collapse
...
Home / అంతర్జాతీయం / అట్టహాసంగా.. క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబ్లీ వేడుకలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | Ne...

అట్టహాసంగా.. క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబ్లీ వేడుకలు

2022-06-03  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

queen elizabeth
 

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ సింహాసనాన్ని అధీష్టించి 70 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు సెంట్రల్ లండన్‌లో ప్రారంభమయ్యాయి. నాలుగు రోజులపాటు జరిగే పార్టీలు, పరేడ్స్ ప్రారంభించేందుకు పదివేల మంది రాజకుటుంబ మద్దతుదారులు గురువారం లండన్ వీధుల్లోకి వచ్చారు.

తన పూర్వీకుల కంటే ఎక్కువ కాలం పాలించిన రికార్డును ఈ 96 ఏళ్ల ఎలిజబెత్ సొంతం చేసుకోగా ఆమె గౌరవార్థం బ్రిటన్ సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్ లండన్‌లో ట్రూపింగ్ ది కలర్ మిలిటరీ కవాతుతో ఈ వేడుకలు ప్రారంభమవగా బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీ నుంచి 1,500 మంది సైనికులు, అధికారుల నుంచి మొదటిసారిగా ఎలిజబెత్ గౌరవ వందనం స్వీకరించింది. ఈ మేరకు ప్రధాన రహదారులపై గుమిగూడిన కుటుంబాలు, స్నేహితులు రెజిమెంటల్ మార్చింగ్ బ్యాండ్స్‌ను ఉత్సాహపరిచారు. కాగితపు కిరీటాలను ధరించి యూనియన్ జెండాలను ఊపుతూ కనిపించారు.

క్యారేజ్‌లో మొదటి సీనియర్ రాయల్స్ వచ్చిన సందర్భంగా- ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్, ఆమె ముగ్గురు చిన్న పిల్లలతో పాటు ప్రిన్స్ చార్లెస్ భార్య కెమిల్లా బిగ్గరగా అరుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా చార్లెస్, అతని కుమారుడు విలియం, రాణి కుమార్తె అన్నే గుర్రంపై వచ్చారు. ఇక వారసుడు ప్రిన్స్ చార్లెస్(73), అతని పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం(39), ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు రాణి తరపున ఇతర ఆచార వ్యవహారాలను నిర్వహించనుండగా.. ఈ వేడుకకు హాజరుకాని వారిపైనే మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది.

రెండో కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ(62) చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఫిబ్రవరిలో ఒక వ్యాజ్యం దాఖలైనందున అతను హాజరు కాకపోవచ్చు. ఇక ఆమె మనవడు ప్రిన్స్ హ్యారీ, ఇప్పుడు తన అమెరికన్ భార్య మేఘన్‌తో కలిసి లాస్ ఏంజెల్స్‌లో నివసిస్తుండగా.. వీరు పరేడ్ హాజరవుతారు. కానీఆధునిక, చారిత్రాత్మకమైన రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా ఫ్లై-పాస్ట్ చూసేందుకు రాజ కుటుంబం ప్యాలెస్ బాల్కనీలో గుమిగూడినప్పుడు వీరు హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.

క్వీన్ ఎలిజబెత్‌కు వయసు పైబడిన కారణంగా కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుంది. అయితే లండన్‌లో తుపాకీ వందనాలు ఉండనున్నాయి. తర్వాత రాణి తన విండ్సర్ కాజిల్ హోమ్‌లో ప్రిన్సిపల్ ప్లాటినం జూబ్లీ బెకన్‌ను వెలిగించడంలో నాయకత్వం వహిస్తుంది. ఇక గురువారం జూబ్లీ ప్లాటినం వేడుకల ప్రారంభంతో పాటు ఫిబ్రవరి 1952లో తన తండ్రి జార్జ్ VI మరణంతో రాణిగా మారిన ఎలిజబెత్ పట్టాభిషేకం 69వ వార్షికోత్సవాన్ని కూడా సూచిస్తుంది. ఈ మేరకు ‘యునైటెడ్ కింగ్‌డమ్, కామన్వెల్త్ అంతటా నా ప్లాటినమ్ జూబ్లీని పురస్కరించుకుని కమ్యూనిటీలు, కుటుంబాలు, స్నేహితులను సమావేశపరిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఎలిజబెత్ ఒక ప్రకటనలో తెలిపారు. తన పట్ల చూపిన సద్భావనతో స్ఫూర్తి పొందుతున్నాని చెప్పిన క్వీన్.. భవిష్యత్తును ఆత్మవిశ్వాసంతో, ఉత్సాహంతో చూస్తున్నప్పుడు గత 70 ఏళ్లలో సాధించిన అన్నింటినీ ప్రతిబింబించేలా రాబోయే రోజులు అవకాశం కల్పిస్తాయని ఆశిస్తున్నానని తెలిపింది.

ఇక ఈ వారం నిర్వహించిన ఒక సర్వేలో 10 మందిలో ఎనిమిది మంది ఆమె పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని, మూడొంతుల మంది ఆమె రాణిగా మంచి పని చేశారని భావిస్తు్న్నారని స్పష్టం చేసింది. అయితే ఈ వేడుకల్లో అందరూ పాల్గొనడం లేదు. బ్రిటన్ అంతటా బిల్ బోర్డులపై ‘మేక్ ఎలిజబెత్ ది లాస్ట్’ అనే సందేశంతో రాచరికానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సమూహం రిపబ్లిక్.. జూబ్లీ పట్ల సగానికి పైగా ప్రజలు ఆసక్తి చూపడం లేదని సర్వే తేలిందని వెల్లడించింది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 2022-06-03  News Desk