collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / AP: 2024 ఎన్నికలకు బీజేపీ సమర శంఖం.. గోదావరి గర్జనతో శ్రీకారం! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu...

AP: 2024 ఎన్నికలకు బీజేపీ సమర శంఖం.. గోదావరి గర్జనతో శ్రీకారం!

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ap bjp
బద్వేల్ టు ఆత్మకూరు.. భారతీయ జనతా పార్టీ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదా? ఏపీలో కాషాయ దళ విస్తరణ కోసం సోము వీర్రాజు మార్క్ వర్క్ జరుగుతోందా? ఇందులో భాగంగానే గోదావరి గర్జన  మహాసభ నిర్వహించబోతుందా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనబోతున్న రాజమంత్రి సభ.. ఏపీ బీజేపీ బలం పుంజుకునేలా చేస్తుందా? బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేటెస్ట్ కామెంట్స్ వింటుంటే.. ఆంధ్రా మీద కమలనాథులు బాగానే  ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.  

*గౌతంరెడ్డి అంటే గౌరవం.. కానీ…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో బీజేపీ బరిలోకి దిగుతుందని సోము వీర్రాజు తాజాగా వెల్లడించారు. అంతేకాదు.. ఆత్మకూరు ఉప ఎన్నికపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే గౌరవం ఉందన్న ఆయన.. బీజేపీ కుటుంబ పాలనకు వ్యతిరేకమన్నారు. అందుకే పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈ నెల 7న గోదావరి గర్జన పేరుతో రాజమండ్రిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం కంటే... రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమమే ఎక్కువని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇళ్లను కేటాయిస్తే... రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 వేల ఇళ్లను మాత్రమే నిర్మించిందని విమర్శించారు. కోనసీమలో అల్లర్లు కేవలం ఓట్ల రాజకీయాల కోసమే జరుగుతున్నాయని చెప్పారు.  అటు ఆత్మకూరు ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉంటుండగా..  వైసీపీ తరపున దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నిక జరుగుతుంది.   

*ఏపీపై ప్రత్యేక దృష్టి
భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైన పట్టు సాధించాలనే ప్రయత్నం చేస్తొంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న మోడీ, షా, నడ్డా త్రయం..  తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నది.  ఇప్పటికే పార్టీ నేతలకు అగ్రనాయకులు దిశ నిర్దేశం చేశారు. బూత్ కమిటీలను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దాలని చెప్పాఉ. ఏపీలో బలమైన నాయకులు ఉన్నా, ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంతో బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెంచింది. వచ్చే రెండేళ్లలో ఎలాగైనా పార్టీని పటిష్టం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రజాకర్షణ ఉన్న నాయకులను రంగంలోకి దించాలని ప్రయత్నిస్తోంది. తటస్థులను ఆకర్షించడం ద్వారా పార్టీకి బలం చేకూర్చాలనుకుంటుంది.  ఈ రెండేళ్లలో పార్టీ అగ్రనేతలు పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేయబోతుంది.  ప్రధాని నుంచి కింది స్థాయి నాయకుల వరకు  ఏపీలో మోహరించాలని భావిస్తోంది.  

*ఎన్నికలే టార్గెట్
2024 ఎన్నికలే టార్గెట్ చేసుకొని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అగ్రనేతలను ఇప్పటి నుండే వ్యూహాత్మకంగా రంగంలోకి దింపుతుంది.  వాస్తవానికి ప్రధాని మోడీ ఏపీలో పర్యటించింది తక్కువే. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఒకటి రెండు సభలు, సమావేశాలకు హాజరయ్యారు. అయితే తరచూ రాష్ట్రంలో పర్యటించడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో జోష్ తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ నాయకులు.  అందులో భాగంగానే ప్రధాని మోడీ త్వరలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నట్టు తెలుస్తున్నది. అయితే పర్యటన షెడ్యూల్ ఏంటనేది ఖరారు కాలేదు.  

*బీజేపీలో అంతర్గత లొల్లి
ఏపీ బీజేపీలో విభేదాలు  బాగానే ఉన్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బాగానే పనిచేస్తున్నా నేతలు సహకరించడం లేదనే అపవాదు ఉంది. పార్టీలో జగన్, చంద్రబాబు అభిమానులు అంటూ రెండు వర్గాలుగా విడిపోయారు. పార్టీ బలోపేతానికి ఇది ప్రతిబంధకంగా మారింది. దీనికి చెక్ పెట్టేందుకే పార్టీ అగ్రనాయకత్వం ఏపీపై ఫోకస్ పెట్టింది.



2022-06-01  News Desk