క్రిఫ్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ట్రిలియన్ డాలర్ల వరకు ఆవిరైపోయింది. గత ఏడాది బిట్ కాయిన్ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్ల వరకు కోల్పోయింది. ఇటీవల కాలంలో రోజు రోజుకు బిట్ కాయిన్ విలువ క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వు ఉద్దీపన పథకాలు ఉపసంహరించుకోవాలని నిర్ణయించడంతో ఇలాంటి రిస్కీ అసెట్స్ ఉదాహరణకు బిట్ కాయిన్ .. అతి పెద్ద డిజిటల్ అసెట్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత శుక్రవారం నాడు ఏకంగా 12 శాతం క్షీణించి బిట్ కాయిన్ 36వేల డాలర్ల దిగువనకు దిగిచ్చింది. జులై తర్వాత ఈ స్థాయికి దిగిరావడం ఇదే మొదటిసారి. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే బిట్‌కాయిన్ విలువ ఏకంగా 45 శాతంపైనే క్షీణించింది. ఇతర డిజిటిల్ కరెన్సీల విలువ కూడా బిట్‌కాయిన్ మాదిరిగానే భారీగానే నష్టపోయాయి.
గత ఏడాది నవంబర్ నుంచి 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ మార్కెట్ విలువ కోల్పోవడంతో పాటు గరిష్టంగా చూస్తే క్రిప్టోమార్కెట్ ట్రిలియన్ డాలర్లపైనే విలువ కోల్పోయిందని బీ స్పెక్ ఇన్వెస్ట్మెంట్ గ్రూపు వెల్లడించింది.
క్రిప్టో విషయానికి వస్తే మార్కెట్లో ఒడిదుడుకులు ఎక్కువైతే దాని ప్రభావం క్రిప్టో మీద ఉంటుంది. ఒడిదుడుకులు ఎదురైనప్పుడు ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయించి నష్టాలను తగ్గించుకోవడానికి ఇన్వెస్టర్ ప్రయత్నిస్తాడు.
ఫెడరల్ రిజర్వు ఉద్దీపన పథాకలు ఉపసంహరిస్తుందని ప్రకటించిన వెంటనే క్రిప్టో కరెన్సీతో పాటు స్టాక్స్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. క్రిప్టో విషయానికి వస్తే రిస్కీ ఎసెట్‌గా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోతో లింక్ ఉన్న షేర్టు గత శుక్రవారం నాడు భారీగా పతనమైనాయని కోయిన్బేస్ గ్లోబల్ ఐఎన్‌సీ పేర్కొంది. ఒకానొకదశలో సుమారు 16 శాతం వరకు క్షీణించి బిట్‌కాయిన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 2021లో అత్యంత కనిష్ఠానికి పడిపోయింది.
మైక్రోస్ర్టాటెజీ ఐఎన్‌సీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చెంజీ కమిషన్‌లో సుమారు 18 శాతం వరకు క్షీణించింది. ఇదిలా ఉండగా అమెరికా ప్రభుత్వం జో బైడన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే నెల డిజిటల్ అసెట్స్ మీద ఉన్న రిస్క్‌తో పాటు అవకాశాలు ఉన్నాయో లేదా అధ్యయనం చేయబోతోందన్న వార్తలు వినవస్తున్నాయి.
బిట్‌కాయిన్ రిస్కీ అసెట్ అనే సెంటిమెంట్‌తో దాని విలువ క్రమంగా తగ్గిపోతోంది. సంప్రదాయ మార్కెట్లు అంటేస్టాక్ మార్కెట్లతో పోల్చుకుంటే బిట్‌కాయిన్‌పై పెట్టుబడులు రిస్క్ అనే వాదన ఇన్వెస్టర్లలో బలంగా ఉంది. బిట్‌కాయిన్‌కు ఇన్నోవేటివ్ ఈటీఎఫ్‌కు మధ్య రిస్క్‌ను చూస్తే బిట్‌కాయిన్‌పై పెట్టుబడులు 60 శాతం రిస్క్ ఉంటే.. అదే గోల్డ్ ఈటీఎఫ్‌పై 14 శాతంగా ఉందని రీసెర్చి సంస్థలు తెలియజేస్తున్నాయి. బిట్‌కాయిన్స్ కానీ.. అల్ట్కాయిన్లు రిస్క్‌తో కూడిన ఆస్తులు పెట్టుబడులకు స్వర్గధామం కాదని చెబుతున్నారు. గత 24 గంటల్లో 239,000 ట్రేడర్లు తమ వద్ద ఉన్న బిట్‌కాయిన్స్ వదిలించుకున్నారు సుమారు 874 మిలియన్ డాలర్లు నగదుగా మార్చుకున్నారని సమాచారం. అయితే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సంఖ్య తగ్గిందని చెబుతున్నారు.మరో వాదన ఏమిటంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు బేర్ గ్రిప్‌లో ట్రేడ్ అవుతున్నాయని, దాని ప్రభావం క్రిప్టో మీద కూడా ఉంటుందన్న వాదన కూడా ఉంది.