6tvnews

Header - Ramky
collapse
...
Home / ఆరోగ్యం / వెయిట్ లాస్ / అధిక శరీర బరువు ... తగ్గించుకోవడం ఎలా? --2

అధిక శరీర బరువు ... తగ్గించుకోవడం ఎలా? --2

2021-11-21  Health Desk
venus

weight loss
 

నేటి యువతలో అధిక శరీర బరువు అనేది పెద్దసమస్యగా మారింది. శరీరం బరువు అదుపు చేసుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని సమస్యను పెంచేవి కూడా. ఇక్కడ శరీరం బరువు తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలు తెలుసుకుందాం.  


ఆహారం విషయంలో అవగాహన. ఆలోచించి సరైన మోతాదులో ఆహారం తీసుకునే వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ఏది, ఎప్పుడు, ఎందుకు, ఎంత వరకు అన్న ప్రశ్నలను గమనంలో ఉంచుకోవాలి. ఆహారాన్ని నెమ్మదిగా తీసుకోవడం వల్ల కూడా ఆలోచనాపూరిత దృక్పథం పెరుగుతుంది. అవసరమైనంత మేరకే, ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి. కనీసం 20 నిముషాలు భోజనానికి కేటాయించాలి. తీసుకునే ఆహారం విషయంలో కేలరీల పరంగా, తృప్తి కలిగించే ఆరోగ్యదాయకమైన వాటినే ఎంపిక చేసుకోవాలి.  

ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఆహారం తీసుకునే విషయంలో పది మందితో ఉన్నప్పుడు పద్దతిలో మార్పు వచ్చేస్తుంది. అలాంటి సామాజిక, పరిసరాల ప్రభావం లేకుండా ఎంత అవసరమో అంతవరకే తీసుకోవాలి. టీవీ చూస్తూ కొందరు అధికంగా తినేస్తారు. మరి కొందరు తమకు అవసరం లేకున్నా ఇతరులకు ఇచ్చే నెపంతో తామూ ఓ ముక్క నోట్లో వేసుకుంటారు. ఇవి మంచిది కాదు.  

ప్రణాళికాబద్ధమైన ఆహారం శ్రేయస్కరం. ఆరోగ్యానికి ఉపయోగపడేవి, ప్రణాళిక ప్రకారం ఆహారం అందుబాటులో ఉంచుకోవడమే ఉత్తమ మార్గం. ప్రాసెస్ డ్ ఫుడ్ దగ్గరలో ఉండకుండా చూసుకోవాలి.  

తోటి వారి మద్దతు చాలా అవసరం. అధిక బరువు తగ్గించుకునే విషయంలో ఇతరుల నుంచి ప్రోత్సాహం, సహాయసహకారాలు కూడా చాలా ముఖ్యం. అందులో భాగంగా తాము సాధించిన పురోగతిని (శరీరం బరువు నియంత్రించుకోవడంలో) అందరికీ ప్రదర్శించవచ్చు. సానుకూల మైన సామాజిక నెట్ వర్క్ పెంపొందించుకోవచ్చు. పరస్పరం సలహా సూచనలు అందించుకోవచ్చు.  

సానుకూల దృక్పథం. అధిక శరీరం బరువును తగ్గించుకోవడం అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు. చాలా రోజులు శ్రమించవలసి ఉంటుంది. అనుకున్న తీరులో బరువు తగ్గకపోతే నిరాశపాలై ప్రయత్నం మానేవారు చాలా మందే ఉంటారు. అందుకు చాలా ఓపికగా సాధన కొనసాగించాలి. ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలి. ఆరు నెలల వ్యవధిలో 5 నుంచి 10 శాతం బరువు తగ్గినా సరైన మార్గంలోనే వెడుతున్నామని గుర్తించాలి. రోజకు తీసుకునే కేలరీల పరిమాణాన్ని 1000 లేదా 1500 కు తగ్గించడం కూడా ఫలితాలు ఇస్తాయి.  


2021-11-21  Health Desk

rajapush