2017 ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ చారిత్రక నేపథ్యంతో వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో అధికారికంగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేసింది
ఈ చిత్రం ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. ఇక గత కొన్ని వారాలుగా హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ మానుషీ చిల్లర్ ఈ చిత్రం ప్రమోషన్స్ పనిలో పడి వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ , ఫ్యాషన్ ఫోటో షూట్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపారు. ఇక ముద్దుగుమ్మ మానుషీ చిల్లర్ బెస్పోక్ లెహంగా చోలీ సెట్స్ దగ్గరి నుంచి హెరిటేజ్ సిల్క్ శారీలు, హెవీ షరారా సెట్ వేసుకుని తన స్టైలిష్ ఫ్యాషన్‌తో సినిమాకు ప్రమోషన్ చేసింది. మానుషీ చిల్లర్ ధరించిన విభిన్న అవుట్‌ఫిట్స్ ఆమె లుక్స్ కి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.
అనార్కలీ సెట్లో అందాలు అదరహో :
తాజాగా మానుషీ చిల్లర్ అనార్కలీ సెట్లో దిగిన ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోల కింద "గ్రేట్ఫుట్ అండ్ హ్యాపీ " అని క్యాప్షన్‌ను జోడించింది ఈ బ్యూటీ . ఈ లేత గులాబీ రంగు షేడ్‌లో వచ్చిన అనాకర్కలీ సెట్‌ను పిచ్చికా ఫ్యాషన్ లేబుల్ షెల్ఫ్ నుంచి సేకరించింది ఈ ప్రపంచ సుందరి. లిల్లీ పూల నమూనాలను కలిగిన ఐవొరీ షేడ్ ఎంబ్రాయిడరీని, స్టోన్స్ అలంకరణలను అవుట్‌ఫిట్‌కు అందించారు డిజైనర్. సన్నటి స్ట్రాప్స్, యూనెక్లైన్తో టైట్ ఫిట్టింగ్తో వచ్చిన ఈ అనార్కలీ డ్రెస్ మానుషీకి మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఈ అనార్కలీకి మ్యాచింగ్‌గా అదే రంగులో ఉన్న చూడిదార్ ప్యాంట్స్‌ను వేసుకుంది. తన భుజాల మీదుగా లిల్లీ పూల ఎంబ్రాయిడరీ, స్టోన్స్ అలంకరణలతో పాటు బార్డర్లలో గోల్డ్ పట్టీతో వచ్చిన షీర్ ఆర్గాంజా దుపట్టాను వేసుకుని ఎత్నిక్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేసింది.
అందరిని ఆకర్షిస్తున్న వెండి ఆభరణాలు :
ఈ అవుట్‌ఫిట్‌కు మరింత వన్నె తీసుకువచ్చేందుకు చేతికి వెండి గాజులు, అలంకరించిన జుట్టీస్, చెవులకు సిల్వర్ ఇయర్రింగ్స్ ను పెట్టుకుంది. నుదుటున బొట్టు, పెదాలకు బ్లష్ పింక్ లిప్ షేడ్ వేసుకుంది. కనులకు స్లీక్ ఐ లైనర్, మస్కరా , సబ్టిల్ ఐ ష్యాడో వేసుకుని మెరిసేటి ఛర్మంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది. తన కురులతో మధ్యపాపిట తీసి హాఫ్ టైడ్ హెర్డోతో తన లుక్‌ను పూర్తి చేసి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది.
చీరకట్టు సొగసులను ప్రపంచమతా చాటింది:
ఈ మధ్యనే ఈ చిన్నది మరో అదరిపోయే ఎత్నిక్ వేర్లో మెరిసిపోయింది. హెరిటేజ్ క్లాతింగ్ లేబుల్ అయిన మాధుర్య షెల్ఫ్ నుంచి డార్క్ పింక్ చీరను ఎన్నుకుని తన ఫోటో షూట్‌కు కట్టుకుని ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది మానుషీ. ఈ చీరకు జోడీగా హాఫ్ స్లీవ్స్, వైడ్ నెక్లైన్ కలిగిన క్రీమ్ కలర్ సిల్క్ బ్లౌజ్‌ను వేసుకుంది. పట్టు చీరను చేతితో చేసిన ఎంబ్రాయిడరీ అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు డిజైనర్లు. బ్లూ లైనింగ్, క్లిష్టమైన్ గోల్డ్ పట్టీ బార్డర్లు, థ్రెడ్ ఎంబ్రాయిడరీ అందాలు అందరిని ఆకట్టు
కున్నాయి. చీర కొంగుకు అవే డీటైల్స్‌ను అందించారు. ఈ ఆరు గజాల చీరను ఈ బ్యూటీ క్వీన్ ట్రెడిషనల్ స్టైల్లో కట్టుకుని అందరిని అట్రాక్ట్ చేసింది. చెవులకు బంగారు ఇయర్రింగ్స్, దాని మ్యాచ్ అయ్యే బంగారపు కుందన్ గాజులను వేసుకుంది. తన కురులతో మధ్యపాపిట తీసి స్లీక్ లో బన్ వేసుకుంది. కనులకు సబ్టిల్ మెరిసేటి ఐ ష్యాడో, స్లీక్ ఐలైనర్, మస్కరా దిద్దుకుంది. పెదాలకు గ్లాసీ బ్రాంజ్ హ్యూడ్ లిప్ షేడ్ పెట్టుకుంది. నుదుటున బొట్టుపెట్టుకుని భారతీయ మహిళ చీరకట్టు సొగసులను ప్రపంచమతా చాటింది.

కున్నాయి. చీర కొంగుకు అవే డీటైల్స్‌ను అందించారు. ఈ ఆరు గజాల చీరను ఈ బ్యూటీ క్వీన్ ట్రెడిషనల్ స్టైల్లో కట్టుకుని అందరిని అట్రాక్ట్ చేసింది. చెవులకు బంగారు ఇయర్రింగ్స్, దాని మ్యాచ్ అయ్యే బంగారపు కుందన్ గాజులను వేసుకుంది. తన కురులతో మధ్యపాపిట తీసి స్లీక్ లో బన్ వేసుకుంది. కనులకు సబ్టిల్ మెరిసేటి ఐ ష్యాడో, స్లీక్ ఐలైనర్, మస్కరా దిద్దుకుంది. పెదాలకు గ్లాసీ బ్రాంజ్ హ్యూడ్ లిప్ షేడ్ పెట్టుకుంది. నుదుటున బొట్టుపెట్టుకుని భారతీయ మహిళ చీరకట్టు సొగసులను ప్రపంచమతా చాటింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి