Courtesy: twitter/anisha xox
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 మేకర్స్ గ్రాండ్ ఫినాలేకి సిద్ధమవుతున్నారు. నిర్వాహకులు ఈ షోకు అత్యధిక టీఆర్పీ రేటింగ్లను పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా ఈవెంట్‌కు అతిథులను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గత సీజన్లో ప్రముఖ సినీనటీమణులు తమన్నా , మెహ్రీన్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రత్యేక అతిథులుగా షోలోకి ప్రవేశించారు. వీరు బిగ్‌బాస్ హౌస్ నుంచి చివరి ఇద్దరు ఫైనలిస్ట్‌లను ఎలిమినేట్ చేశారు.సీజన్ 5లో సిరి , మానస్ , సన్నీ , షణ్ణు , శ్రీరామ చంద్ర ఫైనల్లుగా నిలిచారు. సన్నీ లేదా షణ్ముఖ్ టైటిల్ విన్నర్ అవుతారని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ పోటీదారులను బాలీవుడ్ పవర్ కపుల్‌గా పేరొందిన దీపికా పడుకోన్ , రణ్వీర్సింగ్లను క లవనున్నట్లు సమాచారం.దీప్‌వీర్ తమ రాబోయే చిత్రం ‘83’ ప్రమోషన్లో భాగంగా బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలేకు వస్తారని అంటున్నారు. కపిల్ దేవ్ బయోపిక్ గా వస్తున్న 83 మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రణ్ వీర్ సింగ్ , దీపికా పడుకోన్ లు పాల్గొని ప్రేక్షకులను అలరించనున్నారు.నాలుగేళ్లుగా ప్రేమించుకున్న దీప్ వీర్ జంట కొంత కాలం డేటింగ్ చేసి వివాహం చేసుకున్నారు. కండోమ్ కు రణ్ వీర్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుండటంతో కండోమ్ గురించి వివరిస్తూ యాడ్ లో నటించారని సమాచారం.రణవీర్ సింగ్ - దీపికా పడుకోన్ జంట ముంబై నగరంలో ఒక బంగ్లాను 22 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబాయిలోని కోస్టల్ టౌన్ ఆలీబాగ్ ఏరియలో ఈ బంగ్లాని కొన్నట్లుగా తెలుస్తోంది.
గ్రాండ్ ఫినాలేకు ఆర్ఆర్ఆర్ ఆన్ స్క్రీన్ జోడి
బిగ్‌బాస్ తెలుగు 5 వ సీజన్ ఫైనల్స్‌లో బాలీవుడ్ దంపతులైన దీపికా పడుకోన్ , రణ్‌వీర్‌సింగ్‌లు పాల్గొని సంచలనం సృష్టిస్తారని సమాచారం. ఈ నిజమైన జోడి కాకుండా బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా ఆర్ఆర్ఆర్ నుంచి రీల్ జోడిని కూడా కలిసే అవకాశం ఉంది. అది ఎవరో అని ఆశ్చర్యపోతున్నారా ? అవును అది రామ్ చరణ్ , అలియా భట్ జంట. ఈ ఆన్-స్క్రీన్ , ఆఫ్-స్క్రీన్ జంటలు బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌కు ప్రత్యేక అతిథులుగా టీవీ ప్రేక్షకులను అలరించనున్నారు.బిగ్‌బాస్ షోలో దీపిక , రణ్వీర్ , అలియా , రామ్ చరణ్‌లను చూడటానికి టీవీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రాంచరణ్ ఎలాగు డిస్నీ హాట్‌స్టార్ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి చరణ్ , అలియా భట్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ ఫైనల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారట. టైటిల్ విన్నర్ ఎవరైనా అతిథుల లిస్టు మాత్రం టీవీ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తంమీద బాలీవుడ్ , టాలీవుడ్ తారల తళుకు జిలుగులు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు.