collapse
...
ఆంధ్రప్రదేశ్
  YSRCP: వల్లభనేని వర్సెస్ దుట్టా.. ఆమంచి వర్సెస్ బాలినేని.. అధికార వైసీపీలో తొల్లి

  YSRCP: వల్లభనేని వర్సెస్ దుట్టా.. ఆమంచి వర్సెస్ బాలినేని.. అధికార వైసీపీలో తొల్లి

  2022-05-20  News Desk
  ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ నేతల మధ్య పొసగడం లేదు. పలు జిల్లాల్లో ఒకే పార్టీకి చెందిన పలువురు నాయకుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆయా నేతల మధ్య పంచాయితీ ఏకంగా ముఖ్యమంత్రి జగన్ వరకు చేరింది. వారి మధ్య రాజీ కుదిర్చేప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు.
  దావోస్ కు ఏపీ సీఎం జ‌గ‌న్.. పెట్టుబ‌డులే ల‌క్ష్యం

  దావోస్ కు ఏపీ సీఎం జ‌గ‌న్.. పెట్టుబ‌డులే ల‌క్ష్యం

  2022-05-20  News Desk
  దావోస్ లో జ‌రిగే స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఆయ‌న బ‌య‌లు దేరారు. దాదాపు ప‌ది రోజుల పాటు ఈ ప‌ర్య‌ట‌న సాగ‌నుంది. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ నిమిత్తం ఆయ‌న ఆ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లు దేరారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ నగరంలో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు కు హాజరుకానున్నారు.
  వైసీపీ ఎమ్మెల్సీ కారులో శవం.. అసలేం జరిగిందంటే..

  వైసీపీ ఎమ్మెల్సీ కారులో శవం.. అసలేం జరిగిందంటే..

  2022-05-20  News Desk
  వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ బాబు కారులో అనుమానాస్పదంగా ఓ మృతదేహం లభించింది. తీరా చూస్తే ఆ యువకుడు అనంతబాబు వద్ద డ్రైవర్‌గా పని చేసిన సుబ్రహ్మణ్యం కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు.
  నేను ఐఏఎస్ అయ్యేవరకూ సీఎంగా ఉంటానని మాటివ్వండి: జగన్‌తో 7వ తరగతి విద్యార్థి

  నేను ఐఏఎస్ అయ్యేవరకూ సీఎంగా ఉంటానని మాటివ్వండి: జగన్‌తో 7వ తరగతి విద్యార్థి

  2022-05-19  News Desk
  ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇటీవలి కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినప్పుడు ఎన్ని విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వ్యవహారం కోర్టు మెట్ల వరకూ వెళ్లింది. ఈ విషయాలన్నీ పక్కనబెడితే ఇటీవలి కాలంలో ఓ ప్రభుత్వ పాఠశాల హాట్ టాపిక్‌గా మారింది. దీనికి కారణం ఆ పాఠశాల విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటమే.
  సీమలో పొలిటికల్ పటాసులు పేలుతున్నాయ్..

  సీమలో పొలిటికల్ పటాసులు పేలుతున్నాయ్..

  2022-05-19  News Desk
  ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల‌తో చంద్ర‌బాబు చెల‌రేగుతుండ‌గా.. వాటికి ప్ర‌తి విమ‌ర్శ‌లు చేస్తూ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కాక రేపుతున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత గడ్డ అయిన వైఎస్సార్ జిల్లాలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ప్ర‌భుత్వ వ్యతిరేక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టారు.
  ఫ‌లించిన పోరాటం : కోన‌సీమ ఇక‌పై అంబేడ్క‌ర్ జిల్లా

  ఫ‌లించిన పోరాటం : కోన‌సీమ ఇక‌పై అంబేడ్క‌ర్ జిల్లా

  2022-05-19  News Desk
  కోన‌సీమ‌కు అంబేడ్క‌ర్ పేరు పెట్టాలంటూ డిమాండ్లు ఎక్కువగా రావడంతో కోనసీమకు ముందు డా.బీఆర్.అంబేద్కర్ పేరును చేర్చాలని నిర్ణయించింది. ఈ మేర‌కు కోనసీమ జిల్లా పేరు మార్చుతూ ప్రభుత్వం ప్రాధమిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కోనసీమ జిల్లా ఇక డా.బీఆర్.అంబేద్కర్ జిల్లాగా మారనుంది.
  Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఏపీలో పిడుగుపడి ఇద్దరు మృతి

  Rain alert: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఏపీలో పిడుగుపడి ఇద్దరు మృతి

  2022-05-18  News Desk
  ఎండలతో ఉడికిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూల్ న్యూస్ అందించింది. ఈ రోజు నుంచి 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురుస్తాయని వెల్లడించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో ఎండలు మండుతుండగా.. కొన్ని జిల్లాల్లోవాతావరణం పూర్తిగా మారిపోయింది.
  కుక్క పెట్టిన పంచాయితీ.. కారంపొడి చల్లుకుని కత్తులతో పొడుచుకున్నారు!

