Breaking News

Breaking Chandra mohan pass away: ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత.

ezgif 2 2f8cac2029 Breaking Chandra mohan pass away: ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత.

Breaking Chandra mohan pass away: ప్రముఖ సీనియర్ నటుడు కన్నుమూత.

టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్‌(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందూతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

దీంతో సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్త చేస్తున్నారు. తెలుగులో ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు చంద్రమోషన్.

1943 మే 23న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. 1966లో రంగుల రాట్నం సినిమాతో సినీ అరంగేట్రం చేశారు.

ఆయన కెరీర్ తొలి నాళ్లలో హీరోగా చాలా సినిమాల్లో నటించి అలరించారు. శ్రీదేవీ, జయప్రద, జయసుధ, సుహాసినీ, విజయశాంతి లాంటి హీరోయిన్లతో చంద్రమోహన్ హీరోగా నటించారు.

పలు తమిళ సినిమాల్లోనూ ఆయన నటించారు. తన సినీ కెరీర్ లో రెండు ఫిలింఫేర్, 6 నంది అవార్డులను అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లో చంద్రమోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *