collapse
...
Home / జాతీయం / Ambur biriyani fest: ఆ బిర్యానీ ఫెస్టివల్ రద్దు...ఎందుకంటే... - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu...

Ambur biriyani fest: ఆ బిర్యానీ ఫెస్టివల్ రద్దు...ఎందుకంటే...

2022-05-13  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Ambur biriyani fest

తమిళనాట ఇరువర్గాల లొల్లి దెబ్బకు.. తిరుపత్తూరులో నిర్వహించాలనుకున్న  అంబూర్ బిర్యానీ ఫెస్టివల్ ను రద్దు అయ్యింది.  13, 14వ తేదీల్లో భారీ వర్ష సూచన ఉన్నందున ఈ కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాలను అధికారులు సాకుగా చెప్తున్నా.. అసలు కారణం వేరే ఉందంటున్నారు జనాలు. ఈ బిర్యానీ ఫెస్టివల్ లో ఓ వర్గం వారు బీఫ్ ఉండాలని పట్టు పడుతుంటే.. వారికి వ్యతిరేకంగా మరో వర్గం వారు పంది మాంసం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరు వర్గాల లొల్లి ఎటు దారితీస్తుందోననే భయంతో అసలు బిర్యానీ ఫెస్టివల్ నే రద్దు చేశారు అధికారులు.  

బిర్యానీ ఫెస్టివల్ ఎందుకంటే?   
కరోనా మహమ్మారి దెబ్బకు తిరుపత్తూరు జిల్లా చాలా ఇబ్బందులు పడింది.  జనాలతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రం దెబ్బ తిన్నది. ఈ నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు మళ్లీ జవ సత్వాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ అమర్ కుష్వాహా అంబూర్ బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలో బీఫ్ ఉండదని నిర్వాహకులు వెల్లడించారు. ఈ నిర్ణయంపై కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఫెస్టివల్ జరిగే ప్రాంతానికి  వెలుపల ఉచితంగా గొడ్డు మాంసం బిర్యానీ పంపిణీ చేయాలని నిర్ణయించాయి. ఈ ఫెస్టివల్ లో బీఫ్ ను తొలగించడాన్ని ఎస్సీలు, ఎస్టీలు, ముస్లీం వర్గాలు తప్పు బట్టాయి. తిరుపత్తూరు కలెక్టర్ నిర్ణయం పట్ల రాష్ట్ర SC / ST కమిషన్ నోటీసు జారీ చేసింది. బీఫ్ ను మినహాయించడాన్ని వివక్షగా ఎందుకు పరిగణించకూడదో వివరణ కోరుతూ నోటీసులు అందించింది.

*ఇరువర్గాల ఆందోళనతో రద్దు   
బీఫ్ తొలగింపుపై పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కొన్ని ముస్లిం పార్టీలు బీఫ్‌ను చేర్చాలని డిమాండ్ చేశాయి. అటు కొన్ని హిందూ సంఘాలు ముస్లీం పార్టీలకు వ్యతిరేంగా ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలోనే బిర్యానీ ఫెస్టివల్ రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మే 13, 14 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసినందున.. అంబూర్ ట్రేడ్ సెంటర్, ఇండోర్ ఆడిటోరియంలో జరగాల్సిన ఫెస్టివల్‌ను తాత్కాలికంగా క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు.

వాస్తవానికి ఈ ఫెస్టివల్ సజావుగా జరిగేందుకే బీఫ్ ను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కానీ కొందరు కావాలనే బీఫ్ కోసం డిమాండ్ చేస్తే.. మరికొందరు పంది మాంసం కావాలని నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో  అంబూర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని   హిందూ మున్నాని ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని బీఫ్, పంది మాంసాన్ని నివారించాలి కోరారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల నుంచి పరస్పర వ్యతిరేక డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో బీఫ్, పంది మాంసం బిర్యానీలను రద్దు చేసినట్లు కలెక్టర్ అమర్ కుష్వాహా తెలిపారు.  

*కలెక్టర్‌కు నోటీసులు     
బిర్యానీ ఫెస్టివల్ నుంచి  బీఫ్ ను మినహాయించడాన్ని ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలపై వివక్షకు సంబంధించిన అంశంగా ఎందుకు పరిగణించ కూడదో వివరణ కోరుతూ తిరుపత్తూరు కలెక్టర్‌కు రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ నోటీసు అందజేసింది.  ఈ నోటిసులకు కలెక్టర్ అమర్ జవాబు ఇచ్చారు. మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని బీఫ్, పంది మాంసాన్ని  తొలగించినట్లు తెలిపారు.



2022-05-13  News Desk