collapse
...
Home / జాతీయం / కోవిడ్ ఫోర్త్ వేవ్ : పుణెలో బయటపడిన BA.4, 3 BA.5 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌ కేసులు - 6TV News : Telugu in News | Telugu New...

కోవిడ్ ఫోర్త్ వేవ్ : పుణెలో బయటపడిన BA.4, 3 BA.5 ఓమిక్రాన్ సబ్‌వేరియంట్‌ కేసులు

2022-05-29  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Untitled-1-32
కరోనా వైరస్ విజృంభించడం.. మళ్లీ కాస్త గ్యాప్ తీసుకోవడం.. ప్రజలంతా రిలాక్స్ అయ్యేలోపు తిరిగి మళ్లీ అల్లకల్లోలం సృష్టించడం పరిపాటిగా మారింది. కొత్త కొత్త రూపాలతో కొవిడ్ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. తాజా మరో కొత్త అవతారం ఎత్తింది. ఇప్పుడిప్పుడే హమ్మయ్యా అనుకుంటున్న ప్రజలను బాబోయ్‌ అంటూ భయాందోళనకు గురిచేస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఒమిక్రాన్‌ బీఏ.4 తొలి కేసు హైదరాబాద్‌లో వెలుగు చూడగా.. తాజాగా తమిళనాడులో రెండో కేసు నమోదయ్యింది. తాజాగా దేశంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్‌ B.A.4, B.A.5 కేసులు బయటపడుతున్నాయి. ఒమిక్రాన్ ఉప-వంశానికి చెందిన 5 రకాలు మహారాష్ట్రలో తొలిసారిగా వెలుగు చూశాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారి స్వయంగా వెల్లడించారు. ఆరోగ్య అధికారుల ప్రకారం.. రోగులందరికీ తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. వారంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. పుణెకు చెందిన  మొత్తం ఏడుగురు రోగుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స్ పొందుతున్నారు.

ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బాధితుల్లో తొమ్మిదేళ్ల చిన్నారి..

దక్షిణాఫ్రికా సహా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఏప్రిల్‌లో అత్యధికంగా వ్యాపించే ఓమిక్రాన్ వైవిధ్యమైన కరోనా వైరస్ BA.4, BA.5 సబ్ వేరియంట్స్ కనుగొనబడ్డాయి. పుణెలో నమోదైన కేసుల్లో నలుగురు రోగులు 50 ఏళ్లు పైబడిన వారు కాగా..ఇద్దరు 20-40 ఏళ్ల మధ్య ఉన్నవారు. వీరిలో తొమ్మిదేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. వీరిలో ఆరుగురు పెద్దవాళ్లూ కొవిడ్ వ్యాక్సిన్ సెకండ్ డోస్‌ను వేయించుకున్నవారే. వీరిలో ఒకరు బూస్టర్ షాట్ కూడా తీసుకున్నారు.
అయితే చిన్నారి మాత్రం ఎలాంటి టీకాలు తీసుకోలేదు. వారందరికీ కోవిడ్ -19 తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. అంతా హోమ్ ఐసోలేషన్‌లో విజయవంతంగా చికిత్స పొందినట్లు రాష్ట్ర వైద్యాధికారి తెలిపారు. మే 4 నుంచి 18 మధ్య వీరి నమూనాలను సేకరించి జన్యు విశ్లేషణ పరీక్షలకు పంపామన్నారు. వారిలో ఇద్దరు దక్షిణాఫ్రికా, బెల్జియంలకు వెళ్లగా.. ముగ్గురు కేరళ, కర్ణాటకలకు వెళ్లారు. మిగిలిన ఇద్దరు రోగులు మాత్రం ఇటీవలి కాలంలో ఎక్కడికీ ప్రయాణించింది లేదని రాష్ట్ర వైద్యాధికారి వెల్లడించారు. బాధితులతో కాంటాక్ట్ అయినవారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.

అప్పటి నుంచే మళ్లీ కేసుల్లో పెరుగుదల..

ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ద్వారా పూర్తి-జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించబడింది. దాని అన్వేషణను ఫరీదాబాద్‌లోని ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ధృవీకరించింది.అయితే ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ BA.4 లేదా BA.5 సోకిన వ్యక్తులకు కొత్త లక్షణాలు ఏవీ కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఈ కొత్త వేరియంట్లు పెద్దగా ప్రమాదకరమైనవని కావని అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్రలో ముఖ్యంగా ముంబయి, పుణేలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో ఏప్రిల్ 2 నుంచి మాస్క్ నిబంధనలు ఎత్తివేశారు. అప్పటి నుంచి మళ్లీ కేసుల్లో పెరుగుదల ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 15 నాటికి 681 యాక్టివ్ కేసులు ఉండగా.. మే చివరి నాటికి ఇవి 2వేలు దాటేశాయి. అలాగే, రోజువారీ కేసులు కూడా వందల్లో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించి, కోవిడ్ నిబంధనలు పాటించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞ‌ప్తి చేశారు.

 



2022-05-29  News Desk