2022-06-04Sports Desk ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ పోరు ముగిసింది. ఫైనల్ పోరులో ఎవరు ఆడేది క్లారిటీ వచ్చేసింది. ఈ టోర్నీలో విజేత ఎవరో మరికొన్ని గంటట్లో తేలనుంది. తొలి సెమీస్ పోరులో రఫెల్ నాదల్ నెగ్గాడు. ఆట మధ్యలో జ్వెరెవ్ గాయపడడంతో నాదల్ ఫైనల్ చేరుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తొలి సెట్‌ను నాదల్ అతి కష్టం మీద నెగ్గాడు. రెండో సెట్ కూడా హోరాహోరీగా జరుగుతున్న వేళ...జ్వెరెవ్ ఆడలేని పరిస్థితి నెలకొంది. View more
2022-06-03Sports Desk ప్రస్తుత కాలంలో 60 ఏళ్లకు రిటైర్ అవుతున్నవాళ్లంతా ఏ పనీ లేకుండా ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎటువంటి లక్ష్యం లేకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం 77 ఏళ్ల వయసులోను నిరంతరం శ్రమిస్తున్నాడు. కలలు సాకారం చేసుకోడానికి తపిస్తున్న కొందరు వ్యక్తులకు సాయం అందిస్తున్నాడు. వాళ్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ వ్యక్తే ఈమని చిరంజీవి. View more
2022-06-03Sports Desk ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ తుది దశకు చేరుకుంది. మహిళా విభాగంలో ఫైలన్ బెర్తులు ఖరారయ్యాయి. ఇగా స్వాయితెక్, కోక్ గౌఫ్లు తుదిపోరుకు చేరుకున్నారు. సెమీస్‌లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్దులపై గెలిచి ఫైనల్ చేరుకున్నారు. పురుషల విభాగంలో నాదల్, జ్వెరెవ్, కాస్పర్ రుడ్, మారిన్ సిలిక్లు సెమీస్ పోరుకు సిద్ధమయ్యారు. వీరి నలుగురి ఇద్దరు ఫైనల్ చేరనున్నారు. View more
2022-06-03Sports Desk హార్ధిక్ పాండ్యా కొన్ని నెలల క్రితం వరకు 3 డైమన్షనల్ ప్లేయర్ మాత్రమే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మాత్రమే చేసేవాడు. ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు కూడా నెరవేరుస్తున్నాడు. అటువంటి టాలెంటెడ్ ప్లేయర్ భారత జట్టులో ఉండడం గర్వకారణమని కిరణ్ మోరే అన్నాడు. View more
2022-06-02Sports Desk బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెట్టాడు. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుటెక్ స్టార్టప్.. క్లాస్ప్లస్తో చేతులు కలిపాడు. వేలాది మంది కోచ్‌లను, కంటెంట్ క్రియేటర్లకు మద్దతుగా నిలిచేందుకు నిర్ణయించుకున్నాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. View more
2022-06-02Sports Desk బీసీసీఐ బాస్ గంగూలీ పోస్ట్ వెనుక గందరగోళం ఏంటి? క్రికెట్ వ్యవహారాలకు గుడ్ బై చెప్పి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నా? మరి అలాంటిది ఏమిలేదని దాదా క్లారిటీ ఇచ్చారు. దేనికోసం గంగూలీ అలా పోస్ట్ చేశారు..కొత్తగా ఏం చేయబోతున్నారు. View more
2022-06-02Sports Desk బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇస్లాంబుల్‌లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ పోటీల్లో ఛాంపియన్‌గా అవతరించిన నాటి నుంచి ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తునే ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆమెను అభినందించారు. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌తో పాటు మరో బాక్సర్ మనీషా మౌన్, పర్వీన్ హుడాలను ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసానికి ఆహ్వానించారు. View more
2022-06-01Sports Desk క్రీడాకారులను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే తెలంగాణ ప్రభుత్వం..మరోసారి ఛాంపియన్లకు అండగా నిలిచింది. నగదు బహుమతి ప్రకటించింది. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, షూటింగ్ స్టార్ ఈషా సింగ్‌లకు ఒక్కక్కరికీ రెండేసి కోట్ల రూపాయలను అందించాలని నిర్ణయించింది. నగదు పురస్కారంతో పాటు హైదరాబాద్‌లో ఓ మంచి ప్రదేశంలో ఇంటి స్థలం ఇవ్వనున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. View more
2022-06-01Sports Desk ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. హర్యానాలోని పంచకులాలో జరిగే ఈ క్రీడోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ 4 నుంచి జూన్ 13వ తేదీ వరకు యూత్ గేమ్స్ జరగనున్నాయి. ఈ క్రీడల్లో 5 సాంప్రదాయ క్రీడలకు కూడా చోటు కల్పించారు. గట్కా కలరిపయట్టు, మల్కంబ్, యోగాసన, తాంగ్ తా వంటి క్రీడలు ఈ సారి పోటీల్లో జతకలిశాయి. View more
2022-06-01Sports Desk హాకీ ఆసియాకప్‌లో టీమిండియా పురుషుల హాకీ జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్స్ తేడా కారణంగా టీమిండియా ఫైనల్ చేరకుండానే సూపర్-4లోనే ఇంటిబాట పట్టింది. సూపర్-4లో భాగంగా మే 31న దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌ను భారత్ 4-4తో డ్రా చేసుకుంది. దీంతో భారత్, కొరియా జట్లు చెరో ఐదు పాయింట్లు సాధించాయి. అయితే జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేషియా విజయం సాధించడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. View more
2022-05-31Sports Desk ఐపీఎల్ టోర్నీలో దారుణంగా విఫలమైన కోహ్లీకి అనూహ్య మద్దతు లభించింది. పాకిస్తాన్ లెజెండరీ బౌలర్ షోయబ్ అక్తర్ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీని గ్రేటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ఆల్టైమ్స్ అంటూ ప్రశంసిచాడు. ఒక పాకిస్తానీ పౌరుడిగా తాను ఈ మాట చెబుతున్నానని అన్నాడు. కోహ్లీ విమర్శకలపై విరుచుకుపడ్డాడు. కోహ్లీ గత రికార్డులను ఓ సారి గుర్తుచేశాడు. View more
2022-05-30Sports Desk ఐపీఎల్ టోర్నీ విజేతగా నిలిచిన గుజరాత్ జట్టు...తమ సొంత గడ్డపై విక్టరీ ర్యాలీ చేపట్టనుంది. తమ ఆనందాన్ని అభిమానులతో పంచుకోనుంది. ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత గుజరాత్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. తమ జట్టుకు గత రెండు నెలలుగా మద్దతుగా నిలిచిన అభిమానులకు అభివాదాలు తెలిపేందుకు నేరుగా వారిని కలిస్తే బాగుంటుందని భావించిన జట్టు యాజమాన్యం విక్టరీ ర్యాలీని ప్లాన్ చేస్తోంది View more
Your experience on this site will be improved by allowing cookies Cookie Policy