collapse
...
Home / బిజినెస్ / టెక్నాలజీ / రూ.20వేలలోపు లభిస్తోన్న బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News...

రూ.20వేలలోపు లభిస్తోన్న బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఇవే..!

2022-06-03  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

phone

భారత్ లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ అంతకంతకూ పెరిగిపోతోంది. రోజు రకరకాల ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది తమ పాతఫోన్ల స్థానంలో కొత్త ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫాస్టెస్ ఇంటర్నెట్ బెస్ట్ కనెక్టివిటీ కోసం 5జీ ఫోన్లను అందిస్తున్నాయి టాప్ బ్రాండ్స్. మన దేశంలో ఈ ఏడాదే 5జీ స్ట్పెక్ట్రమ్ అందుబాటులోకి వచ్చింది.ఈక్రమంలో చాలా కంపెనీలు తక్కువ ధరలోనే 5జీ డివైజులను యూజర్లకు అందిస్తున్నాయి. మీ రూ. 20వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్ కోసం చూస్తుంటే...ఈ మోడళ్లను ఓసారి పరిశీలించండి. 

1. రియల్ మీ 9 ఎస్ఈ 5జీ: 

భారత్ లో రూ. 20వేల లోపు ఉన్న అత్యుత్తమ స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి. ఈ డివైస్ పవర్ ఫుల్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ న కలిగి ఉంది. మిగతా స్మార్ట్ ఫోన్ల కంటే తక్కువ ధరకు ఈ ఫోన్ లభిస్తోంది. ఇది  144Hz డిస్‌ప్లేకు సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ ధరలో ఏ స్మార్ట్ ఫోన్ కూడా ఇన్ని సౌకర్యాలు అందించదు. పర్ఫెక్ట్ బ్యాక్ కెమెరా 6.6అంగుళాల ఫుల్  HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఈస్మార్ట్ ఫోన్లో ఆకట్టుకునే అంశం ఏంటేంటే...కంపెనీ అధిక రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతోపాటు...అధిక శ్రేణి చిప్ ను అందిస్తున్నప్పటికీ...ఫాస్ట్ ఛార్జింగ్ తోపాటు రిటైల్ బాక్స్ లోకి బండిల్ చేయగలిగింది. హ్యాండ్ సెట్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తో వస్తుంది. ఇందులో  5,000mAh బ్యాటరీతో అమర్చబడింది.  ఇక రియల్‌మీ ఖర్చును సమతుల్యం చేయడానికి స్టీరియో స్పీకర్‌లను తొలగించింది. ఇది ఒకే స్పీకర్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం, Realme 9 SE 5G ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 20,049కి  అందుబాటులో ఉంది. రూ.20వేలలోపు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. 

2. రెడ్ మీ నోట్ 11 ప్రో ప్లస్  5జి 

రెడీ మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ కూడా రూ. 20వేల లోపు లభిస్తోన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ జాబితాలోఉంది. ఈ ఫోన్ లో క్వాలిటీ ఫోటోలు, ఆప్టిమైజ్ చేసిన బ్యాటరీ లైఫ్ ను పొందవచ్చు. స్టీరియో స్పీకర్లలతోపాటు ఆల్మోడ్ 120Hz 6.67 అంగుళాల డిస్ ప్లే కంటెంట్ ఉంటుంది. ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్ ద్వారా సేఫ్ గా ఉంటుంది. ఈ డివైస్ అధికారిక ఐపీ రేటింగ్ తో వస్తుంది. స్ప్లాష్ లను తట్టుకునే శక్తి ఈ ఫోన్లో ఉండటం అదనపు ఫీచర్ అని చెప్పవచ్చు. 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 11పై రన్ అవుతోంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను కంపెనీ ఇంకా విడుదల చేయలేదు. ఈ స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజ్ మోడల్ ధర రూ. 19,999గా ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం mi.comలో అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై రూ. 2వేల వరకు తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు. 

3.శాంసంగ్ గెలక్సీ ఎఫ్ 23 5జీ 

ఈస్మార్ట్ ఫోన్ కూడా రూ. 20వేల లోపు జాబితాలో ఉంది. ఈ డివైస్ స్పెక్స్ ను కలిగి ఉంటుంది. ఆల్ రౌండర్, మిడిల్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కోసం సెర్చ్ చేస్తున్నవారికి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఇది స్నాప్ డ్రాగన్ 750 జి చిప్ సెట్ ప్యాక్ చేస్తుంది. తక్కువ ధర ఫోన్లలో  Exynos 1280 చిప్‌సెట్ కంటే మెరుగైన పనితీరును కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్ 23 5జీ స్మార్ట్ ఫోన్ 25వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది ప్రస్తుతం ఫ్లిప్ కార్డులో 15,999కి అందుబాటులో ఉంది. 

ఈఫోన్లో ఆల్మోడ్ స్క్రీన్ లేనప్పటికీ ఎల్సీడీ డిస్ ప్లే స్పష్టంగా ఉంటుంది. 120hzరిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది పూర్తిగా హెడ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో పనిచేస్తుంది. 6.6అంగుళాల పరిమాణంలో ఉంటుంది. ఈ ఫోన్ 4వేలకు పైగా వీడియోలను రికార్డు చేయవచ్చు. బ్యాక్ కెమెరా సెటప్ మధ్యాహ్నం సమయంలో షాట్స్ ను అందిస్తుంది. 5జీ సపోర్టు కూడా ఉంది. 

4. మోటో జి 71 5జీ 

 స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌తో స్మార్ట్‌ఫోన్ కావాలనుకునేవారు మోటోరోలా మోటో జి71ను ఇష్టపడతారు. రెడ్ మీ నోట్ 11 ప్రోప్ల స్మార్ట్ ఫోన్ కు శక్తినిచ్చే స్నాప్ డ్రాగన్ 695 socని కలిగి ఉంది. పనితీరులో ఎలాంటి పెద్ద వ్యత్యాసం ఉండదు. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ను పొందుతారు. 5, 000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.   
 

 మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి2022-06-03  Business Desk