6tvnews

collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / Economy: కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు..

Economy: కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు..

2022-01-14  Business Desk

indian economy
 

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత దేశంలో కరోనా వైరస్‌ క్రమంగా తీవ్ర రూపం దాల్చుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. గతంలో పోల్చుకుంటే అంత తీవ్రంగా ఉండదని చెబుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకొనే అవకాశాలున్నాయి. గత కొన్ని నెలల క్రితం కనిపించిన జోరు అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది భారత్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఐదు అంశాలను ఒకసారి గమనిద్దాం.  

 2022-23లో జీడీపీ పెరిగే అవకాశం  

వచ్చే ఆర్థిక సంవత్సరం 2022-23లో స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీ అత్యధికంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి కారణం ఆదాయంతో పాటు ఉత్పత్తి పెరగడమే కాకుండా గ్లోబల్‌తో పాటు దేశీయంగా డిమాండ్‌ పెరిగే అవకాశం కనిపస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో కొన్ని నెలల పాటు ఒమిక్రాన్‌ ఇబ్బందులు తలెత్తినా.. క్రమంగా వీటిని నుంచి తప్పంచుకుని తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకొని గాడిలో పడతామని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.  

ఒమిక్రాన్‌ విషయానికి వస్తే ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరి శరవేగంగా సంక్రమిస్తుందని చెబుతున్నారు. కానీ గత వెరియెంట్‌కంటే అంత తీవ్రమైనది కాదని ..వ్యాక్సినేషన్‌ ప్రక్రియ రేటు పెరగడం వల్ల ప్రాణాంతకంగా కాదని.. మరణాల రేటు పరిమితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

అత్యధిక ద్రవ్యోల్బణం  

అభివృద్ది చెందిన దేశాలతో పాటు అభివృద్ది చెందుతున్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీని ప్రభావం భారత్‌పై కూడా ఉంటుంది. కమాడిటీ ధరలు, పారిశ్రామికరంగానికి వినియోగించే ముడి సరకుల ధరలు పెరుగుతాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడి సరకుల ధరలు రవాణా చార్జీల వల్ల వీటి ధరలు బాగా పెరిగాయి. నవంబర్‌ 2021 నాటికి టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 14.32 శాతానికి ఎగబాకింది. అదే నవంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.91 శాతంగా నమోదైంది. టోకు ద్రవ్యోల్బణం.. రిటైల్‌ ద్రవ్యోల్బణం మధ్య వ్యత్యాసం రాబోయే నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణంపై పడుతుంది. దీని ప్రభావంతో కన్యూమర్‌ గూడ్స్‌ ప్రొడక్ట్స్‌పై కనిపిస్తుంది. వినియోగదారుడు వినియోగించే వస్తువుల ధరలు పెరగడం తధ్యం.   

వడ్డీ రేట్ల విషయానికి వస్తే...  

మార్చి 2020 నుంచి దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆర్‌బీఐ జోక్యం చేసుకొని ద్రవ్యపరపతి విధానాన్ని సడలిస్తామని ప్రకటించింది. ఆర్‌బీఐ రెపో, రివర్స్‌ రేపో రేటులో ఎలాంటి మార్పులు చేయకుండా యధాతథంగా కొనసాగించింది.  

స్టాక్‌ మార్కెట్లు..  

గత ఏడాది స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వచ్చాయి. కంపెనీల లాభాలతో పాటు రిటైల్‌ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున మార్కెట్లో ప్రవేశించడం. దీంతో పాటు పెద్ద ఎత్తున కంపెనీలు ఐపీవోకు రావడంతో మార్కెట్లో ర్యాలీ ఏర్పడింది.  

 గ్లోబల్‌ అంశాలు….  

 పెడ్‌ రిజర్వు ఒమిక్రాన్‌ వల్ల వడ్డీరేట్లు పెంచుతామని ప్రకటించింది. దీంతో గ్లోబల్‌ మార్కెట్లు ఒడిదుడులకు గురయ్యే అవకాశం కనిపిస్తోంది.  విదేశీ ఇన్వెస్టర్లు భారత్‌ మార్కెట్లో పెద్ద ఎత్తున డాలర్ల రూపంలో పెట్టుబడులు పెడుతుంటారు.. ఫెడ్‌ వడ్డీరేట్లు పెంచితే ఈ పెట్టుబడులు రాబొయే నెలల్లో ఆగిపోయే ప్రమాదం ఉంది.  

బ్యాంకుల్లో పెరిగిపోతున్న ఎన్‌పీఏ  

ఆర్‌బీఐ ఫైనాన్షియల్‌ స్టేబిలిటి రిపోర్టు ప్రకారం ..కరోనా మహమ్మారి ఎదరైనా బ్యాంకులకు ఎలాంటి ఇబ్బందుల్లే వని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి బ్యాంకుల్లో మొండి బకాయిలు ఆరు సంవత్సరాల కనిష్ఠానికి 6.9 శాతానికి దిగివచ్చాయని నివేదికలో పేర్కొంది.  బ్యాంకుల్లో మూలధనం పరిమితి కంటే ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది.  

స్వల్పకాలికానికి ప్రపంచవ్యాప్తంగా జీడీపీతో పాటు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం కోసం ఆర్‌బీఐ వడ్డీరేట్లు పెంచే అవకాశం కూడా ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో పాటు నిరాశలు కూడా ఎదుర్కొవాల్సి రావచ్చునని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  


2022-01-14  Business Desk