collapse
...
Home / అంతర్జాతీయం / అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News...

అమెరికాలో గన్ గర్జనలు.. సమ్మర్ కి దీనికి లింకేంటి?

2022-06-04  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

guns

అమెరికాలో ఒక్కసారిగా పెరిగిన 'తుపాకీ హింస'కు, వేడి వాతావరణానికి లింక్ ఉందా ? క్లైమేట్ ఛేంజ్ కారణంగా దేశంలో పలు చోట్ల గన్ వయొలెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా..? అంటే అవునని నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల టెక్సాస్ స్కూల్లో జరిగిన ఊచకోత నుంచి తుల్సా హాస్పిటల్ ఘటనవరకు వివిధ సంఘటనలను విశ్లేషిస్తే.. ఇలా అంచనా వేయవలసి వస్తుందంటున్నారు.  ఎండలు , ఉక్కపోత వంటివాటితో వాతావరణం వేడెక్కుతున్నప్పుడు పెరిగిపోతున్న  కాల్పుల హత్యా కేసులతో ఇక్కడి పోలీసు శాఖలు సతమతమవుతున్నాయని వెల్లడవుతోంది. టెంపరేచర్-క్రైమ్ రేట్స్ మధ్య తెలియని లింక్ ఉందని కొన్ని దశాబ్దాల క్రితమే క్రిమినలా జిస్టులు అభిప్రాయపడినా ఇటీవల పెరిగిన గన్ షూటింగులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని హార్వర్డ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డేవిడ్ హెమెన్ వే పేర్కొన్నారు. బ్యాడ్ వెదర్ లో .. అంటే వాతావరణం బాగులేనప్పుడు గన్ క్రైమ్ రేటు తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఏ కారణంవల్లో  ప్రజలను హింసకు  ప్రేరేపించే అవకాశం ఉందట. ప్రపంచ వ్యాప్తంగా టెంపరేచర్లు పెరుగుతున్నాయి.. క్లైమేట్ ఛేంజ్ ఇందులో ప్రధాన పాత్ర వహిస్తోంది. అమెరికాలో క్రైమ్ రేట్ పెరగడానికి, దీనికి సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది అని ఆ ప్రొఫెసర్ అంటున్నారు. అమెరికా, ఇటలీ దేశాల్లో దాదాపు ఒకేవిధంగా 'హీట్', 'క్రైమ్' మధ్య అవినాభావ సంబంధం ఉందని, స్కాండినేవియా, సదర్న్ మెడిటరేనియన్ దేశాల్లో కూడా ఈ పరిస్థితి కనిపిస్తోందని ఆయన పేర్కొంటున్నారు. పైగా 2012-2016 మధ్య షికాగో నగరంలో జరిగిన హింసాత్మక ఘటనలపై స్టడీ చేసిన తన పూర్వ విద్యార్ధి పాల్ రీపింగ్ గురించి ఈయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంజురీ ఎపిడర్మియాలజీ అనే పేరిట ఆ విద్యార్ధి రాసిన ఓ పత్రానికి  2020 లో ఈ ప్రొఫెసర్ 'మెరుగులు దిద్దారు'.  అంటే ఆ డాక్యుమెంటుకు మరిన్ని విశేషాలు చేర్చి 'ఆధునీకరించారు'. నాడు షికాగోలో రోజుకు ఎన్ని కాల్పుల ఘటనలు జరిగాయి.. వాటికి, రోజువారీ టెంపరేచర్లకు, హ్యుమిడిటీ (వెచ్చదనం), గాలి వేగం, వాతావరణంలో తేడాలు వంటికి మధ్య గల సంబంధంపై షికాగో ట్రిబ్యూన్ వార్తాపత్రిక నుంచి ఆ విద్యార్ధి పలు విశేషాలను సేకరించాడట. 

భలే డిస్కవరీ ! 

వీక్ డేస్ లో ..అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు..సగటున  34 శాతం కాల్పుల ఘటనలు జరిగాయని, ఈ రోజుల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 10 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఎక్కువగా ఉందని, అలాగే ఇదే ఉష్ణోగ్రత వద్ద వీకెండ్స్ లో . అంటే శని, ఆదివారాల్లో ఈ విధమైన ఘటనలు 42 శాతం ఎక్కువగా ఉన్నాయని వీళ్ళు కనుగొన్నారు. 33.8 శాతం హయ్యర్ రేట్ షూటింగులకు, సగటు టెంపరేచర్ 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కి మధ్య లింక్ ఉన్నట్టు కూడా వెల్లడైంది. అదే శీతాకాలంలో ఇలాంటివి తక్కువ అని చెప్పొచ్చునని  హెమెన్ వే విశ్లేషించారు. ఇలాగే డ్రెక్సెల్ యూనివర్సిటీకి చెందిన లియా షినాసి అనే మరో ప్రొఫెసర్ 2017 లో 'అర్బన్ హెల్త్' అనే జర్నల్ లో తన అభిప్రాయాలను ప్రచురించారు. ఫిలడెల్ఫియాలో జరిగిన హింసాత్మక ఘటనలను ఆమె ఇందులో వివరించారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందని ఆమె అన్నారు. ఆమెతో బాటు ఘాసన్ హమ్రా అనే మరో ప్రొఫెసర్.. ఆమె అభిప్రాయాలతో ఏకీభవిస్తూ.. సాధారణంగా మే నెల నుంచి సెప్టెంబరు వరకు అంటే.. వేడి ఎక్కువగా ఉన్న నెలల్లో హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరగడాన్ని తాను గమనించానన్నారు. ఈ కాలంతో పోలిస్తే అక్టోబరు-ఏప్రిల్ మధ్యకాలంలో ఇలాంటివి తక్కువేనని పేర్కొన్నారు. కెన్యా, కాలిఫోర్నియా యూనిర్సిటీలకు చెందిన  విద్యార్థుల ప్రవర్తనా ధోరణులను 2019లో నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ సంస్థ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. కాగా వాతావరణ పరిస్థితులను బట్టి ముఖ్యంగా హాటెస్ట్ సమ్మర్ రోజుల్లో యువకులను వీధుల్లోకి రాకుండా చూస్తే కొంతవరకు ఫలితం కనిపించవచ్చునని, అలాగే వాతావరణ అంచనాల మేరకు ప్రధాన ప్రదేశాల్లో పోలీసుల సంఖ్యను పెంచినా మంచిదేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే రెండవది సాధ్యమే అయినా మొదటిది సాధ్యమవుతుందా అన్నది సందేహమే ! 

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 2022-06-04  News Desk