collapse
...
Home / వినోదం / ఓటిటి / 9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu New...

9 hours Web series review: ఒకేరోజు.. మూడు బ్యాంకుల్లో చోరీ

2022-06-03  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

9 hours Web Series
 

తెలుగులో మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు చాలా ఫేమస్. తెలుగు సాహిత్యం రచనలని అమితంగా ఇష్టపడే టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. మల్లాది నవల ఆధారంగా '9అవర్స్అనే వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాడు. మల్లాది వెంకట కృష్ణమూర్తి నవల స్పూర్తితో.. నందమూరి తారక రత్న లీడ్ రోల్ చేసిన   '9అవర్స్వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. మరి ఓటీటీ ఆడియన్స్ '9అవర్స్సిరీస్‌ని ఎలా రిసీవ్ చేసుకున్నారో చూద్దాం. 

కోఠి బ్యాంకులో సీన్ రివర్స   

'9అవర్స్ఒక బ్యాంకు రాబరీ చుట్టూ తిరిగే కథ. మనం ఇప్పటివరకు ఎన్నో బ్యాంకు రాబరీ చిత్రాలు చూసి ఉంటాం. అయితే ఒకేరోజుఒకేసారిఒకే టైంలో మూడు బ్యాంకుల్లో చోరీ జరగటం అనే కొత్త పాయింట్‌తో ఈ వెబ్ సిరీస్ తీశారు '9అవర్స్మేకర్స్. డెక్కన్ ఇంపీరియల్ బ్యాంక్‌కు చెందిన మూసారాంబాగ్సైదాబాద్కోఠి బ్రాంచిలలో ఒకేసారి దొంగతనం జరుగుతుంది. మూసారాంబాగ్, సైదాబాద్ బ్యాంకు నుండి ఈజీగా దొంగలు డబ్బులు తీసుకొని పారిపోగా.. కోఠి బ్యాంకులో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఈ బ్రాంచిలో దొంగతనం జరుగుతుండగానే.. పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అఫ్జల్ గంజ్ సీఐ ప్రతాప్ వెంటనే సంఘటన స్థలానికి వచ్చేస్తాడు. ఈ వార్త తెలిసిన హైదరాబాద్ హెరాల్డ్ పత్రికకు చెందిన జర్నలిస్ట్ చిత్రలేఖ కూడా సంఘటన స్థలానికి చేరుకుంటుంది. చిత్రలేఖ పాత్రని హీరోయిన్ మధు షాలిని చేయగా.. సీఐ ప్రతాప్ గా హీరో తారకరత్న నటించాడు. వీరిద్దరూ వెబ్ సిరీస్ లో భార్య భర్తలు కూడా. అయితే ఈ మూడు దొంగతనాలని జైలర్ విశ్వనాథ్ ( సీనియర్ నటుడు వినోద్ కుమార్ ) ప్లాన్ చేశాడని.. అతనికి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ (అజయ్) సహకరించాడని విచారణలో తేలుతుంది. అయితే ఒక జైలర్ ఎందుకు బ్యాంకు రాబరీలను ప్లాన్ చేశాడు.. జైలర్‌కి ఖైదీ ఎందుకు సహకరించాడు.. హీరో తారకరత్నకు కోఠి బ్యాంకు రాబరీ లీక్ ఎవరు ఎందుకు ఇచ్చారు.. ఇంతకి జైలర్ విశ్వనాథ్ ఎందుకిలా చేశాడు అన్నదే    '9అవర్స్అసలు కథ. 

9 hours trailer-1
 

ప్రతి ఎపిసోడ్ లోను ట్విస్టులు    

మూడు బ్యాంకులని మూడు ముఠాలు దొంగతనం చేయటం అనే కొత్త పాయింట్ ఆడియన్స్ ని ఆసక్తికి గురిచేస్తుంది. 1985లో జరిగిన కథగా.. కాస్ట్యూమ్స్లొకేషన్స్ అన్నింటిని పర్ఫెక్ట్ గా చూపెట్టారు. '9అవర్స్'... ఒక్క రోజులో.. తొమ్మిది గంటల్లో జరిగే కథ. ఒక్కో గంటలో ఏం జరిగిందనేది ఒక్కో ఎపిసోడ్‌గా తీశారు. అయితే ఎపిసోడ్ నిడివి మాత్రం 25నిమిషాలు   ఉంటుంది. ఈ 25 నిమిషాల్లోనే బ్యాంకు రాబరీతో పాటు దొంగల కుటుంబాలుబ్యాంకు ఉద్యోగుల బ్యాక్ గ్రౌండ్ ని చూపెడతారు. ఒంటరి మహిళ (భర్త మరణించిన తర్వాత) కామాంధుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందిగుర్రపు జూదానికి బానిసైన వ్యక్తి పరిస్థితి ఏంటివేశ్య జీవితం ఎలా ఉంటుందిఒకరికి వేశ్య మనసు ఇస్తే ఎంత దూరం వెళుతుందివంటి అంశాలనూ క్రిష్ జాగర్లమూడి తనదైన స్టైల్ లో చెప్పాడు. ఫైనల్ గా    '9అవర్స్డీసెంట్ వెబ్ సిరీస్. ప్రతి ఎపిసోడ్‌లో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఈ వెబ్ సిరీస్ లో థ్రిల్స్ లేకపోవడంనెమ్మదిగా సాగడం మైనస్ పాయింట్స్. అయితే ఎలాంటి అశ్లీలత లేకుండా '9అవర్స్'ను తీయటంతో కుటుంబ సమేతంగా ఈ వెబ్ సిరీస్‌ని తిలకించొచ్చు.2022-06-03  Entertainment Desk