ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ తుది దశకు చేరుకుంది. మహిళా విభాగంలో ఫైలన్ బెర్తులు ఖరారయ్యాయి. ఇగా స్వాయితెక్, కోక్ గౌఫ్లు తుదిపోరుకు చేరుకున్నారు. సెమీస్‌లో వారిద్దరూ తమ తమ ప్రత్యర్దులపై గెలిచి ఫైనల్ చేరుకున్నారు. పురుషల విభాగంలో నాదల్, జ్వెరెవ్, కాస్పర్ రుడ్, మారిన్ సిలిక్లు సెమీస్ పోరుకు సిద్ధమయ్యారు. వీరి నలుగురి ఇద్దరు ఫైనల్ చేరనున్నారు. తొలి సెమీస్ మ్యాచ్‌లో నాదల్‌లో జ్వెవెవ్ తలపడనుండగా...రెండో సెమీస్‌లో కాస్పర్ రుడ్, మారిన్ సిలిక్లు అమీతుమీ తేల్చుకోనున్నారు.
ముగిసిన రోహన్ బోపన్న పోరు
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారత ఆటగాడు రోహన్ బోప్పన్న ఆట ముగిసింది. సెమీస్ పోరులో ప్రత్యర్ధుల చేతిలో బోపన్న జోడీ పరాజయం పాలయింది. ఇంటిదారి పట్టింది.
మిక్స్ డ్ డబుల్స్ టైటిల్
ఇనా సిబహానా, వెస్టీ కూల్ హోఫ్ జట్ల మిక్స్ డ్ డబుల్స్ టైటిల్ గెలుపొందారు. ప్రత్యర్ధులపై 7-6, 6-2 తేడాతో గెలిచి విజేతలుగా నిలిచారు. జపాన్‌కి చెందిన ఇనా సిబహానా ఈ టోర్నీలో విజయం సాధించడం ద్వారా తన దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచింది. గత 25 ఏళ్లలో ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్ డ్ విభాగంతో విజేతగా నిలిచిన తొలి మహిళగా రికార్డు నెలకొల్పింది. 25 సంవత్సరాల క్రితం జపాన్‌కి చెందిన రికా హిరాకీ, మహేశ్ భూపతితో కలిసి 1997లో మిక్స్ డ్ విభాగంలో టైటిల్ సాధించింది. అప్పటికి ఇంకా సిబహానా పుట్టనే లేదు. ప్రస్తుతం టైటిల్ నెగ్గడం ద్వారా తన కల నెరవేరిందని సిబహానా పేర్కొంది.
విండీస్ టూర్ ఖరారు
టీమిండియా వెస్టిండీస్ టూర్ ఖరారయింది. ఆ జట్టుతో 3 వన్డే మ్యాచులు, 5 టీ 20 మ్యాచులు ఆడనుంది. క్రికెట్ వెస్టిండీస్ ఈ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 22 నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ట్రినిడాడ్ టొబాగో, క్వీన్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మైదానాల్లో జూలై 27 వరకు 3 వన్డేలు జరగనున్నాయి. ఆ తర్వాత 5 టీ 20 మ్యాచులు 3 ప్రదేశాల్లో జరగనున్నాయి. 2019లో చివరి సారిగా విండీస్ టూర్‌కి వెళ్లిన భారత జట్టు ఆ జట్టును చిత్తుగా ఓడించింది. టెస్టులు, వన్డేలు, టీ 20లలో తిరుగులేని విజయాలను సాధించింది. టెస్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకున్న భారత జట్టు, టీ 20 సిరీస్‌ను 3-0 తేడాతో గెలుపొందింది. ఇక 3 మ్యాచుల వన్డేసిరీస్‌ను 2-0 తేడాతో గెలుపొందింది. ఒక మ్యాచ్ వరుణి కారణంగా వర్షార్పణం అయింది.
శ్రీలంక బౌలింగ్ కోచ్‌గా మలింగ
శ్రీలంక బౌలింగ్ లెజెండ్ లసిత్ మలింగకు కొత్త బాధ్యతలు తోడయ్యాయి. శ్రీలంక క్రికెట్ జట్టుకు బౌలింగ్ స్ట్రాటజీ కోచ్‌గా నియమించబడ్డాడు. ఆస్ట్రేలియా జట్టుతో శ్రీలంక జట్టు ఆడే సిరీస్ నుంచి మలింగ తన సేవలను అందించనున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు మలింగతో ఒప్పందం చేసుకుంది.