collapse
...
Home / వినోదం / తెలుగు / 2021 Roundup: కష్టకాలంలో అండగా నిలిచిన ఓటీటీ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for T...

2021 Roundup: కష్టకాలంలో అండగా నిలిచిన ఓటీటీ

2021-12-24  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

teamdaggubati

2021లో కూడా టాలీవుడ్ పరిశ్రమను కష్టాలు, నష్టాలు, సమస్యలు వెంటాడాయి. అయినా వాటిని తట్టుకొని ఇండస్ట్రీ నిలబడింది. 21 ఫస్టాఫ్ డల్ గా గడిచినా సెకండ్ హాఫ్ కాస్త మెరుగనిపించింది. థియేటర్లు తెరుచుకున్నాయి. 2021 మొదటి నుంచీ… థియేటర్లు మూతబడిన టైంలో ఓటీటీ కొంతవరకూ అండగా నిలబడిందనే చెప్పాలి. తెలుగు సినిమాలు చాలావరకు ఓటీటీలోనే వచ్చాయి. సెకండ్ హాఫ్ లో థియేటర్లలో రిలీజైన తర్వాత కొన్ని ఓటీటీకి వెళ్లాయి. మరికొన్ని డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజయ్యాయి.     

 గత ఏడాది, ఈ ఏడాది (2021) కరోనా కారణంగా  సినిమాల నంబర్ కొంత తగ్గింది. డిసెంబర్ 23 నాటికి 111 తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. 31 నాటికి మరో ఎనిమిది సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి. అంటే 2021లో దాదాపు 119 తెలుగు సినిమాలు.    

మంచి కథలతో మూవీస్    

 ఈ ఏడాది టాలీవుడ్ సినిమాల్లో కథల పరంగా పెద్ద మార్పే వచ్చింది. రొటీన్ సినిమాలు కొన్ని వచ్చినా కథాబలం ఉన్న మూవీస్ చాలా వచ్చాయి. చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే స్టార్ హీరోలు కూడా స్టోరీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం మనం చూశాం. దీనికి కారణం ఓటీటీ . ఈ ప్లాట్ ఫాం మొదట చిన్న సినిమాలకు వెల్ కం చెప్పింది. బిగ్ స్క్రీన్ కు, ఓటీటీ మీడియాకు మధ్య… మేకింగ్ లో ప్రెజెంటేషన్ లో తేడా ఉంది. వెరైటీ కథలకు, కొత్త డైరెక్టర్లకు, చిన్న బడ్జెట్ చిత్రాలకూ ఓటీటీ అండగా నిలిచింది. ఆ రన్ చూసిన స్టార్స్ కూడా రూట్ మార్చుకుని, ఓటీటీ వైపు మొగ్గు చూపించారు. ఈ ఏడాది  ఎంటర్ టైనర్స్, ఫ్యామిలీ పిక్చర్స్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్స్, కొంత వల్గారిటీ ఉన్నవీ వచ్చాయి.    

కొందరు హీరోలు దూరం     

ఇక  సీనియర్ హీరోలు,స్టార్ హీరోలు, కుర్ర హీరోల సినిమాల విడుదల సంగతి చూద్దాం. సీనియర్ హీరోల్లో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రవితేజ సినిమాలు వచ్చాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి సినిమా ఒక్కటి కూడా ఈ ఏడాది రాలేదు. అలాగే స్టార్ హీరోల్లో మహేష్ బాబు, జూనియర్ ఎన్ టిఆర్, రాంచరణ్, ప్రభాస్ ల సినిమాలేవీ ఈ ఏడాది రాలేదు. మరో విశేషమేంటంటే … గత రెండేళ్లుగా ఇదిగో అదిగో అంటూ ఊరించిన నాగార్జున తనయుడు అఖిల్ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పిక్చర్ విడుదలైంది.    

కొత్తవారికి గేట్ వే    

అంతా కొత్తవారే నటించిన జాతి రత్నాలు హిట్ కొట్టింది. కేరక్టర్ ఆర్టిస్టులు జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ చాలా సినిమాలు వచ్చాయి. జగపతిబాబు ఎక్కువ సినిమాల్లో చేశారు. ఆ తర్వాత రాజేంద్రప్రసాద్. చిన్న సినిమాలు చేసిన యంగ్ హీరోలు, డైరెక్టర్లకు 2021 గేట్ వే అయింది. కొందరి తొలి చిత్రాలూ వచ్చాయి.    

