collapse
...
Home / అంతర్జాతీయం / ప్రి స్కూల్ పార్కింగ్‌లో కనిపించిన ఆ దృశ్యం ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది.. - 6TV News : Telugu in News | Telugu News | La...

ప్రి స్కూల్ పార్కింగ్‌లో కనిపించిన ఆ దృశ్యం ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది..

2022-06-04  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Queen-1-1
చిన్న పిల్లలను బడికి పంపడం తల్లిదండ్రులకు ఒక పెద్ద టాస్క్. అప్పటి వరకూ కుటుంబ సభ్యులు, పక్కింటి పిల్లలతో ఆడుతూ పాడుతూ గడిపిన పసితనంలోనే క్రమశిక్షణగా ఉండాలంటూ రిస్ట్రిక్షన్స్ పెడితే ఆ పసి మనసుకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో స్కూలుకి వెళ్లడానికి మారాం చేస్తారు. ఇక ఇప్పుడు ప్రి స్కూల్స్ వచ్చేశాయి. బడి వయసు కంటే ముందుగానే స్కూలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ పెద్దగా రిస్ట్రిక్షన్స్ లేకున్నా కాస్త కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాలి. తోటి చిన్నారులతో స్నేహం, అల్లరి, ఆటలు, పాటలు బాగానే ఉన్నప్పటికీ టీచర్లతోనే కొత్త చిక్కు వచ్చిపడుతుంది.

వావ్ అనిపించేలా ఉన్న ఈ ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది..

ఇక ప్రి స్కూలు అలవాటు చేయడం కోసం చిన్నారుల తల్లిదండ్రులు వారికి నచ్చినవి ఏవో కొనిపెట్టి చిన్నగా స్కూలుకు అలవాటు చేస్తారు. ఒక ప్రి స్కూలు చిన్నారులకు కూడా తల్లిదండ్రులు అలాగే చేశారేమో అనిపించేట్టుగా కనిపించి ఓ దృశ్యం సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆన్‌లైన్‌లో ఒక ఫోటో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూడగానే మీ ముఖంలో తక్షణమే చిరునవ్వుతో వావ్ అనిపించే ఫీలింగ్ రావడం ఖాయం. అది ఏంటంటరా? అదొక ప్రి స్కూల్ పార్కింగ్ ఫోటో. కంప్యూటర్ శాస్త్రవేత్త పాల్ గ్రాహం షేర్ చేసిన ఈ ఫోటో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. వెనిస్‌లోని ఓ ప్రి స్కూలులో పార్కింగ్ వద్ద స్కూటర్ల సమూహం వావ్ అనిపించేలా ఉంది. రంగురంగుల స్కూటర్‌లు ఒక వరుసలో చక్కగా పార్క్ చేయబడ్డాయి.

స్కూటర్లు పార్క్ చేసిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది..

ఈ ఫోటో ఖచ్చితంగా మీ హృదయాలను ఒక విధంగా హత్తుకుంటుంది. పాల్ గ్రాహం షేర్ చేసిన పిక్‌కు.. ‘ప్రీ-స్కూల్ పార్కింగ్, వెనిస్’ అనే శీర్షికను ఇచ్చారు. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. దీంతో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఒక్కొక్కరూ చేసే కామెంట్స్‌తో సోషల్ మీడియా దడదడలాడుతోంది. ఈ స్కూటర్లు పార్క్ చేసిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇది కొందరు కొందరు పెద్దలకు మంచి గుణపాఠంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఇక నెటిజన్లు ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

నేను ఈ రోజు ట్విటర్‌లో చూసిన అద్భుతమైన విషయం ఇదే..

ఈ ఫోటోను చూసి ‘మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు. ‘నేను ఈ రోజు ట్విటర్‌లో చూసిన అద్భుతమైన విషయం ఇదే’ అని మరొకరు పోస్ట్ పెట్టారు. మరొకరు ‘ఎంత అందమైన ఫోటో’ అంటూ కామెంట్ పెడుతున్నారు. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెద్దలు తమ వెహికిల్స్‌ను ఇష్టానురీతిగా పార్క్ చేసి చేతులు దులిపేసుకుంటుంటే.. చిన్నారులు మాత్రం రంగురంగుల స్కూటర్లు గోడకు ఆనించి వరుసగా ఒక లైన్‌లో పెట్టారు. ఈ దృశ్యం కలర్‌ఫుల్‌గానే కాదు.. చిన్నారుల క్రమశిక్షణకు అద్దం పడుతోంది. పసిపిల్లలు అయినప్పటికీ అంత నీట్‌గా పార్క్ చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది.

 



2022-06-04  News Desk