collapse
...
Home / చదువు / జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్ 2022 అడ్మిట్ కార్డు త్వరలో విడుదల - 6TV News : Telugu in News | Telugu News | Latest T...

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ మెయిన్ 2022 అడ్మిట్ కార్డు త్వరలో విడుదల

2022-06-02  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

jee-exam
 

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, జేఈఈ మెయిన్ 2022 అడ్మిట్ కార్డుల విడుదల 2022 జూన్ 20న ప్రారంభం కానుంది. అడ్మిట్ కార్డులను  jeemain.nta.nic.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆ రోజునుంచి అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్ సైటు లోనే ఎగ్జామ్ సెంటర్, ఎగ్జామ్ వేళలు వంటి వివరాలు పొందుపర్చారు.
పరీక్షలు పెట్టే నగరానికి సంబంధించిన సమాచారం జూన్ 7న లేదా జూన్ తొలివారం అందుబాటులో ఉంటుంది. జేఈఈ మెయిన్ 2022 అడ్మిట్ కార్డు ఆ తర్వాతే విడుదల అవుతుంది.  ఎగ్జామ్ సెంటర్ మరియు పరీక్షా సమయానికి సంబంధించిన సమాచారం కూడా ఈ వెబ్ సైట్‌లో చూడవచ్చు. తాత్కాలికంగా, అడ్మిట్ కార్డులు జూన్ 8 లేదా 10 తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి.

అడ్మిట్ కార్డుల పైని వివరాలు చాలా ముఖ్యం. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులపై ఉన్న వివరాలు సరైనవేనని నిర్ధారించుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలపాలి. అడ్మిట్ కార్డులను భవిష్యత్తు ప్రస్తావన కోసం ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి. ఎగ్జామ్ సిటీ లేదా ఎగ్జామ్ సెంటర్‌లో మార్పులకోసం అభ్యర్థించే ఆప్షన్ విద్యార్థులు పొందలేరని గుర్తుంచుకోవాలి. ఇలాంటి అభ్యర్థలను ఏజెన్సీ అనుమతించదు. జేఈఈ మెయిన్ పరీక్ష రాయడానికి తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్‌కి విద్యార్థులు వెళ్లవలసి ఉంటుంది.

అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడానికి తీసుకోవలసిన దశలు
స్టెప్ 1 జేఈఈ మెయిన్ 2022 అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ని సందర్శించాలి
స్టెప్ 2 'జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్టు' 2022 లింకు వద్దకు వెళ్లాలి.
స్టెప్ 3 సైన్ ఇన్ కోసం మీ అప్లికేషన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాలి
స్టెప్ 4 JEE Main 2022 అడ్మిట్ కార్డు మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

JEE Main 2022 పరీక్షలు రాయడం పూర్తయ్యాక ఫలితాలు 2022 ఆగస్టు 6న ప్రకటించబడతాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 రిజిస్ట్రేషన్ 2022 ఆగస్టు 7న ప్రారంభమవుతుంది. ఐఐటీ-జేఈఈ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షకు ఎగ్జామ్ తేదీ ఈ వెబ్ సైట్ లోనే 2022 ఆగస్టు 28న ప్రకటిస్తారు.
 



2022-06-02  Education Desk