ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్ అధికోత్పత్తి కారణంగా దాదాపు 20 కోట్ల డోసులను ధ్వసం చేయాల్సి వస్తోందని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా చెప్పారు. ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వాటి గడువు కాలం ముగుస్తుండంతో తమ వద్ద ఇప్పటికే పేరుకుపోయిన 20 కోట్ల వ్యాక్సిన్ డోసులను వృధాగా పారేయవలసి వస్తోందని ఆయన చెప్పారు.
స్విట్జర్లండ్ లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీరమ్ సీఈఓ వచ్చే సెప్టెంబర్ లోగా తమ వద్ద పేరుకుపోయిన 20 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను వృధా చేయవలసి వస్తోంది వాటి గడువు కాలం అప్పటికి ముగిసి పోనున్నందున తర్వాత వాటిని వాడలేమని చెప్పారు.
చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం పుంజుకోవలిసన అవసరం ఉందని, 12, 18 సంవత్సరాల లోపు పిల్లలకు కోవోవాక్స్ డోసులను తమ కంపెనీ తయారు చేసి సిద్ధంగా ఉంచిందని ఆయన చెప్పారు. చిన్నపిల్లల కోసంఉద్దేశించిన ఈ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడవుతోందని, ఇప్పటికే 80 మిలియన్ డోసులను అమ్మామని ఆయన చెప్పారు. యూరప్‌లో మరో పది కోట్ల కోవోవాక్స్ డోసులను అమ్మగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. జూన్ నాటికి యూఎస్ ఫెడరల్ డ్రగ్స్ అసోసియేషన్ నుంచి ఈ వ్యాక్సిన్ వాడకంపై అనుమతి పొందగలమని పేర్కొన్నారు.
డిసెంబర్ లోగా సెర్వికల్ కేన్సర్కోసం వ్యాక్సిన్‌ని సిద్ధం చేయగలమని సీరమ్ సీఈఓ చెప్పారు. మలేరియా, డెంగ్యూ వ్యాక్సిన్ల కోస్ క్లినికల్ పరీక్షలు మొదలెట్టామన్నారు. మహమ్మారులు పదే పదే దాడి చేస్తున్న నేపథ్యంలో గ్లోబల్ పాండమిక్ ట్రీటీని కుదుర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని అదార్ పూనవిల్లా చెప్పారు.