Courtesy: twitter.com/KhadeejahRS
కపిల్ దేవ్ సారధ్యంలోని టీమిండియా 1983లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. వరల్డ్ కప్ గెలిచింది. ఆ పరిణామ క్రమాలను ఆధారంగా తీసుకుని రూపొందిన సినిమా 1983. కబీర్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్ర పోషించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ముంబైలో ఈ నెల 22న ప్రీమియర్ షో వేయనున్నారు.
బుర్జు ఖలీఫాపై మూవీ ట్రైలర్
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో పలు చోట్ల ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది చిత్ర యూనిట్. దుబాయ్ లోని బుర్జు ఖలీఫాపైన మూవీ ట్రైలర్ ప్రదర్శించారు. ఈ ట్రైలర్ ప్రదర్శనకు చిత్ర యూనిట్ తో పాటు లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ కూడా హాజరయ్యారు