collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / టాటా మోటార్స్ రికార్డ్..అమ్మకాల్లో 185 శాతం వృద్ది..!! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

టాటా మోటార్స్ రికార్డ్..అమ్మకాల్లో 185 శాతం వృద్ది..!!

2022-06-02  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

tata-1
 

ప్రముఖ దేశీయవాహన తయారీదారు సంస్థ టాటా మోటార్స్...మే 2022నెలలో సంవత్సర ప్రాతిపదికన అమ్మకాలలో భారీ  వృద్ధిని నమోదు చేసింది. మే 2022 నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ సేల్స్ 76,210 వాహనాలుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో టాటా మోటార్స్ 26,661 వాహనాలను వాణిజ్య అండ్ ప్యాసెంజర్ విక్రయించింది.  

దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు...  

మే 2022లో ప్యాసింజర్ వాహన విభాగంలో 43,341కార్లను విక్రయించింది టాటా మోటార్స్.  అంటే వార్షిక ప్రాతిపదికన అమ్మకాల్లో 185శాతం భారీ పెరుగుదల అని చెప్పొచ్చు. గతేడాది ఇదే నెలలో కంపెనీ 15,181 ప్యాసింజర్ వాహనాలను విడుదల చేసింది.  

ఇ వెహికల్స్ అమ్మకాలు..  

మే 2022లో 39,887 ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది కంపెనీ. గతేడాది ఇదే నెలలో 14,705 యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. అంటే ఏడాది ప్రాతిపదికన 171 శాతం పెరుగుదల అని చెప్పొచ్చు. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు 3,454 యూనిట్లుగా నమోదయ్యాయి. దీంతో 626 శాతం భారీ  వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో టాటా మోటార్స్ భారత మార్కెట్లో 476 విద్యుత్ వాహనాలను విక్రయించింది.  

కాగా టాటా మోటార్స్ కూడా తన ప్రతినెల విక్రయాలను 1,754 యూనిట్లతో మెరుగుపరచుకుంది. దీంతో 4శాతం  వృద్ధి రేటును సాధించింది. బ్రాండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ విక్రయాలు కూడా ప్రతినెల ప్రాతిపదికన మెరుగుపడ్డాయి. కంపెనీ మే నెలలో 3,454 ఎలక్ట్రిక్ వెహికల్స్ ను విక్రయించింది. ఏప్రిల్ 2022లో 2,322 ఎలక్ట్రిక్ వెహికల్స్ ను విక్రయించింది టాటా మోటార్స్.  

వాణిజ్య వాహనాల విక్రయాల గురించి...  

టాటా మోటార్స్ మే 2022నెలలో మొత్తం 32,818 వాణిజ్య వెహికల్స్ ను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 11,401 వాణిజ్య వెహికల్స్ విక్రయించబడ్డాయి. కంపెనీ అమ్మకాల్లో ఏడాది ప్రాతిపదికన 188 శాతం  వృద్ధి రేటును నమోదు చేసుకుంది.  

దేశీయ మార్కెట్లో టాటామోటార్స్ మే 2022లో 31,414 వాణిజ్య వెహికల్స్ ను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 9,371 వాహనాలను విక్రయించింది. దేశీయవాణిజ్య వాహనాల విక్రయాలు 235శాతం  వృద్ధి రేటును నమోదు చేశాయి. అయితే బ్రాండ్ ఎగుమతులు 31శాతం క్షీణించాయి. టాటా మోటార్స్ మే 2022లో 1,404 వాణిజ్య వెహికల్స్ ను ఎక్స్ పోర్టు చేసింది. అంతేకాదు మే 2021లో 2,030యూనిట్లు ఎక్స్ పోర్టు చేయబడ్డాయి.  

 

మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి 



2022-06-02  Business Desk