Courtesy:Twitter/@Patar_maneer
సెలిబ్రెటీ అయినా సామాన్యుడైనా తమ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మర్చిపోలేరు. అవి మంచి జ్ణాపకాలైతే ఆ మధుర క్షణాలను అసలు మర్చిపోలేరు. జీవితాంతం అవి వాడిపోకుండా పదిలంగా దాచుకుంటారు..సందర్భం వచ్చినప్పుడల్లా ఆ మధుర జ్ణాపకాలను పంచుకునేందుకు ఏ మాత్రం వెనకాడరు. ఇటువంటి సంఘటన మనకు టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ రవిశాస్త్రి 'ఆడి' కారుతో తన అనుబంధాన్ని పంచుకున్నాడు.
"అవి మేము 1985లో పాకిస్తాన్ తో బెన్సన్& హెడ్జెస్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం. పాకిస్తాన్‌ను ఓడించడానికి మాకు ఇంకా 15-20 పరుగులు అవసరం. పాకిస్తాన్ కెప్టెన్ జావేద్ మియాందాద్ సెట్ చేసిన ఫీల్డింగ్ ను పరిశీలించేందుకు నేను స్క్వేర్-లెగ్ వైపు చూశాను. ఆ సమయంలో మిడ్‌వికెట్ నుంచి జావేద్ రెచ్చిపోయాడు..
"ఎందుకు పదే పదే అటువైపు చూస్తున్నావు?** అని తన శైలిలో అంటున్నాడు. ” మీరు కారు వైపు ఎందుకు చూస్తున్నారు. అది మీకు దక్కదులే ! అన్నాడు. అప్పుడే నేను ఆ కారు వైపు పరిశీలనగా చూస్తూ అతనితో ఇలా అన్నాను, “జావేద్, ఆ కారు నా దారికే వస్తుంది.! అన్నాను. చివరికి ఆ మ్యాచ్ లో మేము గెలిచాం. ఙయాన్ ఛాపెల్ నుంచి కారు తాళాలు అందుకున్నాను. అప్పటికే నా టీమ్ మేట్స్ అంతా కారు చుట్టూ మూగి ఉన్నారు.
అవి క్రేజీ హ్యాపీ టైమ్స్..
ప్యాసింజర్ సీటులో అన్నీ (సునీల్ గవాస్కర్) ఉన్నారు. కపిల్ వెనుక ఉన్నాడు. . నేను ఇయాన్‌తో, ‘ఒక నిమిషం, నేను తిరిగి వస్తాను’ అని చెప్పాను. నేను వెళ్లి, లోపల కూర్చుని, ఇగ్నిషన్ ఆన్ చేసి, పెట్రోల్ ఇండికేటర్ చూస్తే కొంచెం పెట్రోల్ ఉందని సూచిస్తోంది. అది ఒక రౌండ్ వేసేందుకు సరిపోతుంది. నేను కారును స్టార్ట్ చేసి బయలుదేరాము. జిమ్మీ (అమర్నాథ్) బోనెట్ వద్ద, సదానంద్ విశ్వనాథ్ పైన ఉన్నారని నాకు గుర్తుంది, లెజెండ్ తన స్పైక్ షూస్‌తో గాలిలో తిప్పుతూన్నాడు. అప్పటికే కారు నిండా గీతలు పడ్డాయి. అవి నిజంగా క్రేజీ హ్యాపీ టైమ్స్.
ఆ జ్ణాపకాలను గుర్తు చేసుకుంటుంటే నా జీవితంలో నేను చేసిన చాలా పనుల కంటే, ఈ కారుకు సంబంధించిన జ్ణాపకాలే అగ్రస్థానంలో ఉంటాయి. ఆరు సిక్సర్లకు రీకాల్ విలువ ఉంది కానీ ఇది మాత్రం నా కెరీర్లో అతిపెద్దది. ఆస్ట్రేలియా నుండి వస్తున్న వన్డే క్రికెట్, డే అండ్ నైట్ మ్యాచ్‌ల సమయం అది. ఛానల్ 9 మొదటిసారిగా భారతదేశంలో ప్రవేశించడం, 1983 అంతా శ్వేతజాతీయులే. అదే తొలి టెలికాస్ట్. పాకిస్తాన్‌ను ఫైనల్లో గెలిస్తే, ఎవరైనా సరే దానిని ఎప్పటికీ మరచిపోలేరు.దాదాపు 50000 మందికి పైగా ఉన్న ఎంసిజి మైదానంలో నేను ఆడి కారును డ్రైవ్
చేయడం ఎప్పటికీ మర్చిపో్లేని అనుభూతి.. గొప్ప జ్ణాపకం." అన్నాడు రవిశాస్త్రి.
అదీ..ఆడీ కారు గొప్పదనం!
ఆ తర్వాత నేను జర్మనీలో ఫ్రాంక్ ఫర్ట్లో ప్రత్యేకమైన బీరును ఆస్వాదిస్తూన్నప్పుడు ఒక సర్దార్ జీ నన్ను పగుర్త పట్టి నావద్దకు వచ్చి శాస్త్రీ జీ ..కారెలా ఉందని అడిగాడు. నేను ఆశ్చర్యపోతూ బాగానే ఉందన్నాను. ఆ చిరస్మరనీయ క్షణాలను నాతో పాటు అంతా గుర్తుంచుకోవడం కారు గురించి అడగడం నాకెంతో సంతోసం కలిగించింది.
నా కారుతోనే మొదలైంది.!
ఆ టోర్నమెంటు ముగిసిన రెండు నెలల అనంతరం షిప్పింగ్ కార్పోరేషన్ వారు కొత్త కారును తమ డాక్ యార్డ్ నుంచి పంపించారు. క్రీడాకారులకు వచ్చేకారు బహుమతికి సుంకం లేకుండా భారత్ దేశంలోకి అనుమతించడం నా కారుతోనే మొదలైంది. ఆ తర్వాత దానిని చట్టబద్దం చేస్తూ అటువంటి బహుమతులకు ఎటువంటి టాక్స్‌లు లేకుండా రావడం ప్రారంభమైంది.
ఆ కారును ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేందుకు ఒక డ్రైవర్ ను కూడా వెంట తీసుకొచ్చాను. వచ్చేప్పుడు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఆనందంలో తేలిపోతూ ఇంటికెళ్ళాను. ఆడి కారును నా కూతు అలేఖ చూడడం అదే తొలిసారి. ఆమె అందులో ఎక్కి కూర్చుంది. నా కూతురిని కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పాలనుకున్నాను అప్పుడు. ఆ మధుర క్షణాలు నా జీవితంలో ఎంతో అపురూపమైనవంటూ రవిశాస్త్రి చెప్పారు. ఇంతకీ ఆ కారు బెన్కసన్ & హెడ్జెస్ టోర్నమెంట్ లో ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్ గా రవిశాప్త్రికి వచ్చింది.