collapse
...
Home / జాతీయం / Amit Shah: తెలంగాణ ఎప్పుడూ ప్రధాని మోడీ గుండెల్లో ఉంటుంది - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News...

Amit Shah: తెలంగాణ ఎప్పుడూ ప్రధాని మోడీ గుండెల్లో ఉంటుంది

2022-06-03  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

AMITH SHAH
నరేంద్ర మోడీ సర్కారు దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేలా చూస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఏ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమను చూపించడంలేదన్నారు. తెలంగాణ ఏర్పాటుకు పూర్తి మద్దతు ఇచ్చిన బీజేపీ.. అభివృద్ధికి కూడా అంతే సపోర్టు చేస్తుందన్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో షా పాల్గొని ప్రసంగించారు.

*అధికారికంగా విమోచన దినోత్సవం 
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే..  హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేసినందుకు గుర్తుగా సెప్టెంబర్ 17న విమోచన దినం నిర్వహిస్తామని అమిత్ షా వెల్లడించారు.  సర్దార్ పటేల్‌ లేకుంటే భారతదేశ మ్యాప్‌ ఇలాగే ఉండేది కాదన్నారు. నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గౌడ్, కుమురం భీం వంటి తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను ఆయన ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాటంలో స్వామి రామానంద తీర్థతో పాటు మాజీ ప్రధాని నరసింహారావు  పాత్రలను కూడా ఆయన ప్రశంసించారు. ఇప్పటికీ తెలంగాణ హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం  చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పాలన మారబోతుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కచ్చితంగా  విమోచన దినాన్ని జరుపుతుందని వెల్లడించారు.  

*తెలంగాణకు  రూ. 2.52 లక్షల కోట్లు ఇచ్చాం..
తెలంగాణపై ప్రభుత్వంపై కేంద్రం వివక్ష చూపుతోందని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని షా మండిపడ్డారు. అదంతా కేవలం ప్రచారం మాత్రమేనని వెల్లడించారు. మోడీ సర్కారు ఏ రాష్ట్రం పట్ల సవితితల్లి ప్రేమను చూపించడం లేదన్నారు.  తెలంగాణ ఎల్లప్పుడూ ప్రధాని మోడీ హృదయంలో ఉంటుందన్నారు.  కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రం నుంచి తమకు మద్దతు పెద్దగా లభించడం లేదన్నారు.  2014-15 నుంచి 2021-22 వరకు రూ.2.52 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖర్చు చేశారని వెల్లడించారు. పథకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ సంఖ్య రూ.3.50 లక్షల కోట్లుగా ఉండేదని షా తెలిపారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులను జాబితా రెడీ చేయాలంటే చాలా సమయం పడుతుందన్నారు.  

*సీఎం కేసీఆర్ నిజం మాట్లాడ్డం నేర్చుకోవాలి.. 
ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై ఏళ్ల తరబడి పోరాటం జరిగిందని అమిత్ షా అభిప్రయాపడ్డారు. 1,200 మందికి పైగా యువకులు తమ జీవితాలను త్యాగం చేశారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎప్పుడూ మద్దతిచ్చిందన్నారు. 2004లో కాంగ్రఎస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు వాగ్దానం చేసినప్పటికీ 2014 వరకు ఆ డిమాండ్‌ నెరవేరలేదన్నారు.  మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మధ్యప్రదేశ్ నుంచి  చత్తీస్‌గఢ్, బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్‌ను  ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ రాష్ట్రాల ఏర్పాటులో ఎక్కడా గొడవలు లేదన్నారు. కానీ తెలంగాణలో చాలా వివాదాలు చెలరేగాయన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలా విభజన చేసిందన్నారు.  అయితే తెలంగాణ అభివృద్ధి ద్వారా భారతదేశం అభివృద్ధి చెందుతుందనే సూత్రాన్ని పుణికిపుచ్చుకుని గొప్ప తెలంగాణను సృష్టించేందుకు కలిసి పనిచేయాలన్నారు.  ఈ సందర్భంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుపై అమిత్ షా సీరియస్ కామెంట్స్ చేశారు.  ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిజాలు మాట్లాడ్డం నేర్చుకోవాలన్నారు.  2022-06-03  News Desk