collapse
...
Home / బిజినెస్ / టెక్నాలజీ / Apple: రూ.6 కోట్ల ఉద్యోగాన్ని వదిలేశాడు..ఇలాంటి వారు కూడా ఉంటారా... - 6TV News : Telugu in News | Telugu News | Latest T...

Apple: రూ.6 కోట్ల ఉద్యోగాన్ని వదిలేశాడు..ఇలాంటి వారు కూడా ఉంటారా...

2022-05-13  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Ian Goodfellow
ప్రపంచంలో వింత  వింత మనుషులు కనిపిస్తుంటారు. వారు చేసే కొన్ని పనులు అందరికీ ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి. అయితే డబ్బు కోసం తమ ఫ్రీడాన్ని వదులుకోం అనేది సదరు వ్యక్తుల వాదన. ఏది ఏమైనా ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీలో పని చేస్తున్న ఓ కీలక ఉద్యోగి ఆఫీస్ కు రమ్మన్నందుకు ఏకంగా ఏడాదికి రూ. 6 కోట్లు వచ్చే ఉద్యోగానికి గుడ్ బై చెప్పేశాడు. ఇంతకీ తను ఎవరు? ఎందుకు ఉద్యోగాన్ని వదిలేశాడు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునేప్రయత్నం చేద్దాం..  

కరోనా కారణంగా ఆపిల్ కంపెనీ అప్పట్లో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రం హోంకు అనుమతించింది. ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదుట పడటంతో మే 23 నుంచి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీస్ కు రావాలని కండీషన్ పెట్టింది. ఈ నిర్ణయం తనకు నచ్చక  Apple మెషిన్ లెర్నింగ్ డైరెక్టర్, ఇయాన్ గుడ్‌ఫెలో రాజీనామా చేశాడు.  హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను కంపెనీ అవలంభించడాన్ని తప్పుబడుతూ రిజైన్ చేస్తున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి  Apple కంపెనీలో ఇయాన్ సంవత్సరానికి $1 మిలియన్ కంటే ఎక్కువ జీతం పొందుతున్నాడు. అయినా కంపెనీ నిర్ణయం నచ్చక  సీనియర్ Apple ఇంజనీర్ అయిన తను జాబ్ వదిలేసేందుకు ఏమాత్రం వెనుకడలేదు. ఆయన ఈ ఉద్యోగం వదిలి వేయడం మూలంగా ఏడాదికి భారత కరెన్సీలో రూ.6 నుంచి 8 కోట్ల రూపాయలను వదులుకున్నాడు.  తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం టెక్ కంపెనీల్లో సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు.. ఆయన గురించి, ఆయన సాలరీ గురించి జనాలు సోషల్ మీడియాలో బాగా సెర్చ్ చేస్తున్నారు.

Apple గుడ్‌ఫెలోకు ఎంత చెల్లిస్తుందో స్పష్టంగా తెలియనప్పటికీ.. అతడి జీతం చాలా ఎక్కువగా ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నిపుణుడైన గుడ్‌ఫెలో వంటి వారికి మార్కెట్ లో చాలా డిమాండ్ ఉంది. తను ఇంతకు ముందు Googleతో పాటు  OpenAI వంటి కంపెనీల్లో పని చేశాడు. అక్కడ ఆయన మంచి ప్రతిభ కనబర్చాడు.  న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. గుడ్‌ఫెలో టెస్లా మెషీన్ లెర్నింగ్ కంపెనీ ఓపెన్ AIలో సుమారు  సంవత్సరం పాటు పరిశోధనా శాస్త్రవేత్తగా పని చేశాడు. 2016లో తన సాలరీ ఏడాదికి $80,0000. ఓపెన్ AI నుంచి గుడ్‌ఫెలో Googleకి వెళ్లారు. 2019లో ఆపిల్‌లో చేరడానికి గూగుల్‌ కంపెనీకి రిజైన్ చేశాడు. Appleలో $1 మిలియన్ కంటే ఎక్కువ డబ్బును సాలరీగా అందుకున్నాడు

*ఏప్రిల్ నుంచి కొత్త వర్క్ రూల్స్.. 
Apple యొక్క కొత్త వర్క్ పాలసీ ప్రకారం.. ఉద్యోగులు ఏప్రిల్ 11 నాటికి వారానికి కనీసం ఒక రోజు ఆఫీసుకు రావాలని వెల్లడించింది. మే 2 నాటికి వారానికి కనీసం రెండు రోజులు, మే 23 నాటికి వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. Apple తన ఉద్యోగులకు ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. కొంతమంది ఉద్యోగులు Apple తాజా నిర్ణయం పట్ల అంత సంతోషంగా లేనట్లు తెలుస్తోంది.2022-05-13  News Desk