ప్రముఖ దేశీయ కంపెనీ ఉబాన్ ప్రతిసారీ ఏదోక కొత్తదనాన్ని మార్కెట్లోకి పరిచయం చేస్తుంటుంది. ఇంతకు ముందు సోలార్ శక్తితో స్పీకర్...పవర్ బ్యాంక్ తో డైరీని ప్రదర్శించి...వినియోగదారులను ఆశ్చర్యపరించింది ఈ కంపెనీ. తాజాగా ఇప్పుడు కంపెనీ టచ్ కంట్రోల్ తో UBON CL-110పేరుతో వైర్ లెస్ నెక్ బ్యాండ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. బహుశా భారత మార్కెట్లో టచ్ కంట్రోల్స్ తో వచ్చిన ఇనీషియేటివ్ నెక్ బ్యాండ్ ఇదే కావడం గమనార్హం.
UBON CL-110 బ్యాటరీ దాదాపు 30 గంటలపాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుందన్న విషయాన్ని క్లెయిమ్ చేయబడింది. అంతేకాకుండా కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.2ని కూడా ఇది అందిస్తుంది. దీని పరిధి దాదాపు 10 మీటర్లు ఉంటుంది. అంతేకాదు UBON CL-110కి సంబంధించి మీరు బయటి నుండి ఎలాంటి అదనపు శబ్దాన్ని పొందరని క్లెయిమ్ చేయబడింది. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది.
కాగా UBON CL-110 టైప్-C ఛార్జింగ్‌తో 200mAh రీఛార్జిబుల్ బ్యాటరీతో ఈ నెక్ బ్యాండ్ వస్తుంది. Ubon UBON CL-110 నుండి ఈ నెక్‌బ్యాండ్ చాలా షైన్ గా ఉండటంతోపాటు ఇంకా తేలికగా కూడా ఉంటుంది. దీనికి మాగ్నెటిక్ ఇయర్ బడ్స్ తోపాటు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతే కాకుండా, దీని టచ్ కంట్రోల్ ఫీచర్లు నెక్ బ్యాండ్ ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తాయి. నెక్‌బ్యాండ్ CL-110 బ్లాక్, సిల్వర్ రంగులలో లభిస్తుంది. దీనిని రూ. 3,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.