ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. అందునా వైద్య సాంకేతిక రంగంలోనూ రోజు రోజుకీ వస్తున్న విప్లవాత్మక మార్పులు.. మానవాళిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయనటంలో సందేహంలేదు. ఇప్పటికే శరీరం లోపల వచ్చే సమస్యలను ఇట్టే కనిపెట్టే పరికరాలు తయారవుతున్నాయి. అంతే కాదు మనిషికి బాహ్యంగా వచ్చే సమస్యలు తీర్చేందుకు కూడా అనేక వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నదికూడా వాస్తవం. తాజాగా మానవ అవయవాలను కూడా సృష్టించగలిగే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుండటం కూడా హర్షించదగ్గ పరిణామమే. ఇది కూడా విజయవంతమై మానవాళి మనుగడలో సరికొత్త దిశను చూపిస్తుందనటంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ క్రమంలో ఇప్పటికే మానవ కణాలతో 3డి బయో అవయవాలను సృష్టించారు వైద్యనిపుణులు. ఇందుకు సంబంధించిన వివరాలలోకి వెళితే..
మెక్సికోకు చెందిన అలెక్సా అనే ఓ మహిళ పుట్టనప్పటి నుంచే మైక్రోటియా అనే సమస్య తో బాధ పడుతోంది.మైక్రోటియా అనేది పుట్టకతోనే వచ్చే వ్యాధి. దీనివల్ల శరీరంలోని కొన్ని అవయవాలు సహజ రూపంలో ఏర్పడవు. ఈ కారణంగా ఆమె చెవికు పూర్తిగా ఎదగలేదు. పూర్తిగా మూసుకుపోయి ఉండేది. చిన్నప్పటి నుంచి ఆ చెవిని చూసి ఆమె తో చదువుకునే తోటి పిల్లలు ఎగతాళి చేసేవారు, ఆమెను ఆట పట్టించేవారు. ఆమె తల్లిదండ్రులు ఈ సమస్యపై చాలా మంది వైద్య నిపుణులను సంప్రదించినా, ఎవ్వరూ ఎం చేయలేక పోయారు. ఇక తను జీవితాంతం ఎగతాళికి గురవ్వుతూ, బతకాల్సిందేనని నిర్ణయానికి వచ్చేసి, నిత్యం మనోవేదనకు గురవుతుండేది.
అయితే టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలోని మైక్రోటియా-కంజెనిటల్ ఇయర్ డిఫార్మిటీ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఆర్టురో బోనిల్లా ఆమె సమస్యకు పరిష్కారం చూపగలిగాడు క్వీన్స్‌లోని రీజెనరేటివ్ మెడిసిన్ కంపెనీ తో .గలిపి ప్రయోగం చేసారు. అలెక్సా శరీరంనుంచి స్వంత కణాలను ఉపయోగించి 3-డి బయోప్రింటింగ్ ద్వారా థెరప్యూటిక్స్ చెవిని తయారు చేసింది. విజయవంతమైన ఈ వైద్య ప్రయోగం తో మార్పిడి చేసిన కొత్త చెవి మృదులాస్థి కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం ద్వారా సహజమైన చెవి రూపాన్నిసంతరించుకుంది. . ఇది ఆమె శరీరంలోకి పూర్తిగా ఇమిడిపోయింది. కాలక్రమేనా అది చర్మంతో కలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
అలెక్సా ఎడమ చెవికి సరిపోయేలా కుడి చెవి రూపొందడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది చూసేందుకు అచ్చం సహజమైన చెవిలాగానే ఉండటం గమనార్హం. దాన్ని తాకినప్పుడు అచ్చం నిజమైన చర్మాన్ని తాకినట్లే ఉందని ఆ యువతి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ఈ చెవి మార్పిడి చికిత్స విజయవంతమైన నేపథ్యంలో డాక్టర్ ఆర్టురో బోనిల్లా మీడియాలో మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలా అంగ వైకల్యంతో పుట్టే చిన్నారుల సమస్యలకు ఇట్టే పరిష్కరించడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ విధానంలో రోగి మృదులాస్థి కణాలను ఉపయోగించి చెవిని పునర్నిర్మించామని తెలిపారు. ముక్కు, వెన్నెముక సమస్యలను కూడా ఈ ప్రక్రియతో పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. ప్రతిదీ అనుకున్నట్లుగా జరిగితే, మార్పిడి చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పారు.
ఈ ప్రయోగం విజయవంతంకావటాన్ని కణజాల ఇంజనీరింగ్ రంగంలో అద్భుతమైన పురోగతి అని ఫ్లూయిడ్ఫార్మ్ను అధినేత ఆడమ్ ఫీన్బెర్గ్ చెప్పారు.
కాగా ఈ చెవి ప్రయోగం ఊహించని ఆరోగ్య సమస్యలను తెచ్చే అవకాశం ఉందని మరి కొందరు ఆందోళన వ్యక్తం చేయటంపై రీజెనరేటివ్ మెడిసిన్ కంపెనీ తన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంతకుముందు, కంపెనీలు ప్లాస్టిక్ , తేలికపాటి లోహాలతో తయారు చేసిన కృత్రిమ అవయవాలను రూపొందించడానికి 3-D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించాయి. కానీ తాము ఇదే సాంకేతికతతో తయారు చేసిన కొత్త చెవి కోసం రోగి స్వంత కణజాలం నుండి సేకరించిన కణాలతొ అది ఉద్భవించిన విషయం గుర్తించాలని దానిని శరీరం తిరస్కరించే అవకాశం లేదని కంపెనీ అధికారులు స్పష్టం చేశారు, ఈ ట్రయల్ డిజైన్‌ను ఫెడరల్ రెగ్యులేటర్లు సమీక్షించారని, అధ్యయనం పూర్తయిన తర్వాత డేటాను మెడికల్ జర్నల్‌లో ప్రచురించనున్నట్లు కంపెనీ పేర్కొంది.