collapse
...
Home / వినోదం / హిందీ / ఫిబ్రవరి 6న ఆలవైకుంఠపురములో... - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

ఫిబ్రవరి 6న ఆలవైకుంఠపురములో...

2022-01-22  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Allu arjun 
అల్లు అర్జున్ హిట్ మూవీ అలవైకుంఠపురము హిందీ వెర్షన్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న ధిన్‌చక్‌ మూవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు గోల్డ్ మైన్స్ సంస్థ ప్రయత్నం చేసింది. కానీ కరోనా వ్యాప్తి అధిమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని తేలిపోయింది. దీంతో ధిన్‌చక్‌ ఛానెల్‌తో సంప్రదింపులు జరిపి ఆ ఛానెల్‌ ద్వారా ప్రసారం చేసేందుకు నిర్ణయించారు. 

అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో 2020 సంక్రాంతికి విడుదలైన అలవైకుంఠపురములో సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. మలయాళంలో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. ఇప్పుడీ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులకు అందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల కొన్ని సంవత్సరాలుగా హిందీ ప్రేక్షకులకు అల్లు అర్జున్‌ దగ్గరయ్యారు. బన్నీ నటించిన పలు తెలుగు సినిమాలను హిందీలో డబ్‌ చేసి పలు హిందీ మూవీ ఛానెల్స్ లో ప్రసారం చేయడంతో అక్కడ క్రేజ్ బాగా పెరిగింది. పుష్ప సినిమాతో ఆ క్రేజ్‌ పీక్స్‌ కి చేరింది. ఫ్యాన్ ఫాలోయింగ్‌ విపరీతంగా పెరగడంతో దాన్ని క్యాష్ చేసుకునేందుకు హిందీ రంగంలోని కొందరు ప్రముఖులు అల్లు అరవింద్‌ను సంప్రదించి ఒప్పించారు. దీంతో అలవైకుంఠపురములో సినిమా ఫిబ్రవరి 6న హిందీ ప్రేక్షకులను అలరించనుంది. 

 



2022-01-22  Entertainment Desk