collapse
...
Home / అంతర్జాతీయం / ఇరాక్‌లో 3,400 ఏళ్ల నగరం..ఇంత‌కీ ఎలా బైట ప‌డింది? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | New...

ఇరాక్‌లో 3,400 ఏళ్ల నగరం..ఇంత‌కీ ఎలా బైట ప‌డింది?

2022-06-03  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

iraq
 

ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతంలోని కెమునే దగ్గర  3,400 సంవత్సరాల పురాతన నగరం బైట ప‌డింది.  ఇరాక్‌లో ఏర్ప‌డిన విపరీతమైన కరువు కారణంగా నీటి మట్టాలు  పూర్తిగా పడిపోతున్న నేప‌ధ్యంలో  టైగ్రిస్ నది ప‌రివాహ‌కంలో ఉన్న‌ మోసుల్ రిజర్వాయర్   శిధిలాలు క‌ట్ట‌డాల‌ను పోలి ఉన్నాయి.రంగంలోకి దిగిన  పురావస్తు శాస్త్రవేత్తల అధ్యయనం లో  మ‌హాన‌గ‌రం దాదాపు 3400 సంవత్సరాల పురాతనమైన‌దిగా  గుర్తించారు.

కాంస్య యుగం నిర్మాణశైలితో 
1500 నుండి 1350 బిసి వ‌ర‌కు  ఇండో-ఇరానియన్లో ఉన్న‌ ఉన్న‌ మితానీ సామ్రాజ్య కాలం కు సంబంధించిన‌దిగా అంతర్జాతీయ పరిశోధకుల బృందం చెపుతోంది. ఈ మేర‌కు ప‌రిశోధ‌న‌ల‌లో పాలు పంచుకున్న యూనివర్శిటీ ఆఫ్ ట్యూబింగెన్ శాస్త్ర‌వేత్త‌లు  విడుదల చేసిన  ప్రకటన ప్రకారం,  ఉత్తర మెసొపొటేమియా రాజ‌ధానిగా  మితని సామ్రాజ్యం  విస్త‌రించి ఉన్న‌ట్టు తేల్చి చెప్పారు. ఇక్క‌డ బైట ప‌డిన భ‌వ‌నాల‌లో రాజభవనంతో పాటు అనేక పెద్ద భవనాల‌తో  కూడిన విసాల‌మైన ఓ మ‌హాన‌గ‌ర‌మే ఉంద‌ని, ఇది మితని సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన కేంద్రంగా భాసిల్లి ఉంటుంద‌ని  చెపుతున్నారు.  

ఇంత‌కీ ఈ న‌గ‌రం ఎలా బైట ప‌డింది ?
వాస్త‌వానికి ప్రపంచంలోని దేశాలలో ఇరాక్ కూడా వాతావరణ మార్పుల కార‌ణంగా తీవ్ర  ప్రభావానికి లోన‌వుతుంది. ఈ దేశంలోని దక్షిణ ప్రాంతంలో కొన్ని నెలల తరబడి వ‌ర్షాభావ ప‌రిస్థితి కార‌ణంగా తీవ్ర కరువు విల‌య తాండ‌వం చేస్తుంది. ఈ ద‌శ‌లో పంట‌ల‌ను కాపాడుకునేందుకు ఇరాక్ ప్ర‌భుత్వం గత ఏడాది డిసెంబర్  అతి ముఖ్యమైన రిజ‌ర్వాయ‌ర్ల నుంచి పంట‌ల‌కు నీళ్లు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలోనే   మోసుల్ రిజర్వాయర్ నుండి కూడా పెద్ద మొత్తంలో నీటిని పంప‌ట‌పొలాల‌కు పంపారు అధికారులు. అయితే త‌దుప‌రి వ‌ర్షాలు కుర‌వ‌క పోవ‌టం, రిజ‌ర్వాయ‌ర్‌లో ఉన్న నీటిని దిగువకు వ‌ద‌లాల్సి వ‌చ్చింది.   నీటి మట్టాలు వేగంగా పడిపోవడంతో ఈ సంవత్సరం ప్రారంభంలోనే  మోసుల్ రిజర్వాయర్ జలాల నుండి చూచాయిగా ఓ శిధిల‌ నగరం క‌నిపించింది. దీంతో పురావ‌స్తు శాఖ కు స‌మాచారం అందించారు. పురావస్తు శాస్త్రవేత్తలు  దుహోక్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ యాంటిక్విటీస్ అండ్ హెరిటేజ్ సహకారంతో కెమునే వద్ద రెస్క్యూ త్రవ్వకాలు జనవరి మరియు ఫిబ్రవరి 2002 మధ్య ఇక్క‌డ‌  వివిధ  ప్రాంతాల‌లో త్రవ్వకాలు జ‌రిపి, ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన రికార్డుల‌ను రూపొందించ‌డం ప్రారంభించారు. తాము న‌మోదు చేసిన నివేదిక‌ల‌ను నాటి చారిత్రిక విభాగాల‌తో ప‌రిశీలించి పోలిస్తే ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతంలోని కెమునే వద్ద ఉన్న కాంస్య యుగం నాటి నగరం గా స్ప‌ష్ట‌మైన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.  

