సినిమా టిక్కెట్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ధియేటర్లు వద్ద కూడా ఆన్ లైన్ ద్వారనే టికెట్లు అమ్మలని కొత్త జీవో జారీ చేసింది ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్థను ఎంపిక చేయడానికి టెండర్లు కూడా పిలించింది. అల్లు అరవింద్ కుమారుడికి చెందిన సంస్థ టాప్ లిస్ట్ లో నిలిచింది. దీంతో కాంట్రాక్ట్ దక్కడం ఖాయమేనని ప్రచారం జరిగింది. కానీ హఠాత్తుగా ఈ ప్రక్రియ ఆపేశారు ఏపి ప్రభుత్వ పెద్దలు. రెండునెలల పాటు ఈ విషయం గురించి మాట్లాడలేదు.తాజాగా ఆన్ లైన్ టిక్కెటింగ్ గురించి మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే ఉన్న ఆన్ లైన్ టికెటింగ్ బుకింగ్ సంస్థలు కూడా ఈ రూల్స్ ని ఫాలో అవ్వలని అందులో పేర్కొన్నారు.
ఆన్‌న్‌లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించి నోడల్ ఏజెన్సీగా APFDC సర్వీస్ ప్రొవైడర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. ఇకపై రాష్టంలోని థియేటర్లు APFDCతో అగ్రిమెంట్ చేసుకోవాలని అందులో సూచించింది.ఏపిలో ఉన్న అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ సర్వీస్ ప్రొవైడర్ గేట్ వే ద్వారా మాత్రమే అమ్మకాలు చేపట్టాలని ఆదేశించింది.
ఆన్ లైన్ టిక్కెటింగ్ ద్వారా విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం సర్వీస్ చార్జీ వసూలు చేయాలని జీవోలో తెలిపింది. థియేటర్లలో ఎటువంటి అవకతవకలు లేకుండా పక్కాగా ఆన్లైన్ టికెట్ల అమ్మకాలు చేయాలని, కొత్త సినిమా విడుదల టైమ్ లో వారం రోజుల ముందు నుంచే టిక్కెట్ అమ్మాకాలు జరపాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. మల్టీప్లెక్స్ చైన్స్ తో పాటు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ పోర్టల్ ను ఉపయోగించుకోవచ్చు.
జగన్ ప్రభుత్వం వెబ్ పోర్టల్ లాంచింగ్ వివరాలను త్వరలో తెలియచేయనుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న బుక్ మై షో, జస్ట్ టికెట్స్ వంటి సంస్థలు ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలు పై 8 నుంచి 10 శాతం వరకూ కమీషన్ వసూలు చేస్తున్నాయి.ఏపి ప్రభుత్వం తీసుకోస్తున్న పోర్టల్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వానికి ఆదాయం లభించటంతో పాటు ప్రేక్షకులకు కూడా తక్కువ ఖర్చులోనే రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కలుగుతుంది.
పసందైన వినోదం కోసం ఇక్కడ క్లిక్ చేయండి