సేప‌ట్లో  అన్ని వివ‌రాలు  తెలిసే అవ‌కాశం ఉంద‌న్నారు.

  
 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి    



2022-06-03  News Desk