ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ,IIFA అవార్డ్స్ 2022 వేడుగ అబు దబిలో అంగరంగ వైభవంగా జరగనుంది. బాలీవుడ్ బడా సెలబ్రిటీలు ఈ వేడుకల్లో పాల్గొని ఫ్యాన్స్‌ను ఖుషి చేయనున్నారు. బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచెలర్ సల్మాన్ ఖాన్ ఈ అవార్డ్స్ ఫంక్షన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. రితేష్ దేష్ముఖ్, షాహిద్ కపూర్ , టైగర్ ష్రాఫ్, కార్తిక్ ఆర్యన్, నోరా ఫతేహి ఇంక చాలా మంది సినీ సెలబ్రిటీలు అబు దబీలో గ్రీన్ కార్పెట్‌పైన నడిచి అదరగొట్టనున్నారు. ఈ లిస్ట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సారా అలీఖాన్, అనన్య పాండేలు ఉన్నారు. ఈ ముగ్గురు బాలీవుడ్ బ్యూటీలు అందమైన అదిరిపోయే అవుట్‌ఫిట్స్‌ను ధరించి అవార్డ్స్ ఫంక్షన్లో హంగామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ అవార్డ్స్ ఫంక్షన్ కోసం జాక్వెలిన్ మెరుపుల మెటాలిక్ టోన్డ్ గౌన్‌ను ఎన్నుకుంది. సారా అలీఖాన్ బ్లాక్ డ్రెస్‌ను, అనన్య ఫ్లోరల్ థీమ్ అవుట్‌ఫిట్ వేసుకోనుంది. ఈ అవుట్‌ఫిట్స్‌తో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మనమూ ఆ అవుట్‌ఫిట్స్ అందాలను చూసేద్దాం పదండి.
మెటాలిక్ హ్యూడ్ గౌనుతో జాక్వెలిన్ సో హాట్:
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ఫంక్షన్ కోసం వన్ షోల్డర్ గౌన్‌ను ఎన్నుకుంది. తన అవుట్ ఫిట్ డ్యుయల్ సిల్వర్, గోల్డ్ మెటాలిక్ షేడ్స్‌ను కలిపి డిజైనర్లు అందంగా తీర్చిదిద్దారు. న్యూడ్ బ్యాక్‌డ్రాప్ మీదగా టాస్సెల్స్, బీడ్స్, సీక్విన్డ్ అలంకరణలతో ఈ బాడీకాన్ డ్రెస్ లో జాక్వెలిన్ అదిరిపోయింది.
డ్రెస్ ముందుభాగంలో వచ్చిన థై హై స్లిట్, లాంగ్ స్లీవ్ జాక్వెలిన్ లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చింది.
సింపుల్ మేకప్‌తో స్టన్నింగ్ లుక్స్ :
జాక్వెలిన్ ఈ మెటాలిక్ హ్యూడ్ గౌను మాత్రమే అందరిని అట్రాక్ట్ చేయడం కోసం మినిమల్ ఆక్సెసరీస్, మేకప్‌ను ఎన్నుకుంది. పాదాలకు కిల్లర్ హై హీల్స్ వేసుకుంది. చెవులకు భారీ సిల్వర్ ఇయర్రింగ్స్ పెట్టుకుంది. తన కురులను సైడ్ పాపిట తీసి వేవీ కర్ల్స్ వచ్చే విధంగా లీవ్ చేసుకుంది. కనులకు షిమ్మరీ ఐ ష్యాడో, బ్లాక్ ఐలైనర్, హెవీ మస్కరా పెట్టుకుంది. పెదాలకు చాక్లెట్ బ్రౌన్ లిప్ షేడ్‌ను దిద్దుకుంది. మెరిసేటి ఛర్మంతో తన అందాలను ఆరబోస్తూ అదరగొట్టింది ఈ అందాల భామ.
అనన్య అందాలు చూడతరమా:
ఇక అందాల భామ అనన్యపాండే ఐఐఎఫ్ అవార్డుల ఫంక్షన్ కోసం అందమైన పాస్టెల్ బ్లూ గౌన్‌ను ఎన్నుకుంది. ఈ అవుట్‌ఫిట్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను అనన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల కింద బేబీ బ్లూ బెల్ ఫర్ ఐఐఎఫ్ఏ రాక్స్ అని క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 3డి పాస్టెల్ పింక్ హ్యూడ్ ఫ్లవర్స్‌తో ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు డిజైనర్లు. కార్సీటెడ్ బాడీస్, వెనకాల షీర్ అలంకరణలు , ప్లంగింగ్ నెక్లైన్, ఫ్లోర్ గ్రేజింగ్ హెమ్తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్‌లో అనన్య ఎంతో స్టైలిష్ గా కనిపిస్తోంది.
ఫ్యాన్స్‌ను ఫిదా చేసిని స్టైలిష్ లుక్స్ :
ఈ గౌనుకు మ్యాచ్ అయ్యే విధంగా పాదాలకు మ్యాచింగ్ ఫుట్‌వేర్ వేసుకుంది అనన్య. చేతి వేళ్లకు బంగారపు ఉంగరాలు, చెవులకు పెర్ల్ డ్రాప్ ఇయర్రింగ్స్ పెట్టుకుంది. తన కురులను మధ్యాపాటి తీసి బ్రెయిడెడ్ బన్ వేసుకుంది. కనులకు సబ్టిల్ ఐ ష్యాడో, మస్కరా దిద్దుకుంది. పెదాలకు బ్లష్ పింక్ లిప్ షేడ్ వేసుకుంది. మెరిసేటి ఛర్మంతో అనన్య లుక్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాయి.
బ్లాక్ అవుట్‌ఫిట్‌తో అదరగొట్టిన భామ:
ఒకప్పటి బొద్దుగుమ్మ ఇప్పుడు అందాల భామైన సారా అలీ హాన్ అవార్డ్స్ ఫంక్షన్ కోసం బ్లాక్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది. స్ట్రాప్ లెస్ , మల్టిపుల్ లుట్టే లేయర్స్ కలిగిన భారీ గౌనులో ఈ భామ ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. స్ట్రెయిట్ నెక్లైన్, లేస్ ఎంబ్రాయిడరీ కార్సెటెడ్ బాడీస్, షీర్ పానెల్స్, సిల్వర్ బో అలంకరణలతో హై లో హెమ్‌లైన్ కలిగిన ఈ అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియులను అలరించింది.
సారా ఖాన్ స్టైలిష్ ఐకాన్ :
సారా ఈ భారీ గౌన్‌కు మ్యాచింగ్‌గా పాదాలకు బ్లాక్ హీల్స్ వేసుకుంది. చేతి వేళ్లకు స్టేట్మెంట్ రింగ్స్ పెట్టుకుంది. ఇక వేళ్లకు కాంట్రాస్ట్ నారింజ్ నెయిల్ పాలిష్ వేసుకుని మెస్సీ పోనీటెయిల్ తో మైండ్ బ్లాక్ చేసింది. కనులకు మస్కరా వేసుకుని, ఐలైనర్ దిద్దుకుంది. పెదాలకు న్యూ్డ్ లిప్ షేడ్ తో మెరిసేటి ఛర్మంతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.