వేసవి వేడి వల్ల శరీరం తరచూ డీహైడ్రేట్(నిర్జలీకరణం) అయిపోతుంది. తద్వారా ఎనర్జీ లెవెల్స్ పడిపోయి తొందరగా అలసిపోతాం. ఇలాంటి సమయాల్లో ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం తక్షణ శక్తిని అందించి, మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి సమ్మర్ డ్రింక్స్ కోసం పసుపు(హల్దీ)ని కూడా ఉపయోగించవచ్చని చాలా మందికి తెలియదు. నిజానికి వేసవి సీజన్లో ఈ పానీయం తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. ‘గోల్డెన్ స్పైస్’ అని కూడా పిలవబడే పసుపు అత్యంత ప్రయోజనకరమైన ఆహారాల్లో ఒకటి కాగా.. ఇది రంగు, రుచిని జోడించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఆసక్తికరంగా ప్రపంచ పటంలో భారతదేశాన్ని నిలిపిన మసాలాల్లో పసుపుకు ప్రత్యేక స్థానం ఉంది. వేసవిలో తీసుకోగల కొన్ని పసుపు ఆధారిత పానీయాలు ఇక్కడ ఉన్నాయి:
అల్లం-పసుపు స్మూతీ :
అల్లం, అరటిపండు కలిపిన ఈ పాలు, పసుపు పానీయం వేసవికి సరైనది. ఈ స్మూతీ సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. ఇది మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఇందులోని అల్లం, పసుపు దీర్ఘకాలిక నొప్పిని, వికారాన్ని తగ్గించడమే కాక రోగనిరోధక పనితీరును మెరుగుపరుస్తాయి.
హల్దీ-అజ్వైన్ కా పానీ :
ఎండాకాలంలో ప్రజలు ఎక్కువ మొత్తంలో నీరు తాగేందుకు ఇష్టపడతారు. కాబట్టి సాధారణ నీటికి బదులుగా హల్దీ, అజ్వైన్లను దినచర్యలో చేర్చుకునేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ పానీయం మీ దాహాన్ని తీర్చడమే కాక రోగనిరోధక శక్తిని పెంచేందుకు సరైనది.
టర్మరిక్ మిల్క్ పంచ్ :
ఈ ప్రత్యేక పానీయంలో పసుపు కలిపిన కొబ్బరి పాలు, జాజికాయ, అల్లం, దాల్చిన చెక్క, తేనె ఉన్నాయి. జీర్ణక్రియ, జీవక్రియను పెంచడానికి ఇది ఉత్తమం.
టర్మరిక్ ఇమ్యూనిటీ షాట్ :
ఈ పానీయం గొప్ప యాంటీఆక్సిడెంట్, ఇన్ఫ్లమేటరీ ఏజెంట్. జీర్ణక్రియను పెంచడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సాయపడుతుంది. అకాల వృద్ధాప్యాన్ని మందగించడం ద్వారా చర్మం నిగారింపుకు అద్భుతాలు చేస్తుంది.
పసుపు-పండ్ల పానీయం :
ఇది కొబ్బరి పాలతో చేసిన పండ్లు, సుగంధ ద్రవ్యాలు, గింజల మిశ్రమం. అరటి, పైనాపిల్ రుచులను కలిగి ఉండే ఈ పానీయంలో అల్లం, దాల్చినచెక్క, అవిసె గింజలు మిక్సప్గా ఉంటాయి.
ఆరెంజ్ అండ్ టర్మరిక్ స్మూతీ :
సమ్మర్ డ్రింక్ రిఫ్రెషింగ్‌గా ఉండాలని ఇష్టపడే వారు ఈ పానీయాన్ని ప్రయత్నించవచ్చు. ఈ పసుపు స్మూతీని నారింజ ఫ్లేవర్‌లో తయారు చేసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉత్తమ పానీయం.
మరిన్ని ఆరోగ్య వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి