చాలా సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో ఓ స్టైలిష్ట దివాగా స్థిరపడింది బుట్టబొమ్మ పూజా హెగ్దె. బెస్పోక్ ఎత్నిక్ వేర్ , సమ్మర్ అవుట్‌ఫిట్స్, రెడ్ కార్పెట్ రెడీ గౌన్స్ఇలా అద్భుతమైన అవుట్‌ఫిట్స్ ఈ స్టార్ వార్డ్‌రోబ్‌లో కొలువుదీరాయి. ఏదేమైనప్పటికీ పూజ ఎత్నిక్ లుక్స్ ఆమె అభిమానుల హృదయాలను అమితంగా ఆకట్టుకుంటాయి. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు చీరకట్టిని...సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. తాజాగా బంగారు వర్ణంలో ఉన్న లెనిన్ చీరను కట్టుకుని ధగధగా మెరిసిపోయింది. తాజాగా ఓ వెడ్డింగ్ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం పూజా దిగిన పిక్స్ ను చూసిన వారంతా ఆమె నుంచి చూపు తిప్పుకోలేకపోతున్నారు.
సొగసులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజ:
ఇటీవలె చెన్నైకి వెళ్లిన పూజా హెగ్దె ఓ ఈవెంట్ కోసం బంగారు వర్ణంలో ఉన్న లెనిన్ చీరను కట్టుకుని అందంగా ముస్తాబైంది. ఈ సందర్భంగా చీరకట్టుతో చేసిని ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ చీరకట్టు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్
ఈ బుట్టబొమ్మ ఓ బంగారు బొమ్మ అంటు కితాబు ఇచ్చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఫోటోల కింద "స్మైల్, స్పార్కిల్, షైన్ ఆల్ థింగ్స్ గోల్డెన్ " అని క్యాప్షన్‌ను జోడించింది. అనవిలా ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్ నుంచి ఈ అధిరిపోయే చీరను ఎన్నుకుంది పూజా హెగ్దె.
గోల్డెన్ శారీతో మైండ్ బ్లాక్ :
పూజా కట్టుకున్న చీర మెటాలిక్ గోల్డ్ , డార్క్ గోల్డ్ షేడ్స్ తో వచ్చిన ఓంబ్రే టోన్డ్ ఫ్యాబ్రిక్ తో రూపొందించారు డిజైనర్లు. లెనిన్, జరీ ఫ్యాబ్రిక్‌ను ఉపయోగించి ఈ ఆరుగజాల చీరను తీర్చిదిద్దారు. పెళ్లిల్లైనా, ఫంక్షన్లైనా , ఇంట్లో జరిగే స్పెషల్ ఈవెంట్లకైనా ఈ చీరను కట్టుకుని అదరగొట్టవచ్చంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఈ చీరను ఎంతో అందంగా ట్రెడిషనల్ స్టైల్లో కట్టుకుంది పూజా హెగ్దె. ఇక కొంగుకు ఫ్రిల్స్ పెట్టుకోకుండా భుజాల మీదులగా జారేలా వదులుకుంది. ఈ చీరకు జోడీగా రౌండ్ నెక్లైన్ , హాఫ్ లెన్త్ స్లీవ్స్ కలిగిన గోల్డ్ లెనిన్ బ్లౌజ్‌ను వేసుకుంది. ఈ చీర ఖరీదు అక్షరాలా రూ.40వేలు . అనవిలా వెబ్సైట్లో గోల్డెన్ హార్ మెటాలిక్ లెనిన్ శారీ అని అందుబాటులో ఉంది.
అట్రాక్షన్‌గా నిలుస్తున్న అత్యంత విలువైన రాళ్ల హారం:
ఈ చీరకు మరింత్ లుక్‌ను అందించేందుకు మినిమల్ ఆక్సెసరీస్ను మాత్రమే ఎన్నుకుంది పూజా. చేతికి బంగారు గాజులు, స్టేట్మెంట్ ఉంగరాలను పెట్టుకుంది. అత్యత విలువైన రాళ్లతో అలంకరించబడిన బంగారు నెక్లెస్‌ను మెడలో వేసుకుంది. తన ముఖానికి తగ్గట్లుగా మెస్సీ హెయిర్ స్టైల్ తో అందరిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. కనురెప్పలకు మెరిసేటి బంగారపు ఐ ష్యాడో, మస్కరా దిద్దుకుని, పెదాలకు బెర్రీ టోన్డ్ లిప్ షేడ్ వేసుకుని, మెరిసేటి ఛర్మంతో అదరగొట్టింది ఈ చిన్నది.
గోల్డెన్ మినీ డ్రెస్‌లో వెరీ హాట్ :
ఈ మధ్యనే అత్యంత గ్రాండ్‌గా బీటౌన్ లో జరిగిన కరణ్ జోహర్ బర్త్ డే పార్టీ కోసం ఈ సుందరి గోల్డెన్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని యూత్‌లో హీట్‌ను పెంచింది. అదిరిపోయే మిని డ్రెస్‌తో అందరి మైండ్ బ్లాక్ చేసింది. ప్లంగింగ్ నెక్లైన్తో వచ్చిన స్ట్రాపీ స్పగెట్టీ డ్రెస్ లో ఎంతో హాట్‌గా కనిపించి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. డివీ మేకప్‌తో ఎంతో గ్లామరస్‌గా కనిపించింది ఎత్నిక్ వేర్‌లోనే కాదు మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లోనూ ఈ భామ అందాలు చూడటానికి రెండుకళ్లు సరిపోవంటున్నారు అభిమానులు.