6tvnews

collapse
...
Home / జాతీయం / Danger Bells: ‘దేశ్ కీ మెంటార్’ పథకంపై అభ్యంతరాలు

Danger Bells: ‘దేశ్ కీ మెంటార్’ పథకంపై అభ్యంతరాలు

2022-01-14  News Desk

college students
 

దిల్లీలో ప్రభుత్వ ఆమోదం పొందిన పథకం పేరు దేశ్ కీ మెంటార్. ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ నైపుణ్యాలను విద్యాభ్యాసం దశలోనే అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఒక రకంగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ విద్యా సంస్థలల్లోని విద్యార్థుల చొరవతోనేఇది రూపుదిద్దుకుంది. 10, 12 తరగతులు చదివే బాలబాలికలను ఈ పథకం కింద చేర్చారు. సాధారణంగా ఈ తరగతులలోని వారు 15 – 17 సంవత్సరాల వయసులో వారై ఉంటారు. ఇదే చిన్నారుల హక్కుల కమిషన్ (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) కు అభ్యంతరం కరంగా మారింది. ఆ వయసులోని వారు చాలా అమాయకంగా ఉంటారని, వారికి ఈ కార్యక్రమంలో ఎలాంటి భద్రత ఉంటుందని కమిషన్ ప్రశ్నించింది.     

ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ లో శిక్షణ  

దేశ్ కీ మెంటార్ పథకం కింద నిపుణులైన శిక్షకులు (మెంటార్స్) చిన్నారులకు ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ విషయంలో బోధన చేస్తారు. వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన వివిధ అంశాలపై నిపుణులు ఇందులో శిక్షణ ఇస్తారు. అయితే దీనికి సంబంధించిన యాప్ లో కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయని కమిషన్ అనుమానిస్తోంది. మెంటార్లుగా ఎంపికైన వారి గురించి క్షుణ్ణంగా విచారించి, వారి గుణసౌశీల్యాల గురించి ఎలాంటి ముందస్తు సేకరణ ఉన్నట్లు కనిపించడం లేదని, అలాంటి వారి వల్ల చిన్నారుల హక్కులకు ముప్పు వాటిల్లవచ్చని కమిషన్ ఆందోళన చెందుతోంది.   

సరిగా స్పందించని ప్రభుత్వం  

గత అక్టోబర్ లో వెలుగు చూసిన ఈ కార్యక్రమానికి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే కమిషన్ చెయిర్ పర్సెన్ ప్రియాంక కనుంగో తన అభ్యంతరాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. సందేహాలు పరిష్కరించేవరకు దీని అమలును నిలిపివేయాలని అందులో ప్రియాంక సూచించారు. అంతకుముందు ఇదే అంశంపై కమిషన్ లేఖకు ప్రభుత్వ స్పందన సంతృప్తి కలిగించలేదు. అందువల్లనే నిలిపివేత సూచన ఇస్తూ మరో లేఖరాయాల్సి వచ్చింది. మెంటార్ల ప్రవర్తన, విశ్వసనీయతలపై ముందుగానే పోలీసు వెరిఫికేషన్ చేసే అంశంపై ప్రభుత్వం సరిగా స్పందించలేదని ఆమె వివరించారు.     

విద్యార్థులతో సాన్నిహిత్యం ఉండదు  

ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ హిమాంశు గుప్తా కమిషన్ కు కొంత వివరణ ఇచ్చారు. మెంటార్ లను చిన్నారులకు కేటాయించేప్పుడు పిల్లల జెండర్ వారినే కేటాయిస్తారని చెప్పారు. అలాంగే మెంటార్లుగా ఎంపిక చేసుకునే ముం దు నిర్వాహకులు వారి గురించి సమగ్ర సమాచారం సేకరిస్తారని తెలిపారు. వారి విషయంలో సైకోమెట్రిక్ పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు. పైగా ఎక్కడా  మెంటార్లకు విద్యార్థులతో నేరుగా ముఖాముఖీ సాన్నిహిత్యం ఉండదని, ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా మాత్రమే బోధన జరుగుతుందని తెల్పారు.     


 


2022-01-14  News Desk