భారత దేశంలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తోన్న సూచనలు కనబడుతున్నాయి.కేవలం కొద్ది రోజుల్లోనే వేలదాఇగా కేసులు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ విజృంభణ కొనసాగుతోంది. తొలి మలి దశలకరోనా సమయచంలో మహారాష్ట్ర లో అత్యధిక కేసులు నమోదైన విషయం తెలిసింది. తాజాగా కోవిడ్-19 కేసులు ప్రతిరోజూ రాష్ట్రంలో విపరీతంగా పెరడగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నందున బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు విధిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ ప్రదీప్ వ్యాస్ అన్ని జిల్లాల అధికారులకు రాసిన లేఖలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. రైళ్లు, బస్సులు, సినిమాహాళ్లు, ఆడిటోరియంలు, కార్యాలయాలు, ఆసుపత్రులు, కళాశాలలు, పాఠశాలలు వంటి మూసి ఉన్న బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఆయన అన్నారు.క్రమంగా తగ్గుతూ వస్తున్న కోవిడ్ కేసులు ప్రస్తుతం కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.
దాదాపు మూడు నెలల తర్వాత ప్కరస్తుతం రోజుఊ 1000కివ పైగా కేసులు నమోఎదవడం ఆందోలల కలిగించే అంశమనివ డాక్టర్ వ్యాస్ పేర్కొన్నారు. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంతో పాటు థానేప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లో కూడా ఉండొచ్చని భావిస్తున్నామన్నారు.
"గత వారంలో, తొమ్మిది జిల్లాల్లో కొత్త కేసులు కనబడి కలవర పరిచాయి. అంతకు ముందు వారంతో పోల్చితే, తాజా పరిస్థిఉలను బట్టి ఖచ్చితంగా కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికైతే నియంత్రణలోనే ఉన్నప్పటికీ తగిన పచర్యలు తీసుకోవాలి. ఆస్పత్రుల్లో చేరికలను తగ్గించాలి. సాధ్యమైనంత మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటివద్దనే మందులు వాడాలని" ఆయన సూచించారు. ఇటీవలకాలంలో రాష్ట్రంలో BA.4, BA.5 సబ్వేరియంట్ల లక్షణాలతో రోగులఉ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేనప్పటికీ, ముందు జాగ్రత్త కోసం హెచ్చరికలు జారీ చేస్తున్నామన్నారు.
కోవిడ్ రూపాలు,పరిణామాలను అర్ధం చేసుకుంటూ తగినచర్యలు తీసుకోవాలని కోరారు. వ్యక్తులు నివసించే ప్రాంతాలు, అనారోగ్య సమయం వంటి విషయాలు పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని విశ్లేషించుకుంటూ స్థానికంగానే చర్యలు చేపట్టాలి.కేసుల మొత్తం క్లినికల్ స్పెక్ట్రమ్‌ను ట్రాక్ చేయాలంటూ పసూచించారు. క్రమం తప్పకుండా ఇన్ఫెక్షన్ వ్యాప్తి, కేసుల పురోగతి రీఇన్ఫెక్షన్ కేసుల నిష్పత్తిని నివశితంగా విశ్లేషించాలని అధికారులకు సూచించారు.ఇదిలా ఉండగా, శుక్రవారంనాడు కొత్తగా 1,134 కోవిడ్ -19 కేసులు వెలుగుచూశాయి. వీటిలో 763 కేసులు ముంబైలోనే కావడం విశేషం. కాగా నిన్న ఒక్కరోజే ముగ్గురు కోవిడ్ బారినపడి మరణించారు.