  కుక్క పెట్టిన పంచాయితీ.. కారంపొడి చల్లుకుని కత్తులతో పొడుచుకున్నారు!

  2022-05-18  News Desk
  పగ వాళ్లు ఎలా ఉంటారు? సందు దొరికితే ఎదుటి వారిపై కారాలు, మిర్యాలు నూరుతారు. అదే ఎదుటి వాడు తప్పు చేస్తే.. ఇవతలి వాడు రెచ్చిపోతాడు. ఒంటి కాలు మీద కస్సున లేస్తాడు. తాజాగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఇలాంటి గొడవే జరిగింది. పగోళ్ల మధ్య పంచాయితీకి ఓ కుక్క కారణం అయ్యింది. కుక్కను కొట్టబోయి ప్రత్యర్థికి రాయి తగలడంతో పాత కక్షలు పడగవిప్పాయి.
  తిరుమల వెంకన్నా.. నీ ఆస్తులకు రక్షణ ఏదన్నా..

  తిరుమల వెంకన్నా.. నీ ఆస్తులకు రక్షణ ఏదన్నా..

  2022-05-18  News Desk
  తిరుమల వెంకటేశ్వర స్వామి.. ఈయన గురించి తెలియని భక్తులు ఉండరు.. ఈ స్వామిని దర్శించి తరించాలి అనుకునేవారు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు.. అందుకే ఆయన ఆస్తులు అసంఖ్యాకం.. దైవాల లో ఆయనకున్న ఆదరణ అనిర్వచనీయం.. కానీ ప్రస్తుత తరుణంలో వెంకన్న ఆస్తులకు రక్షణ కరువవుతోందా.. ఆయన ఆస్తుల పరిరక్షణ ఈ విషయంలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటుంది..
  రెండేళ్లు చాలు.. ఇక చేర్చుకుంటే మేలు: సుప్రీం

  రెండేళ్లు చాలు.. ఇక చేర్చుకుంటే మేలు: సుప్రీం

  2022-05-18  News Desk
  ఒక ఐపీఎస్ అధికారిపై రెండేళ్లకు మించి సస్పెన్షన్ విధించడం సరికాదు.. ఆయనను విధుల్లోకి తీసుకోండి.. అంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ సీనియర్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. అతడిని సర్వీసులోకి తిరిగి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది .
  చివ‌రి ప‌రీక్ష రాసి ఇంటికి వెళ‌దామనుకున్నాడు.. అంతలోనే..

  చివ‌రి ప‌రీక్ష రాసి ఇంటికి వెళ‌దామనుకున్నాడు.. అంతలోనే..

  2022-05-18  News Desk
  ఉద‌యం అస్వ‌స్థ‌త‌గా ఉన్నా కూడా చివ‌రి పరీక్ష‌ను పూర్తి చేయాల‌ని భావించాడు. మందులు వేసుకుని, ప‌రీక్ష కేంద్రానికి వెళ్లి, మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గురై ప‌రీక్షా హాలులోనే విగ‌త జీవుడ‌య్యాడు. ఈ హృద‌య విదార‌క‌ర‌మైన సంఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
  నెల్లూరులో బంగారం, కడపలో వజ్రాల తవ్వకం ప్రారంభమైతే.. ఏపీ దశ తిరిగినట్టే..

  నెల్లూరులో బంగారం, కడపలో వజ్రాల తవ్వకం ప్రారంభమైతే.. ఏపీ దశ తిరిగినట్టే..

  2022-05-18  News Desk
  నెల్లూరు జిల్లాలో బంగారం, రాగి, వైట్‌క్వార్ట్జ్ (తెల్లరాయి) నిక్షేపాలున్నట్టు కేంద్రం గుర్తించింది. ఉదయగిరి మండలంలోని మాసాయిపేట కొండపై ఈ నిక్షేపాలున్నట్టు కేంద్రం గుర్తించి ముమ్మరంగా డ్రిల్లింగ్‌ పనులు చేపట్టింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మ్యాపింగ్‌ నిర్వహించి కొండలో ఎంత మేర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు మ్యాపింగ్ నిర్వహించి.. కొంత కాలంగా డ్రిల్లింగ్‌ పనులు జరుగుతున్నాయి.