నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'అంటే సుందరానికీ'. ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసింది యూనిట్.ఇప్పటికే విడుదలైన టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు విడుదలైన ట్రైలర్ 'అంటే సుందరానికీ' చిత్రంపై అంచనాలని భారీగా పెంచింది. సుందర్, లీలా థామస్ పాత్రలో నాని, నజ్రియాల ప్రేమకథ సరికొత్తగా, మ్యాజికల్ గా అనిపిస్తుంది. ట్రైలర్ లో కనిపించిన ప్రతి పాత్ర నవ్వులు పంచింది.
ట్రైలర్ లో చూపించిన 'అంటే సుందరానికీ' కథ నేపధ్యం చాలా ఆసక్తికరంగా వుంది. సుందర్, లీలా వేరు వేరు ప్రపంచాలు. వారి కుటుంబాలు కూడా పూర్తిగా భిన్నం. సుందర్ కి ఒక పెద్ద కల వుంది. దాన్ని సాధించడానికి వాళ్ళే కుటుంబమే పెద్ద అడ్డంకి, ఇది చాలదన్నట్టు లీల, సుందర్ జీవితంలో వస్తుంది. తర్వాత కథ ఎలాంటి ఆసక్తికరమైన మలుపు తిరిగుందో తెలుసుకోవాలంటే 'అంటే సుందరానికీ' చూడాల్సిందే.
ట్రైలర్ లో నాని మార్క్ నటన, టైమింగ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయ బ్రహ్మణ కుర్రాడిగా అద్భుతంగా కనిపించారు. సుందర్ పాత్రలో అమాయకత్వంతో పాటు చాలా వైవిధ్యం వుంది. లీలా పాత్రలో నజ్రియా స్క్రీన్ ప్రజన్స్ అందంగా వుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ మార్క్ ఫన్ అడుగడుగునా ఆకట్టుకుంది. రొమాంటిక్ ట్రాక్ కూడా చాలా కొత్తగా ఆకట్టుకుంది. ట్రైలర్ చివర్లో వచ్చిన టీవీ ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలిచింది. సాంకేతికంగా అత్యున్నత స్థాయి పనితీరు కనిపించింది. ఈ సినిమాలో రెండో హీరోయిన్‌కు కూడా అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం సమంతను తీసుకుంటున్నారట. ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో పాటు ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. ట్రైలర్ కట్ చేయడం కూడా చాలా అద్భుతంగా కట్ చేశారని చెప్పాలి.
ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్ పని చేస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 10న మూడు భాషల్లో ఒకేసారి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల కానుంది. ఈ చిత్రం తమిళ వెర్షన్‌కి 'అడాడే సుందరా' అనే టైటిల్‌ని పెట్టగా, మలయాళ వెర్షన్‌కి 'ఆహా సుందరా' అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. భారీ ఎత్తున ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో దసరా విడుదల కానుంది.