6tvnews

Header - Ramky
collapse
...
Home / వినోదం / తెలుగు / 50 దెయ్యాలతో డేగ‌ల బాబ్జీ

50 దెయ్యాలతో డేగ‌ల బాబ్జీ

2021-11-08  Entertainment Desk
venus

bandla ganesh1
 

ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'డేగల బాబ్జీ'. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చిత్రీకరణ మొత్తం  పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల చేయడానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్ర‌ ట్రైల‌ర్‌ను విడుదల చేశారు. 


మర్డర్ కేసులో అనుమానితుడిగా…. 

ట్రైలర్ చూస్తే... మర్డర్ కేసులో అనుమానితుడిగా బండ్ల గ‌ణేష్ క‌నిపిస్తాడు. సినిమాలో ఆయన పేరు డేగల బాబ్జీ. ట్రైలర్ మొత్తంలో బండ్ల గ‌ణేష్ పాత్ర మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఆయ‌న‌ ఒక్కరే ఉన్నారు. 'యాభై దెయ్యాలు సార్... అవి నన్ను బెదిరిస్తున్నాయి. భయపెడుతున్నాయి', 'కోపం... కోపం... భరించలేనంత కోపం', 'పుట్టగానే వాడు అసలు ఏడవలేదు. కానీ, వాడు పుట్టినప్పటన్నుంచి నేను ఏడుస్తున్నాను', 'పొట్టిగా ఉన్నా... మా అమ్మ అందంగా ఉంటుంది. అసలు మా అమ్మ అందంగా ఉండాలని రూల్ ఏమైనా ఉందా?'...  అంటూ బండ్ల గ‌ణేస్ డైలాగులు చెపుతాడు. డైలాగులు చెప్పేటప్పుడు నటుడిగా బండ్ల గణేష్  ఫేస్‌లో డిఫ‌రెంట్‌..డిఫ‌రెంట్ వేరియేష‌న్‌లు ట్రైల‌ర్‌లో చూపించారు. 


వాయిస్ వినిపిస్తుంది తప్ప … 

'డేగల బాబ్జీ' టైటిల్ పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్‌ డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కంటిపై కత్తిగాటుకు వేసిన కుట్లు, గాయం నుండి కారుతున్న రక్తపు బొట్టుతో గణేష్ గెటప్ ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.  ఈ సందర్భంగా దర్శక - నిర్మాతలు మాట్లాడుతూ "తెలుగు స్క్రీన్ మీద తొలిసారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా ఇది. సినిమాలో మిగతా క్యారెక్టర్లు ఉన్నాయి. అయితే, వాళ్ల వాయిస్ వినిపిస్తుంది తప్ప మనుషులు కనిపించరు. 


థ్రిల‌ర్.. హార‌ర్‌లా…..  

హీరోగా డేగల బాబ్జీ పాత్రలో బండ్ల గణేష్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. ఫస్ట్‌ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రైల‌ర్‌కూ మంచి స్పందన లభిస్తోంది. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని అన్నారు. ఇక ఈ చిత్ర ట్రైల‌ర్ కంప్లీట్ థ్రిల‌ర్.. హార‌ర్‌లా అనిపిస్తుంది. ట్రైల‌ర్ క‌ట్ చేయ‌డంలో చూసే ప్రేక్ష‌కుడికి ఒక స‌స్పెన్స్‌ ను క్రియేట్ చేశాడు ద‌ర్శ‌కుడు. బండ్ల గ‌ణేష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న కాంట్ర‌వ‌ర్సీల‌కి కేరాఫ్ అడ్ర‌స్ అని చెప్పొచ్చు. కొన్ని విష‌యాల్లో ఆయ‌న అంచ‌నాలు తారుమార‌య్యాయి. గ‌తంలో ఆయ‌న పొలిటిక‌ల్ విష‌యాల్లో ఇన్‌వాల్వ్ అయిన‌ప్పుడు.  


 


2021-11-08  Entertainment Desk

rajapush