collapse
...
Home / క్రీడలు / Boxing Coach: నిరంతర శ్రమజీవి...ఈమని చిరంజీవి.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News f...

Boxing Coach: నిరంతర శ్రమజీవి...ఈమని చిరంజీవి..

2022-06-03  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Boxing coach
 

ప్రస్తుత కాలంలో 60 ఏళ్లకు రిటైర్‌ అవుతున్నవాళ్లంతా ఏ పనీ లేకుండా ఇంటిలోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎటువంటి లక్ష్యం లేకుండా కాలాన్ని వెళ్లదీస్తున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం 77 ఏళ్ల వయసులోను నిరంతరం శ్రమిస్తున్నాడు. కలలు సాకారం చేసుకోడానికి తపిస్తున్న కొందరు వ్యక్తులకు సాయం అందిస్తున్నాడు. వాళ్లను ఛాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ వ్యక్తే ఈమని చిరంజీవి. బాక్సింగ్‌లో మెలుకువలు నేర్చుకునేవాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాడు. యంగ్ బాక్సర్లను ఛాంపియన్లు తీర్చిదిద్దడంలోనే ఆనందం వెతుక్కుంటున్నాడు. 

బాక్సర్లకు కేరాఫ్ అడ్డా 

బాక్సర్లకు కోచింగ్‌ ఇవ్వడమే తన వ్యాపకంగా మార్చుకున్న ఈమని చిరంజీవి జంటనగరాల్లో ఎంతోమంది బాక్సర్లకు కోచింగ్ ఇచ్చాడు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఎందరో విద్యార్ధులు చిరంజీవి వద్ద శిష్యరికం చేసి బాక్సింగ్ క్రీడలో రాటు దేలారు. ప్రస్తుత వరల్డ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్‌ కూడా ఒకానొక సమయంలో ఈమని చిరంజీవి వద్ద మెళుకువలు నేర్చుకుంది. తన శేష జీవితం ఇలాగే జీవితం గడుపుతానని చిరంజీవి తెలిపాడు. ఎంత కాలం వీలుంటే అంత కాలం తాను బాక్సర్లు మెళుకువలు నేర్పుతూనే ఉంటానని స్పష్టం చేశాడు. ఈ వయసులో కూడా తనకు ఏం చేయాలని అనిపిస్తే అది చేయగలగుతున్నానని గర్వంగా చెప్పాడు. 

1983 నుంచి కోచింగ్ ప్రారంభం 

1983 వరకు బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న చిరంజీవి ఆ తర్వాత కోచింగ్‌ ఇవ్వడం ప్రారంభించాడు. అప్పటి వరకు చెన్నైలోనే కోచింగ్‌ క్లాసులు చెప్పే చిరంజీవి 1984లో హైదరాబాద్‌ షిఫ్ట్ అయ్యాడు. ఉస్మానియి యూనివర్సిటీలో కోచ్‌గా చేరాడు. ఆసక్తిగల విద్యార్ధులకు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాడు. ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా విద్యార్ధులు బంగారు పతకం సాధించడంలో చిరంజీవి ఎంతో కృషి చేశాడు. నాలుగేళ్లలో రెండు ఉస్మానియా బాక్సర్లు సార్లు ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్లుగా నిలిచారు. 

48 మందికి ఉద్యోగాలు 

తన శిష్యుల్లో 48 మందికి రైల్వే శాఖలో ఉద్యోగం రావడం తనకెంతో గర్వకారణమని చిరంజీవి తెలిపాడు. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన 18 మంది విద్యార్ధులు యూనివర్సిటీ స్థాయి పోటీల్లో పతకాలు సాధించారని చిరంజీవి గుర్తుచేసుకున్నాడు.

నేషనల్ కోచ్ 

1988 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో కోచ్‌గా ఉన్న చిరంజీవి అక్కడి నుంచి కొత్త బాధ్యతలు అందుకున్నాడు. భారత బాక్సింగ్ జాతీయ కోచ్‌గా ఎంపికయ్యాడు. భారత బాక్సింగ్ జట్టును తీర్చిదిద్దే బాధ్యతలు స్వీకరించాడు. ఆసియా క్రీడల్లో, సౌత్‌ ఏషియా ఫెడరేషన్ గేమ్స్ లోనూ మన బాక్సర్లు సత్తా చాటారు. 1980, 1990లో హైదరాబాద్ నగరం బాక్సర్లతో కళకళలాడేదని చిరంజీవి గుర్తుచేసుకున్నాడు. అప్పట్లో బాక్సింగ్‌లో బాగా రాణించిన వారంతా ప్రస్తుతం రైల్వే ఉద్యోగాల్లో షెటిల్ అయ్యారని చిరంజీవి సంతృప్తి వ్యక్తం చేశాడు. 2006లో తాను కోచింగ్‌ ఇవ్వడం తగ్గించిన తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పతకం కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 2016లో నిఖత్ జరీన్‌కు ఆలిండియా యూనివర్సిటీ మెడల్ వచ్చిందని చిరంజీవి గుర్తుచేసుకున్నాడు.

రెండేళ్ల పాటు ట్రైనింగ్ తీసుకున్న నిఖత్ జరీన్‌ 

నిఖత్ జరీన్ తన వద్దకు 2014లో వచ్చిందని..అప్పటి నుంచి రెండేళ్ల పాటు తన వద్దనే ట్రైనింగ్ తీసుకుందని చిరంజీవి తెలిపాడు. ఎంతో శ్రమించి తన గేమ్‌ను మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం ఆ కష్టానికి తగ్గ ఫలితాలను అనుభవిస్తోంది. నిరంతరం శ్రమించే తత్వం, ఆమె అంకితభావం ఆమెకు వరల్డ్ ఛాంపియన్‌గా మలిచాయని...ప్రపంచ స్థాయిలో విజేతగా నిలిపాయని గుర్తుచేసుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌ మెంట్ శాఖ నిర్వహిస్తున్న కోచింగ్ క్యాంపుల్లో పాల్గొంటున్నాడు. ఏ క్రీడలోనైనా విజయం సాధించాలంటే శారీరికంగా, మానసికంగానూ ధృఢంగా ఉండాలని చిరంజీవి సూచించాడు. 2022-06-03  Sports Desk