collapse
...
Home / అంతర్జాతీయం / Bangladesh: రోహింగ్యాల సంక్షోభం.. ఉక్రెయిన్‌కు పాఠం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | New...

Bangladesh: రోహింగ్యాల సంక్షోభం.. ఉక్రెయిన్‌కు పాఠం

2022-05-14  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ukrainian refugees
రష్యా సైన్యం దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు  సరిహద్దుల్లోని దేశాలకు పారిపోతున్నారు. పొరుగు దేశాలు సైతం ఉక్రెయిన్ శరణార్థులకు  ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే శరణార్థి శిబిరాల్లో పరిమిత అవకాశాల కారణంగా మున్ముందు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఉక్రెయిన్ లో జరుగుతున్న దాడుల నేపథ్యంలో శరణార్థులకు పక్కదేశాల్లో ఆశ్రయం అయితే దొరుకుతుంది. కానీ, కొద్ది రోజుల తర్వాత పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుదోంది.    

*ఉక్రెయిన్ శరణార్థులు, బంగ్లాదేశ్ రోహింగ్యాలు  
బంగ్లాదేశ్ లోని రోహింగ్యాల పరిస్థితే ఉక్రేనియన్లకు వర్థిస్తుందా? అంటే.. అవుననే సమాధానం వస్తోంది. బంగ్లాదేశ్ వాస్తవానికి చాలా సమస్యలతో ఇబ్బంది పడుతుంది. పరిమిత వనరులు, అధిక జనాభా సమస్యలు వేధిస్తున్నాయి. అయితే, గత ఐదేళ్లలో తమ దేశానికి వచ్చిన పొరుగు దేశాల ప్రజలకు ఆతిథ్యం ఇస్తున్న ప్రముఖ దేశాలలో ఒకటిగా మారింది. 2017లో మయన్మార్ నుంచి  మిలియన్ మంది రోహింగ్యా శరణార్థులు బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించారు. వారంతా కాక్స్ బజార్ జిల్లాలోని ఉఖియా, టెక్నాఫ్‌లలో ఉన్న తాత్కాలిక శిబిరాల్లో నివసిస్తున్నారు. 

తొలి రోజుల్లో బంగ్లాదేశ్ సంఘాలు రోహింగ్యా శరణార్థులను ఎంతో గౌరవంగా చూసుకున్నాయి. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థల సేవలు.. అంతర్జాతీయ సమాజం గొప్పగా నిలిచాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం శిబిరాల్లోని వారికి ఆహారం, ఆశ్రయం, వంట సామాగ్రి, ఆరోగ్య సంరక్షణ, విద్య సహా అవసరమైన అవసరాలను తీరుస్తూ వచ్చింది. రాను రాను పరిస్థితి మారింది.  2019లో శరణార్థి శిబిరాల చుట్టూ ఏకంగా ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. అందుకు కారణం రోహింగ్యాల పట్ల స్థానిక జనాలకు సానుభూతి తగ్గిపోవడమే. తొలుత వారిని ఎంతో ప్రేమగా చూసుకున్న స్థానికులు..  నెమ్మదిగా వారి పట్ల తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించడం మొదలు పెట్టారు. అలాగే రానున్న రోజుల్లో  పొరుగు దేశాల కు వెళ్తున్న ఉక్రెయిన్ వాసుల పరిస్థితి కూడా ఇలాగే మారే అవకాశం ఉంది. ప్రస్తుతం వారికి అందుతున్న సాయం మున్ముందు అందకపోతే వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.  

*పెరుగుతున్న ఉద్రిక్తతలు  
బంగ్లాదేశ్లో రోహింగ్యాల పట్ల ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకతను కలిగి ఉన్నారు స్థానికులు. శిబిరాల్లో రోహింగ్యాలు స్థిరపడిన తర్వాత,  స్థానికులు తమ భూములను మళ్లీ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించినప్పుడు..  రోహింగ్యాలు ఎదురుతిరిగిన సందర్భాలున్నాయి. దీంతో శరణార్దులు, స్థానికుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. అంతేకాదు.. రోహింగ్యాలపై తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ ప్రధాని రోహింగ్యాలు తమ దేశానికి భారం అని ప్రకటించారు. బంగ్లాదేశ్ శిబిరాల్లో ఉన్న రోహింగ్యాలు నెమ్మదిగా  క్రిమినల్ ముఠాలు,  మానవ అక్రమ రవాణాదారులచే ఆకర్షించబడ్డారు. వారితో కలిసి  నేర కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల వ్యాపారంలో పాలుపంచుకున్నారు. రాను రాను రోహింగ్యాలు తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారు. రాత్రి పూట స్థానికుల ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. నేరస్తులుగా మారుతున్నారు.    

*ఉక్రేనియన్ శరణార్థుల పరిస్థితి ఏంటి?     
రోహింగ్యాల ప్రారంభ రోజుల్లాగే, ఉక్రేనియన్ శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడానికి కొంత సానుకూలత, ఉత్సాహం  సరిహద్దు దేశాల నుంచి ఉంది. అయినప్పటికీ, బంగ్లాదేశ్‌లో పరిణామాలు అక్కడ వచ్చే అవకాశాలు లేకపోలేదు.  ఒక సంక్షోభాన్ని తాత్కాలిక ప్రాతిపదికన పరిష్కరించినట్లయితే,  దీర్ఘకాలిక సమస్యగా పరిగణించబడకపోతే, శరణార్థులు ప్రత్యామ్నాయ ప్రమాదకర అవకాశాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.  మున్ముందు అది మరింత హాని కలిగించవచ్చు.  ఉక్రేనియన్ శరణార్థులకు ఆతిథ్యం ఇవ్వడంలో చురుగ్గా పాల్గొంటున్న హోస్టింగ్ ప్రభుత్వాలు, EU, UN సంస్థలు, ఆయా  సంస్థలలో ఉద్యోగాలు, భద్రత, ఆరోగ్య సంరక్షణ కోసం దీర్ఘకాలిక ప్రణాళికను సిద్ధం చేయాలి.  బంగ్లాదేశ్‌ రోహింగ్యాల తరహా పరిస్థితి రాకుండా చూసుకోవాలి.2022-05-14  News Desk