collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / ఓటమి గ్యారంటీ..అయినా తగ్గేదేలే..వీర్రాజు స్ట్రాటజీ ఏంటి? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News...

ఓటమి గ్యారంటీ..అయినా తగ్గేదేలే..వీర్రాజు స్ట్రాటజీ ఏంటి?

2022-06-03  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

BJP_FLAG
 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలపై భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) అడుగులు అయోమ‌యాన్ని త‌ల‌పిస్తున్నాయ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే రాజ‌ధాని విష‌యంలో ఎటూ తేల్చ‌కుండా ప్ర‌జ‌ల‌ను అయోమ‌యంలో నెట్టేశారు. రాష్ట్ర నాయ‌కులు, కేంద్ర నాయ‌క‌త్వానికి మ‌ద్య స‌మ‌న్వ‌యం ఉండ‌డంలేద‌ని త‌ర‌చు జ‌రుగుతున్న  ప‌రిణామాల‌ను బ‌ట్టి తెలుస్తోంది.  మిగిలిన విష‌యాలు ఎలా ఉన్నా, ఎన్నిక‌ల విష‌యంలో రాష్ట్ర‌, కేంద్ర నాయ‌క‌త్వాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోతే ప‌రిస్థితులు గంద‌ర‌గోళంగా మారుతాయ‌ని బిజెపి అభిమానులు అంటున్నారు.  ముఖ్యంగా ఎన్నిక‌లు, ఉప ఎన్నిక‌ల విష‌యంలో స్ప‌ష్ట‌త ఉండాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక సంద‌ర్భంగా వారు తిరుప‌తి, బ‌ద్వేలు ఉప ఎన్నిక‌ల‌ను  ఉద‌హ‌రిస్తున్నారు.  జ‌న‌సేన మ‌ద్ద‌తుతో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానాన్ని గెలుచుకోగ‌లుగుతాద‌మ‌నే ధీమాతో  బిజెపి పోటీకి దింపింది. మాజీ ఐఎఎస్ అయిన  ర‌త్న ప్ర‌భ ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టిగానే పోరాడినా దారుణ‌మైన ఫ‌లితాన్ని చ‌విచూడాల్సి వ‌చ్చింది.  అయితే జ‌న‌సేన మ‌న‌స్పూర్తిగా మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదంటూ  పార్టీలోని కొంద‌రు నాయ‌కులు అప్ప‌ట్లో చ‌ర్చించుకున్నారు.

అలాగే, క‌డ‌ప జిల్లా  బ‌ద్వేలు ఉప ఎన్నికలో కూడా బిజెపి పోటీ చేసింది.  2019లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  వైసిపి త‌ర‌పున (ఎస్సీ రిజ‌ర్వుడు) వెంక‌ట సుబ్బ‌య్య పోటీ చేసి త‌న స‌మీప తెలుగుదేశం  ప్ర‌త్య‌ర్ధి ఓబులాపురం రాజ‌శేఖ‌ర్ పై సుమారు 44000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నిక‌ల్లో  కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసిన పి ఎస్ క‌మ‌ల‌మ్మ‌కు 6,235 ఓట్లు, బిజెపి అభ్య‌ర్ధి  పి.సురేష్ కు 21,675 ఓట్లు వ‌చ్చాయి. వైసిపి పై పోటీ  చేసిన అభ్య‌ర్ధులు ఎవ‌రికీ క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్క‌లేదు.
అయినా

ఆత్మ‌కూరు లో కూడా...

ఇదే ఎన్నిక‌ల్లో ఆత్మ‌కూరు లో గెలిచి మంత్రిగా ప‌నిచేసిన మేక‌పాటి గౌతం రెడ్డి ఆక‌స్మిక  మ‌ర‌ణంతో  ఈ నియోజ‌క వ‌ర్గంలో ఉప ఎన్నిక జ‌ర‌గుతుతోంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో త‌మ సిద్ధాంతం ప్ర‌కారం తెలుగుదేశం పార్టీ పోటీలో దిగ‌డం లేదు. మ‌ర‌ణించిన శాస‌న‌స‌భ్యుని ప‌ట్ల గౌర‌వంతో ఆ ఉప ఎన్నికల్లో త‌మ అభ్య‌ర్ధిని పోటీకి దింప‌రాద‌నేది టిడిపి విధానం.  ఈ మేర‌కే ఆ పార్టీ ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని అధినేత చ‌చంద్ర‌బాబు  స్ప‌ష్టం గా చెప్పారు. అయితే దీనిపై అధికార వైసిపి  ఎప్ప‌టిలాగే టిడిపి ని స‌వాల్  చేసింది. ప్ర‌భుత్వం పై వ్య‌తిరేక‌త ఉంద‌ని ప్ర‌చారం చేస్తున్న టిడిపి పోటీ చేస్తే ఎవ‌రి బ‌ల‌మెంతో తెలుస్తుంది క‌దా అని స‌వాల్ విసిరింది. అయితే దీనిపై టిడిపి అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా స్పందించారు. త‌మ పార్టీ విధానం మేర‌కే పోటీలో దిగ‌డంలేద‌ని, ఈ విష‌యంలో వైసిపి వ్యాఖ్య‌లు నీచంగా ఉన్నాయంటూ మండి ప‌డ్డారు.

బిజెపి ఎందుకు పోటీ చేస్తోంది...

ఇదిలా ఉంటే, గ‌త రెండు ఉప ఎన్నిక‌ల్లో కూడా ఘోర ప‌రాజ‌యం చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి) మ‌ళ్ళీ ఈ ఉప ఎన్నిక‌ల్లో కూడా బ‌రిలోకి దిగుతోంది.  ఇటువంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో మృతుల కుటుంబంపై సానుభూతి సెంటిమెంట్ ఉంటుంద‌ని తెలిసినా దైర్యంగా పోటీలో దిగ‌డంలోని ఆంత‌ర్యం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.  డిపాజిట్లు రావ‌ని తెలిసినా పోటీ చేయ‌డంమంటే బిజెపి ఏదో వ్యూహంతోనే పోటీ చేస్తుంద‌నే వాద‌న  వినిపిస్తోంది.  ప్ర‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించే  ఆలోచింప‌జేసే అవ‌కాశం ఉంటుంద‌ని, త‌ద్వారా రాబోయే ఎన్నిక‌ల్లో  ఎంతో కొంత ఓటు బ్యాంకును కూడ‌గ‌ట్టుకోవ‌చ్చ‌నే  ఆలోచ‌న ఉండి ఉంటుంద‌ని చెబుతున్నారు.

మ‌రో రెండేళ్ళ‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తున్నామంటూ ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంభించింది. అందుకు అనుగుణంగా అగ్ర నేత‌లు కూడా ప‌ర్య‌టించేలా ఏర్పాట్లు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇలాటి ప్ర‌ణాళిక‌ల‌తోనే బిజెపి  ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌ల్లో ఉనికిని  చాటుకునేందుకు ఇలా పోటీ చేస్తోంద‌నే వారు కూడా లేక‌పోలేదు. మ‌రి ఈ సారి ఎన్ని ఓట్లు రాబ‌ట్టుకుంటుందో చూడాలి.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 2022-06-03  News Desk