ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సంచలనాలు నమోదౌతున్నాయి. టాప్ సీడెడ్ ప్లేయర్లు.. అనామకులు చేతుల్లో ఓడిపోతున్నారు. తాజాగా 8వ ర్యాంకర్ ప్లిస్కోవా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 227వ స్థానంలో ఉన్న ప్లేయర్ లియోలియా జీన్జీన్స్ చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూసింది. 6-2, 6-2 తేడాతో ఓటమి చెందింది. రెండో రౌండ్ పూర్తి కాకముందే టోర్నీ నుంచి తప్పకుంది.
ఇంటిదారి పట్టిన టాప్ ర్యాంకర్లు
ఈ టోర్నీలో ఇప్పటికే కొందరు టాప్ ప్లేయర్లు ఘోర పరాజయం చవిచూశారు. ఇంటిదారి పట్టారు. నెంబర్ 2 ప్లేయర్ బార్బొరా క్రెజికోవా, నాల్గవ ర్యాంకర్ మరియా సక్కారీ, ఐదవ ర్యాంకర్ అనెట్ కొంటావిట్, ఆరవ ర్యాంకర్ ఓనస్ జెబ్యూర్, గార్బైన్ మగురుజాలు ఓటమి చెందారు. తమ కన్నా తక్కువ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్ల చేతితో పరాజయం చెందారు.
నిరాశలో ప్లిస్కోవా అభిమానులు
ప్లిస్కోవా ఓటమిని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు వరుస సెట్లలో ఆమె ఓడిపోవడంతో నిరాశ చెందారు. ప్లిస్కోవా గతంలో కొంత కాలం పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. గత ఏడాది వింబుల్డన్ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. 2016లో యూఎస్ ఓపెన్‌లో కూడా ప్లిస్కోవా రన్నరప్‌గా నిలిచింది. 2017లో కూడా ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌లో ఆడింది. అటువంటి టాప్ ప్లేయర్ ఓ అనామక ప్లేయర్ చేతిలో ఓడిపోవడం టెన్నిస్ ప్రపంచంలో ఓ పెద్ద వార్తగా నిలిచింది.
3వ రౌండ్‌కి చేరిన ఎలీనా రిబాకినా, పెగులా
రెండో రౌండ్ సింగిల్స్ పోటీల్లో ఎలీనా రిబాకినా తన సత్తా చాటింది. తన ప్రత్యర్ధి ఓలీనెట్స్ పై 6-4, 6-0 తేడాతో చిత్తుగా ఓడించింది. గర్వంగా మూడో రౌండ్‌కి చేరింది. మరో పోటీలో 11వ ర్యాంకర్ జేఎల్ పెగులా కూడా మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తన ప్రత్యర్ధి కలినినాపై 6-1, 5-7, 6-4 తేడాతో గెలుపొందింది. మూడో రౌండ్లోకి ప్రవేశించింది.
మూడో రౌండ్‌కు చేరుకున్న పోలా బడోసా
టెన్నిస్ ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న పోలా బడోసా రెండో రౌండ్లో తన ప్రత్యర్ధిపై విజయం సాధించింది. మూడో రౌండ్‌కి చేరిన టాప్ 10 ప్లేయర్లతో మొదటి ప్లేయర్ పోలా బడోసా. 2 గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 68వ ర్యాంకర్ కాజా జువాన్...గట్టి పోటీ ఇచ్చింది. పోలా బడోసాతో గట్టిగా తలపడింది. హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరికు బడోసా పైచేయి సాధించింది. 7-5, 3-6, 6-2 తేడాతో విజయం సాధించింది. తదుపరి మ్యాచ్‌లో 29వ ర్యాంకర్ వెరోనికాతో తలపడనుంది.
Right hand, left hand....getting a win 😁#RolandGarros | @paulabadosapic.twitter.com/NIt0KZ8R9R
— Roland-Garros (@rolandgarros) May 26, 2022