collapse
...
Home / చదువు / నీట్ 2022 అడ్మిట్ కార్డు.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News...

నీట్ 2022 అడ్మిట్ కార్డు.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

2022-05-30  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link


neet new
 

జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష (నీట్-యుజి) కోసం  అడ్మిట్ కార్టును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేయడానికి రంగం సిద్ధంచేసింది. ఈ పరీక్ష 2022 జూలై 17న దేశవ్యాప్తంగా జరగనుంది. నీట్ యూజీ 2022 అడ్మిట్ కార్డు విడుదల కోసం ఎన్‌టీఐ అలాంటి తేదీని విడుదల చేయలేదు కానీ పరీక్షలకు ఇప్పటికే నమోదు చేసుకున్న వారు తమ అడ్మిట్ కార్డును neet.nta.nic.inలో త్వరలో డౌన్ లోడ్‌ చేసుకోవచ్చు.

గతంలోని ట్రెండ్స్ ప్రకారం అయతే నీట్ యూడీ అడ్మిట్ కార్డులను సాధారణంగా పరీక్షకు 10-15 రోజుల ముందు ఇస్తుంటారు. ఈ సంవత్సరం నీట్ యూజీ పరీక్షను జూలై 17న నిర్వహిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అడ్మిట్ కార్డును విడుదల చేస్తారని భావిస్తున్నారు.  ఈలోగా పలువురు విద్యార్థులు ఈ సంవత్సరం నీట్ యూజీ పరీక్షను ఆరువారాల వరకు వాయిదా వేయాలని లేదా ఆగస్టు లేక సెప్టెంబర్ మొదటికి వాయిదా వేయాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. కారణం ఇతర అనేక పరీక్షలతో నీట్ యూజీ 2022 పరీక్ష క్లాష్ అవుతోంది. జూలై 17నే నీట్ యూజీ పరీక్షను నిర్వహిస్తే జూన్ 15న సీబీఎస్‌సీ బోర్డ్ ఎగ్జామ్, మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ముగించడానికి తక్కువ సమయ మాత్రమే ఉంటుందని దీంతో నీట్ యూజీ 2022 పరీక్షకు ప్రిపేర్ కావడానికి సమయం మాత్రం సరిపోదని విద్యార్థుల వాదన.

అలాగే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్టు (సీయూఈటి) జూలై తొలి వారం, రెండోవారంలో నిర్వహిస్తున్నారు కనుక నీట్ 2022 పరీక్షను తప్పకుండా వాయిదా వేయాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ లెక్కన అడ్మిట్ కార్డు విడుదల కూడా ఆలస్యం అయేటట్లుంది.

నీట్ యూజీ 2022 అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా
ఒకసారి అడ్మిట్ కార్డును విడుదల చేశాక దాన్ని డౌన్ లోడ్ చేయడానికి విద్యార్థులు కింది దశలను పాటించాలి.

స్టెప్ 1 
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in కి వెళ్లండి

స్టెప్ 2 
NEET UG 2022 అడ్మిట్ కార్డు లింకుపై క్లిక్ చేయండి

స్టెప్ 3 
అప్లికాంట్ పోర్టల్‌కి లాగిని అవండి.

స్టెప్ 4 
NEET 2022 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది

స్టెప్ 5 
అడ్మిట్ కార్టులో సూచించిన వివరాలు చదవండి

స్టెప్ 6 
దాన్ని డౌన్ లోడ్ చేసుకుని ప్రింటవుట్ తీసి భద్రంగా ఉంచుకోండి.

స్టెప్ 7 
NEET exam 2022 ద్వారా 92,065 MBBS, 26,949 BDS, 52,720 Step 8. AYUSH, 525 BVSc, and AH సీట్లకు అడ్మిషన్లు జరుగుతాయి

NEET UG 2022 ఎగ్జామ్ విధానం

జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం, NEET UG 2022ని 13 భాషల్లో పెన్, పేపర్ మోడ్‌లో నిర్వహిస్తారు. పరీక్షా సమయం 3 గంటల 20 నిమిషాలు. పేపర్‌లో 200 ప్రశ్నలుంటాయి. వీటిలో అభ్యర్థి 180 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. అంటే స్కోర్ వచ్చి 720 అన్నమాట. ప్రశ్నను అటెంప్ట్ చేయకపోతే నెగటివ్ మార్కు ఉండదు కానీ తప్పు సమాధానం రాస్తే ఒక్కో తప్పుకు ఒక్కో మార్కును స్టూడెంట్లు కోల్పోతారు.

 

మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 


 



2022-05-30  Education Desk