collapse
...
Home / అంతర్జాతీయం / France: అధ్యక్షుడి భార్య ట్రాన్స్ జెండరా...? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for T...

France: అధ్యక్షుడి భార్య ట్రాన్స్ జెండరా...?

2021-12-24  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

France President wife
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య గురించి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగెట్టి మాక్రాన్ ఒక ట్రాన్స్ జెండర్ అంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది బ్రిగెట్టి. ఫ్రెంచ్ లో రానున్న నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రెంచ్ అధ్యక్షుడి భార్యపై ఇలాంటి ఆరోపణలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. 

ఎన్నికల్లో తనను ఓడించేందుకు ఇలాంటి దాడులకు భారీ పథకాన్ని రూపొందించినట్లు మాక్రాన్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై బ్రిగెట్టి మాక్రాన్ న్యాయపరమైన పోరాటానికి సిద్ధమైందని  ఆమె తరపు న్యాయవాది జీన్ ఎన్నోచి తెలిపారు. అక్టోబర్ లో బ్రిగెట్టి తన పేరును నటాచా రే అని మార్చుకోవడం ఈ పుకార్లకు ఆద్యం పోసినట్లయ్యింది. బ్రిగెట్ మాక్రాన్  రహస్యం అని ఓ మీడియా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం తర్వాత ఫ్రెంచ్ మొదటి మహిళ ఒక ట్రాన్స్ జెండర్ అనే వదంతి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #JeanMichelTrogneux అనే హ్యాష్ ట్యాగ్ తో మొదటిసారిగా ట్విట్టర్ లో నవంబర్ 1న కనిపించింది. ఈ హ్యాష్ ట్యాగ్ కు  ఇప్పటివరకు 68,300 మంది రీట్వీట్ చేశారు. 174000కు పైగా లైక్ లు వచ్చాయి. 

ఈ పరిణామాలన్నింటిపై బ్రిగెట్టి మాక్రాన్ దావా వేయడానికి సిద్ధమైంది. అయితే బ్రిగెట్టి ట్రోల్స్ కు గురికావడం ఇది మొదటిసారి కాదు. 2017లో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఎన్నికైనప్పుడు ఈ జంట గురించి వార్తలు వైరల్ గా మారాయి. ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ కంటే వయస్సులో బ్రిగెట్టి మాక్రాన్ 25 సంవత్సరాలు పెద్దది కావడంతో నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. అంతేకాదు 2017లో ఎన్నికల ప్రచారంలో స్వలింగసంపర్కం గురించి తనపై వచ్చిన ఆరోపణలను  ఖండించారు. 

ఇక ఈ మధ్యే రాడికల్ ఇస్లాంకు వ్యతిరేకంగా వాక్ స్వాతంత్య్రానికి మద్దతు తెలపడంతో టర్కీ,  పాకిస్తాన్ వంటి ఇస్లామిక్ దేశాల ఆగ్రహానికి గురయ్యారు.    ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇస్లామోఫోబియా అంటూ  ఆరోపించడాన్ని ఆ దేశాలు ఖండించాయి. 

అతివాద ఇస్లాంపై చర్యలకు మేక్రాన్ ప్రతిపాదించారు. వాటిలో ఓ వివాదస్పద బిల్లు కూడా ఉంది. చాలామంది నిపుణులతో గంటలపాటు సంప్రదించిన అనంతరం బిల్లును మేక్రాన్ ప్రతిపాదించారు. దీన్ని చాలామంది వివాదస్పద బిల్లుగా పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు స్వాగతించాయి. ఫ్రాన్స్ కు సంఘీభావం తెలిపిన భారత్, ఫ్రాన్స్ ప్రజలపై ఉగ్రదాడులు జరిగాయి. 



2021-12-24  News Desk