చాలాకాలం తర్వాత…    

హీరోయిన్ల పరంగా చూస్తే.. అనుష్క, సమంత వంటి సీనియర్ హీరోయిన్ల సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కాలేదు. ఆనాటి హీరోయిన్లు మీనా, భూమిక, ప్రియమణి చాలాకాలం తర్వాత కనిపించారు. రమ్యకృష్ణ ఏం తగ్గలేదు. కొంతకాలంగా టాలీవుడ్ కు దూరమైన శ్రుతి హాసన్ ఈ ఏడాది తెరమీద కనిపించింది. రకుల్, తమన్నా కూడా అంతే.     

  హీరోల సినిమాలు    

టాలీవుడ్ ప్రముఖ హీరోల్లో ఎవరెవరు ఏఏ సినిమాలు చేశారో చూద్దాం.     

రవితేజ మూవీ ‘క్రాక్’ ఈ ఏడాది విడుదలైన మొదటి సినిమా . బాలకృష్ణ అఖండ, వెంకటేష్ నారప్ప, దృశ్యం 2 , నాగార్జున వైల్డ్ డాగ్, రాజశేఖర్  దెయ్యం సినిమాలు రిలీజయ్యాయి. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, అల్లు అర్జున్ పుష్ప, రానా దగ్గుబాటి - అరణ్య, నాగచైతన్య లవ్ స్టోరీ, నాని - టక్ జగదీశ్, శ్యాం సింగ రాయ్, అల్లరి నరేష్ బంగారు బుల్లోడు, నంది, నితిన్- చెక్, రంగ్ దే, మాస్ట్రో, మంచు విష్ణు - మోసగాళ్లు, శర్వానంద్ - శ్రీకారం, మహాసముద్రం, గోపీచంద్ సీటీమార్, ఆరడుగుల బుల్లెట్, విజయ్ సేతుపతి- ఉప్పెన సినిమాలు చేశారు.    

 కుర్ర హీరోల హవా    

కొందరు హీరోలు కొంత గ్యాప్ తర్వాత ఈ ఏడాది కనిపించారు. సుమంత్- ఇదే మాకథ, కపటధారి, సాయిధరమ్ తేజ్ - రిపబ్లిక్, సందీప్ కిషన్- ఎ 1 ఎక్స్ ప్రెస్, వివాహ భోజనంబు, గల్లీ రౌడీ, రామ్ పోతినేని - రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ -అల్లుడు అదుర్స్, బాలాదిత్య అన్నపూర్ణమ్మగారి మనవడు, రాజ్ తరుణ్ - పవర్ ప్లే, అనుభవించు రాజా, నవీన్ పొలిశేట్టి - జాతి రత్నాలు, కార్తికేయ - చావు కబురు చల్లగా, రాజా విక్రమార్క,సుమంత్ అశ్విన్ - ఇదే మన కథ, విష్వక్ సేన్ - పాగల్, సుధీర్ బాబు - శ్రీదేవి సోడా సెంటర్, సుశాంత్ - ఇచట వాహనములు నిలుపరాదు, అవసరాల శ్రీనివాస్ - నూటొక్క జిల్లాల అందగాడు, రాహుల్ రామకృష్ణ- నెట్, ఆకాష్ పూరి - రొమాంటిక్, నాగశౌర్య - వరుడు కావలెను, లక్ష్య, ఆది పినిశెట్టి గుడ్ లక్ సఖి సినిమాల్లో నటించారు.    


2021లో   హీరోయిన్ల సినిమాలు    

ఈ ఏడాది మొదటి హీరోయిన్ శ్రుతిహాసన్. రిలీజైన మొదటి సినిమా క్రాక్. పిట్టకథలు మూవీలో కూడా శ్రుతి నటించింది. ఈమధ్య ఆమె టాలీవుడ్ కు దూరమైంది. తమిళంలో నటిస్తోంది. అలాగే, బాలీవుడ్ లో ట్రై చేస్తూ టాలీవుడ్ పట్టించుకోని రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెక్, కొండపొలం మూవీల్లో చేసింది.    

స్టార్ హీరోయిన్ల మూవీస్      

 కాజల్ మంచువిష్ణుతో మోసగాళ్లు సినిమాలో చేసింది. సాయిపల్లవి-లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ మూవీస్ లో, నయనతార- ఆరడుగుల బుల్లెట్, పూజా హెగ్డే- మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రష్మిక మందన- పుష్ప,  తమన్నా- మాస్ట్రో, సీటీమార్, కీర్తి సురేష్ -రంగ్ దే, గుడ్ లక్ సఖి,  సినిమాల్లో చేశారు.    

  హుషారుగా కుర్ర హీరోయిన్లు     

నిత్యామీనన్ -నిన్నిలా నిన్నిలా, గమనం మూవీల్లో, లావణ్య త్రిపాఠీ- ఎ 1 ఎక్స్ ప్రెస్, చావుకబురు చల్లాగా సినిమాల్లోనూ ,  ప్రియాంక అరుల్ మోహన్- శ్రీకారం,  దియా మీర్జా - నాగార్జున చిత్రం వైల్డ్ డాగ్ లో, నివేదా థామస్, అంజలి - పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, శ్రద్ధాదాస్ - ఏక్ మినీ కథలో, ప్రగ్యా జైస్వాల్ -అఖండ సినిమాల్లో నటించారు.    

నివేదా పెతురాజ్ -రెడ్, పాగల్,  నభా నటేష్- అల్లుడు అదుర్స్, అనూ ఇమాన్యుయెల్ -అల్లుడు అదుర్స్, మహాసముద్రం,  వరలక్ష్మీ శరత్ కుమార్-  క్రాక్, పిట్టకథలులో  యాక్ట్ చేశారు.  పూజా జవేరి -బంగారు బుల్లోడు, అలాగే ప్రీతిశర్మ- జైసేన, ఆనంది -జాబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, అమ్ము అభిరామి -ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్, ఇషా రెబ్బా, అమలాపాల్ - పిట్టకథలు, నందితా శ్వేత- అక్షర మూవీలో యాక్ట్ చేశారు.     

ఇక వీళ్లు కూడా…     

ఇక ప్రియాంక జవల్కర్ -తిమ్మరుసు, నాలుగేళ్ల కిందట కన్నుకొట్టి, నెటిజన్లను ఫిదా చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ - ఇష్క్, మేఘా ఆకాష్ - డియర్ మేఘా, రుహానీ శర్మ - నూటొక్క జిల్లాల అందగాడు, అవికా గౌౌర్- నెట్, ఐశ్వర్యా రాజేష్ -టక్ జగదీశ్, రిపబ్లిక్ సినిమాల్లో, మీనాక్షి చౌదరి - ఇచట వాహనములు నిలుపరాదు మూవీలో చేశారు. అదితిరావ్ చౌదరి- మహాసముద్రం, ఇషా రెబ్బా  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సంచిత పదుకొనె- అసలేం జరిగింది?,కేటికా శర్మ- లక్ష్య, మెహరీన్ ఫిర్జాదా- మంచిరోజులొచ్చాయి, అనసూయ- థాంక్యూ బ్రదర్,  రితూ వర్మ- వరుడు కావలెను,టక్ జగదీశ్    

 కృతిశెట్టి - శ్యాం సింగరాయ్ సినిమాల్లో యాక్ట్ చేశారు.    

నిన్నటి హీరోయిన్లు కనిపించారు    

నిన్నటి అంటే ఒక జనరేషన్ కిందటి హీరోయిన్లు ప్రియమణి- వెంకటేష్ తో నారప్పలోనూ, మీనా -దృశ్యం 2, భూమిక - ఇదే మా కథ,  ఆమని- అమ్మదీవెన, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ , రమ్యకృష్ణ - రిపబ్లిక్, రొమాంటిక్  సినిమాల్లో నటించారు.    

-వి. మధుసూదనరావు    2021-12-24  Entertainment Desk