collapse
...
Home / చదువు / 6 నుంచి టిఎస్‌టెట్ 2022 అడ్మిట్ కార్డు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

6 నుంచి టిఎస్‌టెట్ 2022 అడ్మిట్ కార్డు

2022-06-03  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

jee-exam
 

తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టిఎస్ టెట్ 2022) కి హాల్ టికెట్లను తెలంగాణ ప్రభుత్వ స్కూల్ విద్యా శాఖ జూన్ 6న విడుదల చేయనుంది. అధికారిక వెబ్ సైట్ tstet.cgg.gov.in. నుండి హాల్ టికెట్లను అభ్యర్థుుల డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

టిఎస్ టెట్ పరీక్ష తెలంగాణలోని 33 జిల్లాల్లో జూన్ 12న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రెండు భాగాలుగా నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటలకు పేపర్ 1, తర్వాత 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్-2 ని నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేయడానికి అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేయడానికి పాటించాల్సిన దశలు 

స్టెప్ 1 - కేండిడేట్స్ తప్పకుండా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధికారిక వెబ్ సైట్ tstet.cgg.gov.in.

స్టెప్ 2 - హోమ్ పేజీలో, అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3 - మీ అప్లికేషన్ నంబర్‌ని, డేటాఫ్ బర్త్‌ని, కోరిన ఇతర వివరాలను నింపండి

స్టెప్ 4 - మీ టిఎస్ టెట్ 2022 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది

స్టెప్ 5 - మీ అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకోండి, భవిష్యత్ సంప్రదింపులకోసం ప్రింట్ తీసుకోండి.

టిఎస్ టెట్ హాల్  టికెట్స్ 2022ని ఎగ్జామ్ హాల్‌కి తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుల తీసుకురాకుంటే అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు.

పరీక్ష మొత్తం వ్యవధి 2.5 గంటల సమయం ఉంటుంది. ఇది రెండు భాగాలు. రెండు పేపర్లలో 150 ప్రశ్నలుంటాయి.

ప్రతి కేటగిరీలోనూ పాస్ మార్కులు ఇలా ఉంటాయి

జనరల్ కేటగిరీకి 60 శాతం, మరియు పైనే ఉండాలి.

బ్యాక్‌వర్డ్ క్లాస్ విద్యార్థులకు 50 శాతం మరియు ఆ పైన మార్కులు ఉండాలి.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు (డిఫరెంట్లీ ఎబుల్డ్ -పిహెచ్) 40 శాతం మరియు ఆ పైన మార్కులు రావాలి

విజువల్లీ, ఆర్తోపెడికల్లీ డిసేబుల్డ్ పర్సన్‌లకు కనీసం 40 శాతం డిసెబిలిటీ ఉంటేనే గుర్తిస్తామని అదికారిక నోటీస్ పేర్కొంది. ఇక వినికిడి సమస్య ఉన్నవారికి కనీసం 75  శాతం డిసెబిలిటీ ఉంటేనే గుర్తిస్తారు.

అధికారిక నోటిఫికేషన్ ఇక్కడ చెక్ చేయండి 

https://tstet.cgg.gov.in/TSTETWEB2022/viewPDF?fileName=/Uploads/ORPSdocs/Documentscm/TSTET/25145_docs_TSTET2022/circulars/25145_2223_tstet2022_noti.pdf

 

మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 



2022-06-03  Education Desk