గుండె పోటు. యువతకు పెను ముప్పుగా మారుతోంది. ఇటీవలి కాలంలో చాలా చిన్న వయసులోనే ముగ్గురు సెలబ్రిటీలు హఠాత్త్గా ప్రాణాలు కోల్పోవడంతో ఈ సమస్య అందరిలో ఆందోళనకు కారణంగా మారింది. పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ శుక్లా, ఇప్పుడు కెకె ముగ్గురూ గుండె పోటు కారణంగానే అకాల మరణానికి గురయ్యారు. ఈ ముగ్గురి ఉదంతాలు యువతను భయపెట్టే స్థాయిలో వెలుగు చూశాయి. అలా ఆక్స్మికంగా గుండెపోటు బారిన పడడానికి దారితీస్తున్న కారణాల గురించిన ఆలోచనలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. గుండె పోటుకు టైప్ 2 డయాబిటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, తదితర అనుబంధ ప్రతికూలతలు యూరోపియన్లతో పోల్చినప్పుడు మన దేశంలోని యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా మంది చెస్ట్ పెయిన్ సమస్య ఎదురైనప్పుడు అది అసిడిటీకి సంబంధించిన సమస్యే అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. జర్నలిస్టు అయిన అమిత్ కుమార్ కూడా అదే పొరపాటు చేశాడు. కానీ అదృష్టవశాత్తూ అతను గండం తప్పించుకోగలిగాడు. రాత్రి అధికంగా ఆహారం తీసుకోవడమే సమస్యకు కారణమని భావించాడు. అసిడిటీని తగ్గించే మందులు వేసుకుంటే ప్రయోజనం లేకపోయింది. ఓ సాధారణ వైద్యుడిని సంప్రదిస్తే ఆయన సమస్యను గుర్తించలేకపోయాడు. అయితే ఈసీజీలో తేడాను గమనించాడు. మెరుగైన వైద్య సాయం తీసుకోమని సూచించడంతో కొద్దిపాటి మెరుగుదల స్థితిలో అక్కడికి వెళ్లాక తెలిసింది. చిన్న పాటి స్ట్రోక్ వచ్చిందని. అప్పటికి అతని వయసు 29 సంవత్సరాలు మాత్రమే. ఇంతకీ ఈ చర్చ అంతా ఎందుకంటే ఇటీవల ప్రముఖ సింగర్ కెకె హఠాన్మరణమే. ఇదివరలో పునీత్ రాజ్ కుమార్, సిద్ధార్థ శుక్లా, డైరెక్టర్ రాజ్ కౌశల్ కూడా ఇలాంటి కారణాల వల్లనే ప్రాణాలు కోల్పోయారు. వీళ్లంతా కార్డియాక్ అరెస్టు ప్రభావంతోనే మరణించారు.
వైద్య రంగానికి సవాలు
మంగళూరులోని కెఎంసి ఆస్పత్రిలో ప్రతినెలా కనీసం 150 నుంచి 170 ఆంజియోప్లాస్టీ పరీక్షలు జరుగుతుంటాయి. వారిలో కనీసం 50- 60 మందికి ఇదివరకే ఒకసారి ఏదో స్థాయిలో గుండెపోటు వచ్చినట్లు నిర్ధారణ అవుతోంది. అంటే వారికి ప్రమాదం తప్పింది కానీ ఎదురైంది. గుర్తుపట్టే స్థాయిలో లేదు. ఇది సమస్య తీవ్రతను సూచిస్తుంది. ఈ 60 మందిలో 40 నుంచి 45 మంది చిన్న వయసు వారే (40 ఏళ్ల లోపు) కావడమే మరింత ఆందోళనకు కారణం అంటున్నారు డాక్టర్ కామత్. బెంగుళూరులోని సాక్రా వరల్డ్హాస్పిటల్ లో కార్డియాలజిస్టు దీపక్ అభిప్రాయం ప్రకారం ఆయన దగ్గరికి వచ్చిన పేషెంట్లలో ఎక్కువ మంది 50 ఏళ్ల లోపు వారే. వారిని గుండె జబ్బు ఉన్న యువతగానే పరిగణించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. దాదాపు 30-40 శాతం మంది 40 ఏళ్ల లోపువారే. తన దగ్గరికి వచ్చిన వారిలో 18 ఏళ్లు 23 ఏళ్ల వారు కూడా ఉన్నారని ఆయన చెప్పారు. ఇక వివిధ అధ్యయనాలను పరిశీలిస్తే 1990 నాటితో పోలిస్తే గుండె పోటు మరణాలురెట్టింపు అయ్యాయి. 2030 నాటికి మరో 50 శాతం పెరిగిపోవచ్చు. 2017లో కార్డియోవస్కులార్ డిసీజ్ కారణంగా263 లక్షల మంది చనిపోయారు. అమెరికాలో ఒక తాజా అధ్యయనం ప్రకారం భారతీయులు, ఇతర దక్షిణ ఆసియా ప్రాంత ప్రజలకు (యూరోపియన్లతో పోల్చినప్పుడు) గుండె జబ్బు వచ్చే అవకాశాలు అధికం అని తేలింది.
మరిన్ని ఆరోగ్య వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి