అనార్కలీతో అదరగొట్టాలన్నా, చూడీదార్తో ఫిదా చేయాలన్నా, చీరకట్టుతో ఓ ఊపు ఊపాలన్నా అలనాటి మేటి నటి డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తరువాతే. తన కెరీర్ సెకండ్ హాఫ్లోనూ తన అందాలతనో అందరిని మెస్మరైజ్ చేస్తోంది ఈ బ్యూటీ. అదరిపోయే అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేస్తోంది. ఎత్నిక్ అవుట్‌ఫిట్స్‌కు కేరాఫ్‌గా ఉన్న మాధురీ దీక్షిత్ తాజాగా మరో అదరిపోయే చీరకట్టుతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. బ్లూ ప్రింటెడ్ చీరతో చేసిని ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ నటి. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అసూయ పడే చీరకట్టు అందం ఆమె సొంతం:
సాంప్రదాయ నేత దుస్తుల పట్ల తన ప్రేమను ఏదో రకంగా తెలియజేస్తుంటారు నటి మాధురీ దీక్షిత్. ఈ దుస్తులను ధరించడంలో ఎప్పుడూ వెనకంజ వేయరు ఈ నటి. సున్నితమైన హ్యాండ్లూమ్స్, ఎత్నిక్ వేర్స్‌తో మాధురీ దీక్షిత్ వార్డ్రోడ్ ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. భారీ అలంకరణలతో ఎంబ్రాయిడరీతో వచ్చిన చీరల నుంచి, అదిరిపోయే ప్రింటెడ్ చీరల వరకు అందరూ అసూయపడే అద్భుతమైన చీరలు తన వార్డ్‌రోబ్‌లో కొలువుదీరాయి. ప్రతి చీర అందంగానే ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటో షూట్ కోసం అద్భుతమైన బ్లూ ప్రింటెడ్ చీరను కట్టుకుని మరోసారి తన సోయగాలను ఒలకబోసింది మాధురీదీక్షిత్. చీరకట్టుకు సరికొత్త అందాన్ని తీసుకువచ్చింది. ఈ పిక్స్‌ను మాధురీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. బ్లూ హార్ట్ ఏమోజిని క్యాప్షన్‌గా జోడించింది.
పోల్కా డాట్ ఫ్రింటెడ్ శారీతో ఫిదా:
డిజైనర్ అనితా డోంగ్రే క్లాతింగ్ లేబుల్ నుంచి ఈ బ్లూ ప్రింటెడ్ జార్జెట్ చీరను ఎన్నుకుంది మాధురీ దీక్షిత్. లేత నీలిరంగులో క్లిష్టమైన పోల్కా డాట్ ప్రింట్స్‌తో అలంకరించబడిన రాయల్ బ్లూ షేడ్ చీర మాధురీ రంగుకు పెర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. చీరమొత్తం వచ్చిన హారిజాంటల్ లైన్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా సీక్విన్డ్ అలంకరణలు, భారీ అలంకరణలతో వచ్చిన గోటా పట్టి బార్డర్ చీరకు ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయ. ఈ చీరను ట్రెడిషనల్ స్టైల్లో కట్టుకుని ఫ్యాషన్ ప్రియులను అలరించింది. ఈ చీరకు జోడీగా మాధురీ ప్లంగింగ్ నెక్లైన్ కలిగిన స్లీవ్ లెస్ సాలిడ్ రాయల్ బ్లూ షేడ్‌లో వచ్చిన బ్లౌజ్‌ను వేసుకుని తన లుక్‌ను కంప్లీట్ చేసింది.
మినిమల్ లుక్‌తో మైండ్ బ్లాక్ :
కాళలకు మ్యాచింగ్ చెప్పులు వేసుకుని చేతికి గోల్డ్ బ్రేస్లెట్, చేతి వేళ్లకు బంగారు ఉంగరాలు, చెవులకు ముత్యాల అలంకరణలతో వచ్చిన అందమైజుంకాలను పెట్టుకుని తారలా మెరిసింది మాధురీ. సైడ్ పాపిట తీసుకుని వేవీ ఎండ్స్ వచ్చే విధంగా తన హెయిర్ ను లూజుగా వదులుకుంది. కనులకు సబ్టిల్ ఐ ష్యాడో, స్లీక్ ఐలైనర్, మస్కరా వేసుకుని పెదాలకు బెర్రీ టోన్డ్ లిప్ షేడ్ పెట్టుకుని మెరిసేటి ఛర్మంతో తన లుక్‌ను పూర్తి చేసి అందరిని మెస్మరైజ్ చేసింది.
అంతకు ముందు ఈ అందాల నటి తెల్లటి చీరను కట్టుకుని అందరి చూపును తనవైపు తిప్పుకుంది. గోల్డెన్ బార్డర్స్ తో వచ్చిన ఈ చీరతో మాధురి అప్సరసలా మెరిసింది.
ఆ మధయనే కుర్రహీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా కోఆర్డ్ సెట్ ధరించి తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది ఈ భామ. నలుపు రంగులో ఉన్న సీక్విన్డ్ బాటమ్స్‌కు జోడీగా ఫుల్ ఫ్రిల్డ్ స్లీవ్స్ వచ్చిన క్రాప్ టాప్ ను వేసుకుని ఓ ఉపు ఊపేసింది.
ఎత్నిక్ వేర్స్ అంటే చీరలే కాదండోయ్, లెహంగా చోలీ సెట్స్తోనూ అందరిని అలరిస్తుంది మాధురీ ధీక్షిత్. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన అద్భుతమైన లెహంగ సెట్స్‌ను ధరించి ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి