6tvnews

Header - Ramky
collapse
...
Home / క్రీడలు / ఫుట్ బాల్ / వివాదాల సుడిగుండంలో 2022 ఫిఫా వరల్డ్ కప్

వివాదాల సుడిగుండంలో 2022 ఫిఫా వరల్డ్ కప్

2021-11-25  Sports Desk
venus

fifa
 

 

ఫుట్ బాల్ ప్రపంచంలో    ఫిఫా గురించి తెలీని వారుండరు. దాని పూర్తి పేరు ఫెడరేషన్ ఇంటర్ నేషనలె డి ఫుట్ బాల్ అసోసియేషన్ ’. 2022 ‘ ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి ఖతార్ ఆతిథ్యమిస్తోంది. ఈ పోటీని ఖతార్ వ్యాపారం కోసం నిర్వహించడం లేదు. డబ్బు గురించి చూడడం లేదు. ప్రపంచంలో అతి సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్ ఈ పోటీలకు ఎంత వ్యయమైనా భరించేందుకు సిద్ధంగా ఉంది. నాన్ - కమర్షియల్ గా ఆతిథ్యమిస్తోంది. ఈ ప్రపంచకప్ తో కోట్లాది మంది ప్రపంచ ప్రజలకు పరిచయమయ్యే అవకాశం ఖతార్ కు లభిస్తుంది.   

    

చుట్టుముట్టిన వివాదాలు   

పురుషుల వరల్డ్ కప్  2022 కోసం ఫిఫా మొదటిసారి మిడిల్ ఈస్ట్ దేశం ఖతార్ ను ఎంపిక చేసుకున్నప్పుడు అది పొరపాటు నిర్ణయమని ఫిఫా మాజీ అధ్యక్షుడు సెప్ బ్లాటర్ తో సహా అందరూ పెదవి విరిచారు. అది సాహసమన్నారు. బిడ్డింగ్ లో అవినీతి , అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ మెగా ఈవెంట్ కు ఇంకా ఏడాది వ్యవధి ఉన్నా వివాదాలు సద్దుమణగలేదు. అంతేకాదు. వరల్డ్ కప్ కోసం స్టేడియం నిర్మిస్తున్న వలస కార్మికుల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందనే వివాదమూ రేగింది. ఇది హాట్ టాపిక్ అయింది. ఈ వివాదాల ప్రభావం ఎలా ఉంటుంది ? ఖతార్ వరల్డ్ కప్ కు సందర్శకులను దూరం చేస్తుందా ? అన్నది ఇప్పుడే చెప్పలేం.   

 

ఇలా భావించడానికి కారణం ఉంది.  2019 లో ఖతార్ ఐఎఎఎఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ కు ఆతిథ్యమిచ్చింది. అప్పుడు సగం స్టేడియం ఖాళీగా కనిపించింది. అథ్లెటిక్స్ కంటే ఫుట్ బాల్ కు ప్రపంచమంతా అమోఘమైన ఆదరణ ఉంది. కాబట్టి  2019 సీన్ రిపీట్ కాదని ఖతార్ , ఫిఫా అనుకుంటున్నాయి.     ఈ భారీ ఈవెంట్ ను మరచిపోలేని విధంగా నిర్వహించాలని , అందుకు ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని కతార్ భావిస్తోంది.   

 

భారీ వ్యయమే మరి   

ఈ ఈవెంట్ కు  65 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయమవుతుందని కతార్  2010 లోనే అంచనా వేసింది. కానీ తాజా అంచనాల ప్రకారం  300 బిలియన్ డాలర్లు అవుతుందని తెలుస్తోంది. స్టేడియం నిర్మాణానికే  10 బిలియన్ డాలర్లవుతోంది. దేశంలో భారీ ప్రాజెక్టులకు చేసే వ్యయంతో పోలిస్తే ఇది చాలా తక్కువ.       

 

ఒక్కొరిదీ     ఒక్కో లక్ష్యం   

ఈ వరల్డ్ కప్ ద్వారా ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని కతార్ భావిస్తోంది. కొందరు దీన్ని తప్పు పడుతున్నారు. విమర్శలూ వస్తున్నాయి. వాటితో పాటు ప్రశంసలూ ఉన్నాయి. ఈ ఈవెంట్ తో ఖతార్ అంతర్జాతీయ క్రీడా ప్రాజెక్టులలోకి ప్రవేశిస్తుందని , ఫార్ములా  1 లో     గ్రాండ్ ప్రిక్స్ ను ప్రారంభించడం ద్వారా     ఇమేజ్ పెరుగుతుందని అంటున్నారు. ఎఫ్  1 కు జరిగే మిడిల్ ఈస్ట్ ఫైనాలే     రేస్ మూడు భాగాలుగా ఉంటుంది. అందులో సౌదీ అరేబియా , అబూ దాబి కూడా ఉంటాయి. ఖతార్ మొదటి రేస్ లో పాల్గొంటోంది. ఇందువల్ల అరబ్ ప్రపంచంలో ఖతార్ పేరు మారుమోగుతుంది. పరపతి పెరుగుతుంది. కాబట్టి ఇది మంచి ఛాన్స్. సోషల్ , కల్చరల్ పరంగా ముందు ముందు మరిన్ని వరల్డ్ ఈవెంట్స్ చేయడానికి ఇది మొదటి అడుగు అవుతుంది. ఖతార్ కీలక పాత్ర పోషించేందుకు వీలవుతుంది. అలాంటి కొత్త ప్రాజెక్టుల్ని డిజైన్ చేసింది.       

 

డబ్బు ఖర్చు చేయడానికి ఖతార్ వెనకడుగు వేయడం లేదు. కానీ ఫిఫాకు ఇది బిజినెస్. వరల్డ్ కప్ సక్సెస్ పైనే ఫిఫా డిపెండ్ అయింది.  2018 వరల్డ్ కప్     రష్యాలో జరిగింది. అప్పుడు  6.4 బిలియన్ డాలర్లు రెవెన్యూ రావడానికి ఫిఫాకు రష్యా తోడ్పడింది. అందులో చాలా మొత్తాన్ని విద్యకోసం , డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేసింది.  2022 లో ఖతార్ లో జరిగే ఈవెంట్ పైనా ఫిఫా ఇలాంటి ఆశలే పెట్టుకొంది. మరింత ఆదాయం కోసం ఫిఫా ప్రతి రెండేళ్ల కొకసారి ఫుట్ బాల్ టోర్నమెంట్ లు జరపాలని అనుకుంటోంది. ఖతార్ , ఫిఫా లక్ష్యాలు వేరైనా , అవి నెరవేరాలంటే ప్రపంచ దేశాలు ఈ వరల్డ్ కప్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఖతార్ అనుకున్నది నెరవేరితే అది ఈవెంట్స్ నిర్వహణలో మేజర్ రెగ్యులర్ ప్లేయర్ అవుతుంది.   

…………………………………………..   

 


2021-11-25  Sports Desk

rajapush