collapse
...
Home / బిజినెస్ / ఎనర్జీ / తెలంగాణలోనే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

తెలంగాణలోనే 24 గంటలూ నాణ్యమైన విద్యుత్

2021-12-19  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

TS GOVERNOR TAMIL SAI1
 

 

సోలార్ ఉత్పత్తి లో తెలంగాణ రాష్ట్రం ముందుందని రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు. హైటెక్స్ లో తెలంగాణ స్టేట్ రినవేబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరిగిన టీఎస్ఈసిఎ  2021 అవార్డులు ప్రదానో త్సవానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రీన్ ఎనర్జీ కోసం  ,విద్యుత్ పొదుపు కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.  ఇంట్లో పిల్లలకు కూడా విద్యుత్ ఆదా పై అవగాహన కల్పించాలన్నారు.  గ్రీన్ పవర్ కోసం సోలార్ పాలసీని ప్రభుత్వం రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్ఈడి బల్బులను అమరుస్తోందన్నారు. ప్రధాన మంత్రి కూడా ఎల్ఈడి బల్బ్ లపై అనేక సార్లు చెప్తు న్నారని గుర్తు చేశారు. విద్యుత్ ను ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ట్రాన్స్ కో  ,జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు , టీఎస్ రెడ్కో చైర్మన్  ,విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

వ్యవసాయ రంగానికి కూడా 24 గంటల విద్యుత్ 

ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ,  విద్యుత్ పొదుపు చేసి అవార్డ్ అందుకుంటున్న వారికి అభినందన లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే దేశంలో  24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నదని అన్నారు.  వ్యవ సాయ రంగానికి కూడా  24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. గత మార్చిలో  13680 మెగా వాట్స్ పిక్ డిమాండ్ ను అధిగమించగలిగామన్నారు.   పర్ క్యాపిటా వినియోగం లో నంబర్ వన్ గా రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉన్నదన్నారు.  విద్యుత్ ఆదా కోసం  400 పై భవనాలకు సౌర విద్యుత్ ఏర్పటు చేశామన్నారు.  ప్రభుత్వం కూడా విద్యుత్ ఆదా కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.  ఎలక్ట్రానిక్ పాలసీ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చిందని గుర్తు చేశారు. విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

 

ఎలక్ట్రానిక్ వాహనాల పై అవగాహన కార్యక్రమాలు 

స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ మాట్లాడుతూ,   విద్యుత్ శాఖను ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ముందు ఉండి నడిపిస్తున్నారని అన్నారు. సీఎండీ ప్రభాకర్ ప్రయత్నాల తోనే ఇవాళ విద్యుత్ నిరంతరం సరఫరా సాధ్యం అవుతోందన్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వాహనాలు పెరుగుతున్నాయన్నారు. రెడ్కో ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ వాహనాల పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.  సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం రెండో స్థానం లో ఉందన్నారు.  ఈ సంవత్సరం  700 ఎల క్ట్రానిక్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. డిమాండ్ ఉంటే మరిన్ని ఏర్పాటు కు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.  గ్రామాల్లో ఎల్ఇడి బల్బ్ లను ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపాలిటీలలో కూడా ఏ ర్పాటు చేస్తున్నామని, దీనితో విద్యుత్ ఆదా అవుతుందన్నారు.  ఎలక్ట్రానిక్ పాలసీ లో భాగంగా విద్యుత్ వాహనాల కు రూ. 35 కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు.

 

అవార్డు విజేతలు: 

ఎన్టీపీసీ 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (పరిశ్రమలు)

గోల్డ్ అవార్డ్ ఓరియంట్ సిమెంట్ (పరిశ్రమ)

 గోల్డ్ అవార్డ్ ఐటీసీ కాకతీయ హోటల్    (కమర్షియల్ బిల్డింగ్)

ప్రభుత్వ రంగ భవనాలు) 

సిల్వర్ అవార్డ్ డాక్ సదన్ పోస్టల్ డిపార్ట్ మెంట్

గోల్డ్ అవార్డ్ హైదరాబాద్ పోస్టల్ భవన్ జనరల్ పోస్టాఫీస్

ఎడ్యుకేషన్ బిల్డింగ్   అవార్డ్  

రత్నపురి ఎడ్యుకేషన్ 

ఓబుల్ రెడ్డి స్కూల్ 

రైల్వే స్టేషన్ కేటగిరి 

కాచిగూడ రైల్వే స్టేషన్

హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి)

మంచిర్యాల రైల్వే స్టేషన్ (గోల్డ్ అవార్డ్)

అర్బన్ లోకల్ బాడీ సెక్టర్ 

హైదరాబాద్ మున్సిపాలిటీ

రామగుండం మున్సిపాలిటీ కార్పొరేషన్

ట్రాన్స్ పోర్ట్ 

గోదావరి ఖని బస్ డిపో 

సత్తుపల్లి డిపో (గోల్డ్)

ఎక్సలెన్స్ 

జీఎంఆర్ (ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్)



2021-12-19  Business Desk