ఏ త‌ర‌హా భవనాలు బయటపడ్డాయంటే..
ఈ ప్రాంతంలో జ‌రిగిన తవ్వ‌కాల‌లో ప్యాలెస్‌తో సహా అనేక పెద్ద భవనాలు బయటపడ్డాయని  కుర్దిష్ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ హసన్ అహ్మద్ ఖాసిమ్  తెలిపారు. ఇక్క‌డి త‌వ్వ‌కాల‌లో  కూడిన భారీ కోట, ఒక స్మారక చిహ్నం, బహుళ అంతస్తుల భవనం తో పాటు నాటి ప‌రిస్థితుల‌కు అనుగునంగా ఏర్పాటు చేసుకున్న  పారిశ్రామిక సముదాయం త‌దిత‌రాల‌ను గుర్తించామ‌ని తెలిపారు.  ఈ నిర్మాణాలలో చాలా వ‌ర‌కు ఉత్తర మెసొపొటేమియా- సిరియాల‌లో బైట‌ప‌డ్డ పురాత‌న భ‌వ‌నాల త‌ర‌హాలోనే ఉన్నాయ‌ని, విస్తృతమైన  భ‌వ‌నాల‌లోప‌లి భాగాల‌ను సైతం ప‌రిశీలిస్తే  మిటాని సామ్రాజ్యం కాలం నాటిదని స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ట్టు తెలిపారు.  

ఇంత భ‌ద్రంగా ఇన్నాళ్లు ఎలా?
క్రీ.పూ. 1350లో సంభవించిన భూకంపంలో ఈ నగరం నాశనమై ఉంటుందని చెప్పారు.  ఆ సమయంలో గోడల పైభాగాలు కూలిపోయి భవనాలను పూడ్చివేయడం జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంద‌న్నారు.  రిజ‌ర్వాయ‌ర్ అడుగున దాదాపు 40 సంవత్సరాలకు పైగా నీటిలో ఉన్నప్పటికీ, ఈ భ‌వ‌నాలన్నీ నిక్షేపంగా ఉన్నాయ‌ని, వీటి గోడలు కూడా చెక్కు చెద‌ర కుండా ఉండ‌టానికి ప్ర‌ధాన కార‌నం అప్ప‌టి నిర్మాణ దారులు గోడలు ఎండబెట్టిన మట్టి ఇటుకలను  తయారు చేయబడినప్పటికీ,   సంరక్షించబడ్డాయో న‌న్న‌ది  త‌మ‌ని ఆశ్చర్యప‌రిచే అంశ‌మ‌న్నారు. 
ప్రకటన ప్రకారం,

సిరామిక్ పాత్ర‌లూ ల‌భ్యం 
ఇక్క‌డ త‌వ్వ‌కాల‌లో ఐదు భారీ సిరామిక్ పాత్రలు  ల‌భించాయ‌ని, వీటిపై   పురాతన మధ్యప్రాచ్యంలో ఉపయోగించిన క్యూనిఫారమ్ వ్రాత విధానం లో లిపి ఉంద‌ని అన్నారు. వీటిని ఆసాంతం గ‌మ‌నిస్తే...  మిటానీ కాలపు నగరం ముగింపు ద‌శ‌తో పాటు  ఈ ప్రాంతంలో అప్పుడే విస్త‌రిస్తున్న అస్సిరియన్ పాలన ప్రారంభం గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుందని తాము భావిస్తున్న‌ట్టు పరిశోధకులు  చెపుతున్నారు.

ఈ పరిశోధనలో పాలు పంచుకున్న‌ ప్రొఫెసర్ పీటర్ ప్‌ఫ్ల్జ్‌నర్ మీడియాలో మాట్లాడుతూ, కాల్చని బంకమట్టితో తయారు చేసిన పాత్ర‌ల‌పై  క్యూనిఫాం వ్రాత విధానంలో నాటి చారిత్రిక వివ‌రాలు ఉన్నాయ‌ని, అయినా ఈ పాత్ర‌లు  దశాబ్దాల త‌ర‌బ‌డి  నీటి అడుగున   చెక్కు చెద‌ర‌కుండా ఉండ‌టం నిజంగా  ఒక అద్భుతం అని పేర్కొన్నారు.  అలాగే రిజ‌ర్వాయ‌ర్ నిర్మించిన‌ప్ప‌డు అడుగ భాగంలో వేసిన కంక‌ర కూడా ఈభ‌వ‌నాల‌మూల మూల‌ల్లో చేరి   పూర్తిగా బిగుతుగా ఉండే ప్లాస్టిక్ షీటింగ్ లా మారిపోవ‌టం కూడా ఇక్క‌డ‌  నీటి పెరుగుదల  ఎంత ఉన్నా వాటికి ఎలాంటి  నష్టం జరగకుండా నిరోధించాయ‌ని చెప్పారు. ఈ భ‌వ‌నాల‌పై నిశితంగా ప‌రిశోధ‌న‌లు చేస్తున్నామ‌ని మ‌రిన్ని వివ‌రాలు ప్ర‌పంచానికి వెల్ల‌డిస్తామ‌ని పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. 2022-06-03  News Desk