6tvnews

Header - Ramky
collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / Fashion : సోషల్ కామర్స్ తో సంచలనం

Fashion : సోషల్ కామర్స్ తో సంచలనం

2021-11-07  Lifestyle Desk
venus

fashion clothing
 

దేశంలో సోషల్ కామర్స్ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంది. బెయిన్ అండ్ కంపెనీ అంచనా ప్రకారం 2025 నాటికి ఇది 20 బిలియన్ డాలర్ల విలువైన అంశంగా మారనుంది. 2030 నాటికి అది 70 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అందుకే వివిధ కంపెనీలు మరీ ముఖ్యంగా విదేశీ కంపెనీలు సోషల్ కామర్స్ పై భారీగా కన్నేశాయి. పోష్ మార్క్ లాంటి సంస్థలు ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. ఆన్ లైన్ లో ఉండడం మాత్రమే కాదు, సోషల్ కామర్స్ లోకీ కాలుపెడుతున్నాయి. ప్రి-లవ్డ్ వంటి విభాగాల్లోకీ వెళ్తున్నాయి. 

 

సోషల్ షాపింగ్ టూల్స్

దేశంలో యువత ఫ్యాషన్ల కోసం సోషల్ మీడియా పై ఆధారపడడం అధికమైపోయింది. ఈ నేపథ్యంలోనే సోషల్ కామర్స్ కూడా పుట్టుకొచ్చింది. అందుకే పోష్ మార్క్ లాంటి సంస్థలు విదేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా సోషల్ షాపింగ్ టూల్స్ వినియోగాన్ని అధికం చేస్తున్నాయి. విక్రేతలు, కొనుగోలుదారుల్లో తమవైన కమ్యూనిటీలను వృద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అది కొనుగోళ్లను, విక్రయాలను సులభతరం చేస్తోంది. సోషల్ ఇంటరాక్షన్స్ కోసం, భారీ స్థాయిలో లావాదేవీలకు ఇవి సొంతంగా సాంకేతికతలను కూడా వినియోగిస్తున్నాయి. అదే సమయంలో ఈ సంస్థలు పర్యావరణానికి యువత ఇస్తున్న ప్రాధాన్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాయి. సుస్థిరదాయక ఉత్పాదనలను తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాయి.    

 

కమ్యూనిటీల    నిర్మాణం

నేడు వివిధ సంస్థలు షాపింగ్, సెల్లింగ్ లాంటి వాటికి మాత్రమే పరిమితం కావడం లేదు. కమ్యూనిటీలో భాగం అయ్యుందుకు – అనుసంధానం, సోషలైజ్ అయ్యేందుకు-    కూడా కొనుగోలుదారులు తమ వద్దకు వస్తారని పోష్ మార్క్ అంటోంది.  మానవ సంబంధాల ఆధారంగా నిర్మితమయ్యే వైవిధ్యభరిత, బాగా కలుపుగోలుగా ఉండే, విధేయతను చాటుకునే కమ్యూనిటీలను ఆయా సంస్థలు నిర్మించుకుంటున్నాయి. ప్రి – లవ్డ్ ఫ్యాషన్ ట్రెండ్ ను ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రి – లవ్డ్ ఫ్యాషన్ అంటే మరేమిటో కాదు.... కొనుగోలుదారులు గతంలో నచ్చిన, మెచ్చిన, కొనుగోలు చేసిన ఫ్యాషన్ల తరహాలోని వాటినే తిరిగి కొనుగోలు చేయడం. అప్పటికే నచ్చిన వస్తువును కొనుగోలుదారులు సులభంగా కొంటారు. అదే టెక్నిక్ ను ఇప్పుడు వివిధ సంస్థలు ఉపయోగిస్తున్నాయి. 

 

ఇన్ ఫ్లుయెర్స్ ప్రభావం

కొనుగోలుదారులపై ఇన్ ఫ్లుయెర్స్ ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. అదే ఇప్పుడు మరోసారి మరింత సన్నిహిత రూపాల్లో కొనుగోలుదారుల చెంతకు వస్తోంది. అంతే గాకుండా కొనుగోలుదారులు తమ అనుభవాలను, అనుభూతులను చెప్పడం, వాటిని ఇతరులతో పంచుకోవడం అధికమైపోయింది. ఇక సెలెబ్రెటీలు, ప్రఖ్యాత కళాకారులు ధరించిన దుస్తుల తరహాలో వాటిని విక్రయించడం కూడా జోరందుకుంది. తమ స్టైల్ ను విక్రయించుకునేందుకు వివిధ రకాల వేదికలను ఆశ్రయిస్తున్న వారు కూడా అధికంగానే ఉన్నారు. పోష్ మార్క్ లాంటివి ఇలాంటి వాటికీ వేదికలుగా నిలిచాయి. తమ ప్లాట్ ఫామ్ పై నుంచి సెలెబ్రెటీలు, ప్రఖ్యాత కళాకారులు తమ స్టైల్స్ ను విక్రయించుకునేందుకు అవకాశం కల్పించాయి.

కొనుగోలుదారుల ప్రాథమ్యాలు, కొనుగోలు తీరుతెన్నులు, అభిరుచులు మొదలైన డేటా కూడా ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యక్తిగతీకృత సిఫారసులు చేసేందుకు డేటాను, మెషిన్ లెర్నింగ్ ను ఉపయోగించడం అధికమైపోయింది. ఆయా కంపెనీలు తమ ఆఫర్లను తెలియజేసేందుకు కూడా ఈ డేటా కీలకంగా మారింది. 


2021-11-07  Lifestyle Desk

rajapush